/rtv/media/media_files/2025/02/07/sp70reSkJEYiBNz0EWhc.jpg)
tamilnadu pregnant woman molested, thrown out of moving train
తమిళనాడులో మరో దారుణం జరిగింది. రన్నింగ్ ట్రైన్లో 4 నెలల గర్భిణిపై గుర్తు తెలియని దుండగులు అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. దీంతో ఆ మహిళ ప్రతిఘటించడంతో ఆమెను రన్నింగ్ ట్రైన్ నుంచి కిందకి తోసేశారు.
తల్లిని చూసేందుకు
రైల్వే పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. తిరుప్పూర్‌కు చెందిన బాధిత మహిళ కోయంబత్తూరులోని బట్టల తయారీ కంపెనీలో పనిచేస్తుంది. అయితే తన తల్లిని కలవడానికి గురువారం ఉదయం కోయంబత్తూరు నుంచి చిత్తూరు వెళ్లేందుకు ట్రైన్‌లో ప్రయాణించాలని రైల్వే స్టేషన్‌కు వెళ్లింది. అక్కడ ఆమె తిరుపతి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో జనరల్ లేడీస్ కంపార్ట్‌మెంట్‌లోకి ఎక్కింది.
ఇది కూడా చూడండి: దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులపై కేసు.. అసత్య ప్రచారం చేసినందుకేనా?
ఒంటరిగా ఉండటంతో
అయితే ఆ కోచ్‌లో మరో ఏడుగురు మహిళా ప్రయాణికులు ఉన్నారు. కానీ వారు తిరుపత్తూరు జిల్లా జోలార్‌పేటలో దిగిపోయారు. దీంతో ప్రయాణికులు దిగిపోయిన తర్వాత నిందితుడు హీమరాజ్ సహా మరో వ్యక్తి మహిళల కోచ్‌లోకి ఎక్కారు. అప్పటికి ఆమె ఒంటరిగా ఉండటంతో ఆ ఇద్దరినీ హెచ్చరించింది. ఇది లేడీస్ కంపార్ట్‌మెంట్ అని దిగిపోవాలని చెప్పింది.
ఇది కూడా చూడండి: Telangana: సుప్రీం కోర్టు సంచలన తీర్పు..మొదటి పెళ్లి రద్దుకాకపోయినప్పటికీ కూడా రెండో భర్త భరణం ఇవ్వాల్సిందే
A four-month pregnant woman was allegedly molested and pushed out of a speeding train after she fought off her attacker in #TamilNadu's #Vellore on Thursday night. The crime unfolded aboard the #CoimbatoreTirupatiIntercityExpress.
— Hate Detector 🔍 (@HateDetectors) February 7, 2025
According to the #Jolarpet railway police, the… pic.twitter.com/iDK9q1VS6q
లైంగిక దాడికి
అయితే వారు తరువాత స్టేషన్‌లో దిగిపోతామని చెప్పారు. అలా ట్రైన్ కదులుతున్న సమయంలో వారు ఆ బాధిత మహిళపై లైంగిక దాడి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో ఉక్కిరిబిక్కిరి అయిన ఇద్దరు నిందితులు గర్భిణీ స్త్రీని వెల్లూరులోని లాథేరి సమీపంలో కదులుతున్న రైలు నుండి తోసి అక్కడి నుండి పారిపోయారు.
నేర చరిత్ర
అనంతరం ఒక రైల్వే గ్యాంగ్‌మ్యాన్ గమనించి.. గాయపడిన మహిళను వెల్లూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె ప్రస్తుతం చికిత్స పొందుతోంది. దీనికి కారణమైన నిందితుడ్ని పోలీసులు తాజాగా పట్టుకున్నారు. అతనిది వెల్లూర్‌లోని కెవి కుప్పంకు చెందిన కె. హీమరాజ్‌గా గుర్తించారు. అతడు 2022లో రైల్వే పోలీసు పరిధిలోని మహిళలను దోచుకోవడం, వేధించడంలో ఇప్పటికే నేర చరిత్ర కలిగి ఉన్నాడు.