/rtv/media/media_files/2025/04/01/CSFUho7RzsfVyV5L9Pdx.jpg)
YouTuber Ranveer Allahbadia
ఇటీవల యూట్యూబర్ రణ్‌వీర్ అల్హాబాదియా తల్లిదండ్రుల శృంగారంపై అసభ్యకర వ్యాఖ్యలు చేసి వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన కేసుపై ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. అయితే అతడి పాస్‌పోర్టును అప్పగించేందుకు సుప్రీంకోర్టు అనుమతించలేదు. ఈ కేసులో దర్యాప్తు ముగిసిన తర్వాతే పాస్‌పోర్ట్ విడుదల చేయాలనే పిటిషన్‌ను పరిశీలిస్తామని పేర్కొంది. ముంబయి, గువాహటి, జైపుర్‌లో అతడిపై నమోదైన కేసులపై అరెస్టు చేయకుండా మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఇచ్చిన ఉత్తర్వును పొడిగిస్తున్నామని తెలిపింది.
Also Read: టీచర్ కాదు కామాంధురాలు.. విద్యార్థి తండ్రితో రాసలీలలు.. ఆ తర్వాత!
అయితే పోలీసులకు తన పాస్‌పోర్టును అప్పగించాలని గతంలో కోర్టు చేసిన ఆదేశాలను సవరించాలని కోరుతూ రణ్‌వీర్ కోర్టును ఆశ్రయించారు. ఇకనుంచి తాను షోలలో అమర్యాదకర వ్యాఖ్యల చేయనని చెప్పారు. బాధ్యతగా నడుచుకుంటానని తెలిపారు. తనవద్ద పాస్‌పోర్టు లేకపోవడం వల్ల విదేశాలకు వెళ్లలేకపోతున్నామని.. ఇది తన జీవనోపాధిపై ప్రభావం చూపుతుందని తన పిటిషన్‌లో తెలిపారు. దీనిపై తాజాగా విచారించిన సుప్రీంకోర్టు పాస్‌పోర్టు ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ కేసులో దర్యాప్తు ముగిసిన తర్వాతే పాస్‌పోర్ట్ విడుదల చేయాలనే పిటిషన్‌ను పరిశీలిస్తామని స్పష్టం చేసింది.
Also Read: భర్తముందే భార్యపై గ్యాంగ్ రేప్.. ఊరికి వెళ్లి వస్తుండగా నడిరోడ్డుపై ఆపి!
ఇదిలాఉండగా ఇటీవల ఓ కామెడీ షోలో పాల్గొన్న రణ్‌వీర్ అల్హాబాదియా ఓ యువతితో తన తల్లిదండ్రుల శృంగారంపై ప్రశ్నించి వివాదంలో ఇరుక్కున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవ్వడంతో చివరికి మహారాష్ట్ర సైబర్ విభాగం ఈ షో సభ్యులపై కేసు నమోదు చేసింది. మిగతా చోట్ల కూడా రణ్‌వీర్‌పై కేసులు నమోదయ్యాయి. దీంతో అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం కూడా చివాట్లు పెట్టింది. పాపులారిటీ ఉన్నంత మాత్రానా ఏది పడితే అది మాట్లాడటాన్ని సమాజం అనుమతించదని చెప్పింది. దేశం విడిచి ఎక్కడికి వెళ్లొద్దని, పాస్‌పోర్టును అప్పగించాలని ఆదేశించింది.
ranveer allahbadia | youtuber | rtv-news