గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి సంబంధించి టీజీపీఎస్సీ కీలక ప్రకటన చేసింది. జనవరి 18న గ్రూప్-2 రాత పరీక్షల ప్రాథమిక కీని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. జనవరి 18 నుంచి 22 వరకు అభ్యర్థుల లాగిన్‌లో కీ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. అలాగే అభ్యర్థులు ఏమైనా అభ్యంతరాలు తెలపాలనుకుంటే ఆన్‌లోన్‌లేనే తెలియజేయాలని సూచనలు చేశారు.
Also Read: బీజీపీ మేనిఫెస్టోపై స్పందించిన కేజ్రీవాల్.. మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్
శనివారం నుంచి జనవరి 22 సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతారాలు స్వీకరిస్తామని అధికారులు పేర్కొన్నారు. అలాగే అభ్యంతరాలు కేవలం ఆంగ్ల భాషలోనే తెలియజేయాలని సూచించారు. అంతేకాదు అభ్యంతరాలకు తప్పకుండా ఆ అంశం ఏ పుస్తకంలో ఉంది ? దానికి రచయిత ఎవరు ?, ఎడిషన్, పేజీ నంబర్, పబ్లిషర్స్ పేరు లేదా వెబ్‌సైట్ యూఆర్‌ఎల్‌ను పెట్టాలని సూచించారు. ఇక ఈ అభ్యంతారాలు ఈ మెయిల్ ద్వారానే పంపించాలని చెప్పారు.
Also Read: సైఫ్‌పై దాడి వెనుక అండర్‌వరల్డ్ హస్తం ? క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం
ఇదిలా 2024 డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను టీజీపీఎస్సీ విడుదల చేసింది.5.57 లక్షల మంది అభ్యర్థులు ఈ గ్రూప్-2 పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఇందులో దాదాపు సగం మంది అభ్యర్థులే పరీక్షకు హాజరయ్యారు.
Also Read: ఏపీకి గుడ్‌న్యూస్.. వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు కేంద్రం రూ.11,440 ప్యాకెజీ
Also read: ఘోర ప్రమాదం.. 40మంది పాకిస్థానీ వలసదారులను మింగేసిన సముద్రం.. ఎక్కడంటే?