Haryana: హర్యానా నూహ్‌లో మరోసారి ఉద్రికత్త... యువతి సజీవదహనం

హర్యానాలోని నూహ్ జిల్లాఓ మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లహర్‌‌వాడి గ్రామంలో రెండు పార్టీలు కొట్టుకున్నాయి. ఇందులో 32 ఏళ్ల యువతి సజీవ దహనమైంది. యువతి మంటల్లో కాలిపోయింది.

New Update
11

 హర్యానాలోని నూహ్లలో ఆగ్రహావేశాలు చల్లాడం లేదు. మళ్ళీ మళ్ళీ అక్కడ గొడవలు అవుతూనే ఉన్నాయి. లహర్‌‌వాడి గ్రామంలో ఈరోజు రెండు పార్టీలు మళ్ళీ కొట్టుకున్నాయి. ఈ క్రమంలో 32 ఏళ్ల యువతి సజీవ దహనమైంది. యువతి మంటల్లో కాలిపోయింది. దీంతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్త వాతావణం నెలకొంది. ఆ ప్రాంతమంతా పోలీసు బలగలు మోహరించారు. 

Also Read: 75 ఏళ్ళ రాజ్యాంగంపై మోదీ ప్రసంగం..దద్ధరిల్లిన లోక్‌సభ

అసలేం జరిగింది..

ఈ  వివాదం ఏడు నెలల క్రితం మొదలైంది. నుహ్‌లోని లహర్‌వాడి గ్రామంలో భూ వివాదంపై రెండు పార్టీల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇందులో రిజ్వాన్ అనే 21 ఏళ్ల యువకుడు చనిపోయాడు. ఈ క్రమంలో.. నిందితులపై హత్యానేరం కింద పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. దీంతో యువకుడిపై హత్యాయత్నం చేసిన నిందితుల కుటుంబ సభ్యులు గ్రామం వదిలి పారిపోయారు. సంఘటన జరిగిన ఏడు నెలల తర్వాత నిందితుల తరపు వ్యక్తులు పోలీసులను సంప్రదించి గ్రామంలో పునరావాసం కల్పించాలని అభ్యర్థించారు. తర్వాత పున్హానా పోలీస్ స్టేషన్ అధికారులు ఇరువర్గాలను పిలిచి అంగీకారం కల్పించారు. దాంతో సమస్య సాల్వ్ అఇందని అనుకున్నారు. కానీ మళ్ళీ ఇప్పుడు ఇరువర్గాలు గొడవలకు దిగాయి. రాళ్ళ తో దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలోనే షెహనాజ్ అనే యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్రంగా కాలిపోయి షెహనాజ్ మృతి చెందింది. ప్రతీకారం తీర్చుకునేందుకు తమ కూతురిని చంపారని ఆమె తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. 

Also Read: ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’‌లో బిగ్ ట్విస్ట్.. 2034లోనే జమిలీ ఎన్నికలు..!

నూహ్‌లో రెండు వర్గాల మధ్యా జరిగిన గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో మృతురాలి బంధువులు రాళ్లు రువ్వుతున్నారు. కొందరు మహిళలు మరికొందరు మహిళలపై పెట్రోలు చల్లడం కనిపించింది

Also Read: AP: ఎన్టీయార్‌‌కు భారత రత్న సాధిస్తాం–సీఎం చంద్రబాబు నాయుడు

Also Read: రాత్రంతా నిద్రపోని అల్లు అర్జున్ భార్య, పిల్లలు.. గంట గంటకు టెన్సన్ పడుతూ...

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో హమాస్ హస్తం..ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్

పహల్గామ్ ఉగ్రదాడిలో హమాస్ హస్తం ఉందని ఆరోపిస్తోంది ఇజ్రాయెల్. హమాస్ అగ్రనేతలు పాకిస్తాన్ లో ఉన్నరని...లష్కరే తోయిబాతో కలిసి పని చేస్తున్నారని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ ధృవీకరించారు. 

New Update
israel

Israel's Ambassador Reuven Azar

కాశ్మీర్ ఉగ్రదాడి పెద్ద కుట్ర అంటోంది ఇజ్రాయెల్. దాని కోసం చాలారోజుల ముందు నుంచే ప్లాన్ జరిగిందని చెబుతోంది. హమాస్ నాయకులు చాలా కాలం నుంచి పాక్ లో తిష్ట వేశారని...రీసెంట్ గా వారు పీవోకే ను కూడా సందర్శించారని చెబుతున్నారు ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్. సీవోకేలో హమాస్ నేతలు జైష్ ఏ మొహమ్మద్ ఉగ్రవాదులతో సమావేశం అయ్యారని తెలిపారు. ఇజ్రాయెల్ పై హమాస్ దాడి, పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడి ఒక్కలానే జరిగాయని ఆధారాలు చూపిస్తున్నారు. రెండింటికీ పెద్ద తేడా లేదని రూవెన్ అంటున్నారు. హమాస్ సహకారంతోనే పహల్గామ్లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. అప్పుడు ఇజ్రాయెల్‌ పౌరులు సంగీత కార్యక్రమంలో ఉండగా దాడి చేశారని.. ఇప్పుడు పహల్గామ్‌లో కూడా పౌరులు సరదాగా గడుపుతున్న సమయంలో ఎటాక్ చేశారని గుర్తుచేశారు. 

ఇజ్రాయెల్ మద్దతు..

దీంతో పాక్ పై అన్ని విధాలా దాడులు ప్రారంభించింది భారత్. దౌత్యపరమైన సంబంధాలను తెగ్గొట్టుకుంది. దానికి ప్రతిగా పాకిస్తాన్ కూడా అవే చర్యలను అమలు చేస్తోంది. ఈ క్రమంలో ప్రపంచ దేశాధినేతలు అందరూ ప్రధాని మోదీకి ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా కాల్ చేశారని తెలుస్తోంది.  తమ పూర్తి మద్దతు భారత్ కే ఉంటుందని...పాక్ ను లేపేద్దామని చెప్పినట్టు సమాచారం. ఇప్పటికే అమెరికా, రష్యా వంటి దేశాలు భారత్ కు మద్దతును ప్రకటించాయి. ఇప్పుడు ఆ లిస్ట్ లో ఇజ్రాయెల్ కూడా చేరింది. 

today-latest-news-in-telugu | Pahalgam attack | israel | hamas

Also Read: Pakistan: మరో నాలుగు రోజుల్లో యుద్ధం..పాక్ ఢిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్

Advertisment
Advertisment
Advertisment