/rtv/media/media_files/2025/02/10/rTD3kRrn1eINvnMhmjCl.jpg)
Supreme Court
ఇటీవల ఓ న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు కుప్పలు తెప్పలుగా కనిపించిన విషయం తెలిసిందే. అయితే న్యాయమూర్తులు అందరూ కూడా ఈ విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. లెక్కలేనన్ని నోట్ల కట్టలు బయటపడటంతో న్యాయ వ్యవస్థపై అనేక అనుమానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరూ కలిసి తమ ఆస్తులను కోర్టు సమావేశంలో ప్రకటించాలని ఏకగ్రీవంగా అంగీకరించారు.
ఇది కూడా చూడండి: Trump Tarriffs:ప్రతీకార సుంకాల పై ట్రంప్ కీలక ప్రకటన..భారత్ కు ఎంత శాతం విధించారంటే..!
All #SupremeCourt judges unanimously agreed to declare their assets. 30 out of 33 judges, including the Chief Justice, have submitted their details. Judges must inform the Chief Justice of any significant asset additions, but publication remains optional. pic.twitter.com/uoFAjOqjr1
— All India Radio News (@airnewsalerts) April 3, 2025
ఇది కూడా చూడండి: UPI: నిలిచిపోయిన యూపీఐ సేవలు...ఇబ్బందుల్లో వినియోగదారులు
న్యాయమూర్తులు అందరూ కలిసి..
న్యాయమూర్తుల మొత్తం ఆస్తుల ప్రకటనను సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయనున్నారు. న్యాయమూర్తుల పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే వారి ఆస్తుల వివరాలను బహిరంగ పరచాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. అయితే ప్రస్తుతం సుప్రీంకోర్టులో సీజేఐతో సహా మొత్తం 30 మంది న్యాయమూర్తులు ఉన్నారు. వీరంతా తమ ఆస్తుల వివరాలను బహిరంగంగా వెల్లడించారు.
ఇది కూడా చూడండి: Digital arrest: రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్‌ని కూడా వదలని కేటుగాళ్లు.. రూ.3.4 కోట్లు మోసం
Supreme Court judges to voluntarily disclose their assets on assuming office.
— Mahima Katal (@MahimaKatal) April 3, 2025
Data will be published on the SC website to promote transparency and accountability. #SupremeCourt #JudicialTransparency pic.twitter.com/uDdgcaaqmX
ఇదిలా ఉండగా ఇటీవల జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. అగ్ని ప్రమాదం జరగడంతో అగ్నిమాపక దళం ఆర్పుతుండగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
ఇది కూడా చూడండి: Maoist: వారికి శిక్ష తప్పదు.. రేణుక ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టుల సంచలన లేఖ!