/rtv/media/media_files/2025/03/04/2065VwwDJAkNwAxSSPL9.jpg)
Supreme Court
సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అందుబాటు ధరల్లో వైద్య సదుపాయాలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీరియస్ అయ్యింది. ప్రభుత్వాల వైఫల్యమే ప్రైవేటు ఆస్పత్రులకు ప్రోత్సాహకంగా మారిందని పేర్కొంది. ప్రైవేటు ఆస్పత్రులన్నీ కూడా రోగులు, వాళ్ల బంధువులతో బలవంతంగా ఎక్కువ ధరలతో ఉన్న మందులు కొనుగోలు చేయిస్తున్నాయని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై మంగళవారం విచారణ జరిగింది.
Also Read: అసెంబ్లీలో గుట్కా నమిలి ఉమ్మిన ఎమ్మెల్యే.. వీడియో వైరల్
ప్రైవేటు ఆస్పత్రులు రోగులను తమ ఫార్మసీ నుంచే ఔషధాలు కొనుగోలు చేయాలని బలవంతం చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ కోరారు. దీనిపై చర్యలు తీసుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని.. దీనివల్ల రోగులు దోపిడీకి గురవుతున్నారని చెప్పారు. అయితే పిటిషనర్ వాదనలసు సుప్రీంకోర్టు సమర్థించింది. రోగులకు సూచించే ఔషధం వేరే చోట తక్కువ ధరకు దొరుకుతున్నప్పుడు.. దాన్ని తమ ఫార్మసీలోనే కొనాలని ప్రైవేటు ఆస్పత్రులు బలవంతం చేయకూడదని చెప్పింది. ప్రైవేటు ఆస్పత్రులు ఇలా బలవంతం చేయకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే అని పేర్కొంది.
Also Read: హైవేపై ఘోర ప్రమాదం.. బైక్ ను తప్పించబోయి బస్సు పల్టీలు.. 36 మందికి గాయాలు!
పేదవాళ్లకు ప్రాణాధార ఔషధాలు అందుబాటులో దొరకడం కష్టమైపోయిందని తెలిపింది. ప్రజలు ఇలాంటి దోపిడికి గురికాకుండా ఉండేందుకు తగిన మార్గదర్శకాలు రూపొందిచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాదు దీనికి సంబంధించి గతంలో కూడా సుప్రీంకోర్టు రాష్ట్రాలకు నోటీలు జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బిహార్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలు దీనికి స్పందిస్తూ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశాయి.
Also Read: భర్తపై విష ప్రయోగం.. ఫస్ట్ నైట్ రోజు భర్త ముందే ప్రియుడితో..
కేంద్రం ఇచ్చిన ధరల నియంత్రణ ఆదేశాలపైనే తాము ఆధారపడతామని చెప్పాయి. అత్యవసర ఔషధాలు అందుబాటు ధరలో లభించేలా చూసేందుకు వాటి ధరలు నిర్ణయించినట్లు పేర్కొన్నాయి. ఆస్పత్రిల్లో ఉండే ఫార్మసీలో మందులు కొనుగోలు చేయాలనే ఒత్తిడి లేదని కేంద్రం కోర్టుకు చెప్పింది.