ఈ మధ్య కాలంలో సపామ్ కాల్స్ బాగా ఎక్కువైపోతున్నాయి. వీటి మాయలో పడి చాలా మంది మోసపోతున్నారు కూడా. దీనికి చెక్ పెట్టేందుకు టెలికాం శాఖ రంగంలోకి దిగింది. దీనికి కోసం ఒక మెబైల్ యాప్‌ను తీసుకువచ్చింది. కేద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా ఈరోజు సంచార్ సాథీ మొబైల్ యాప్‌ను రిలీజ్ చేశారు. ఎవరికైనా స్పామ్ కాల్ వస్తే...సంచార్ సాథీ యాప్ ను ఉపయోగించి మొబైల్ ఫోన్ లాగ్ నుంచి నేరుగా ఫిర్యాదు చేయవచ్చును. తర్వాత స్పామ్ కాల్స్ వచ్చిన ఫన్ నబర్‌ను బ్లాక్ చేసుకోవచ్చును. ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటిలోనూ ఈ యాప్‌ను వినియోగించవచ్చును. ఇప్పటికే ఇలాంటి యాప్‌లు కొన్ని ఉన్నాయి. అయితే ఇవన్నీ ప్రవైట్ కంపెనీల యాప్‌లు. కానీ మొట్టమొదటిసారిగా భారత టెలికాం శాఖ స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టేందుకు యాప్‌ను తీసుకువచ్చింది.
Also Read: ఏపీకి గుడ్‌న్యూస్.. వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు కేంద్రం రూ.11,440 ప్యాకెజీ
సంచార్ సాథీ యాప్ ఉపయోగాలు
స్పామ్ కాల్స్, మెసేజ్‌లు వస్తే వెంటనే కంప్లైంట్ చేసుకోవచ్చును.
మన పేరు మీద ఎన్ని మొబైల్ కనెక్షన్లు ఉన్నాయి. అవి మనవా కాదా అనేది తెలుసుకోవచ్చును. ఒకవేళ మనవి కానీ ఫోన్ నంబర్లు ఏమైనా ఉంటే వెంటనే ఫిర్యాదు చేయవచ్చును.
మొబైల్ పోతే లేదా దొంగతనం అయితే ఓన్ నంబర్‌ను యాప్‌లో నుంచి వెంటనే బ్లాక్ చేసుకోవచ్చును.
ఇక చివరగ మన మొబైల్ ఫోన్ ఒరిజనల్ అవునో కాదో కూడా సంచార్ సాథీ యాప్ ద్వారా తెలుసుకోవచ్చును. దీని కోసం మన ఫోన్‌లో ఉన్న ఐఎంఈఐ నంబర్‌ను ఎంటర్ చేయాలి. సాధారణంగా కొత్త ఫోన్లకు ఈ ప్రాబ్లెమ్ రాదు. కానీ సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనుక్కున్న వాళ్ళకు మాత్రం ఇది బాగా ఉపయోగపడుతుంది.
Also Read: బీజీపీ మేనిఫెస్టోపై స్పందించిన కేజ్రీవాల్.. మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్