BIG BREAKING: తమిళిసై సౌందరరాజన్ అరెస్టు..

తమిళనాడులో త్రిభాషా వివాదం ముదురుతోంది. ఈ విధానానికి మద్దతుగా బీజేపీ సంతకాల సేకరణ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ పార్టీ నేతలను అడ్డుకున్నారు. బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్‌ను అరెస్టు చేశారు.

New Update
Tamilisai Soundararajan

Tamilisai Soundararajan

జాతీయ విద్యా విధానాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లో అమలు చేసేది లేదని తమిళనాడు సీఎం స్టాలిన్ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. అయితే త్రిభాషా విధానానికి మద్దతుగా బీజేపీ సంతకాల సేకరణ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ పార్టీ నేతలను అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్‌ను అరెస్టు చేశారు. 

Also Read: ఇండియాపై ట్రంప్ విధించే టారిఫ్‌తో ఈ రంగాలు కుదేలు

అయితే తమిళనాడులో  త్రిభాషా విధానానికి మద్దతుగా బుధవారం బీజేపీ ఇంటింటా సంతకాల సేకరణ, ప్రచార, అవగాహన కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. అలాగే డీఎంకే  అఖిల పక్ష సమావేశాన్ని కూడా బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్రం తీసుకొచ్చిన  జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం  మూడు భాషల విధానానికి మద్దతుగా బీజేపీ నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు.  

Also Read: తమిళనాడులో దారుణం.. కుటుంబాన్ని బలి చేసుకున్న రమ్మీ

ప్రజా వ్యతిరేక, అవినీతి విధానాలు, దుష్ర్పవర్తన, శాంతిభద్రతల వైఫల్యం గురించి చర్చించారు. రాబోయే రోజుల్లో తమిళనాడు ప్రజల సంక్షేమం, డీఎంకే ప్రభుత్వ విధానాలను నిలదీసే విధంగా కార్యక్రమాలు చేప్టటాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదిలాఉండగా.. జాతీయ విద్యా విధానం పేరుతో కేంద్రం తమపై హిందీ భాషను బలవంతంగా రుద్దేందుకు యత్నిస్తున్నారని సీఎం స్టాలిన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. హిందీ వల్ల దేశంలో 25 ప్రాంతీయ భాషలు కనుమరుగైపోయాయని తెలిపారు. అందుకే తాము జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు.  

Also Read: మేఘా అవినీతిపై ముంబై హైకోర్టులో విచారణ!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

VIRAL VIDEO: కండక్టర్ కాదు కామాంధుడు.. బస్సులో నిద్రపోతున్న యువతి ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ.. ఛీ ఛీ!

కర్ణాటకలో దారుణం జరిగింది. మంగళూరు సమీపంలోని ముడిపు-స్టేట్ బ్యాంక్ మార్గంలో నడిచే కేఎస్ఆర్టీసీ బస్సులో ఓ యువతిని కండక్టర్ లైంగికంగా వేధించాడు. నిద్రిస్తుండగా ఆమె పక్కనే నిలబడి పదేపదే టచ్ చేశాడు. ఆ వీడియో వైరల్ కావడంతో కండక్టర్‌ను విధుల నుంచి తొలగించారు.

New Update
Conductor sexually harasses young woman sleeping on bus in karnataka

Conductor sexually harasses young woman sleeping on bus in karnataka

కామాంధులు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. ఆడది కనిపిస్తే చాలు క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. మానవత్వం, మంచి మరచి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఒంటరిగా ఉన్నా.. వంద మందిలో ఉన్నా.. పాడు బుద్దితో అతి నీచంగా, అసభ్యకంగా ప్రవర్తిస్తున్నారు. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు ఎవ్వరినీ వదిలి పెట్టడం లేదు. గతం కంటే ఈ మధ్య కాలంలో మహిళలపై అత్యాచార ఘటనలు విపరీతంగా పెరిగిపోయాయి. 

Also Read: Maoist Operation: తెలంగాణ, చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో హై టెన్షన్

తాజాగా అలాంటిదే మరొకటి జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న ఒక యువతిపై కండక్టర్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. నిద్రపోతున్న ఆ యువతి పక్కనే నిలబడి.. చేతులతో టచ్ చేస్తూ లైంగికంగా వేధించాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఆ కండక్టర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆ వీడియో ప్రభుత్వ అధికారుల దృష్టికి వెళ్లడంతో ఆ కామ కండక్టర్‌ను విధుల నుంచి తొలగించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Also Read: కమ్ముకొస్తున్న యుద్ధ మేఘాలు.. LOC దగ్గర రాఫెల్ యుద్ధ విమానాలతో ఎక్స్‌ర్‌సైజ్ ఆక్రమన్

Also Read: ఉలిక్కిపడ్డ 'బెజవాడ'.. ఆ ప్రాంతంలో ఉగ్రవాద కదలికలు..!

నిద్రపోతున్న యువతిపై

ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. మంగళూరు సమీపంలోని ముడిపు-స్టేట్ బ్యాంక్ మార్గంలో నడిచే కేఎస్ఆర్టీసీ బస్సులో ఓ యువతి నిద్రపోతుంది. అదే సమయంలో బస్సు కండక్టర్ ఆమె పక్కకి వచ్చి నిలబడి ఆ యువతిని పదేపదే టచ్ చేస్తూ లైంగికంగా వేధించాడు. ఆమె కూర్చున్న సీట్‌ పక్కనే నిల్చుని మెల్ల మెల్లగా చెయ్యి వేశాడు. ఇది గమనించిన తోటి ప్రయాణీకుడు ఈ సంఘటనను తన మొబైల్ ఫోన్లో రికార్డ్ చేశాడు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. అది కాస్త రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో కేఎస్ఆర్టీసీ అధికారులు ఆ కండక్టర్‌ను విధుల నుంచి తొలగించారు. 

Also Read:Pahalgam Terror Attack: టార్గెట్ హైదరాబాద్‌..  ఆ ప్రాంతాలపైనే ఉగ్రవాదుల ఫోకస్!

viral-news | viral-video | crime news
Advertisment
Advertisment
Advertisment