Newborn trafficked : నవజాత శిశువుల అక్రమ రవాణా వ్యవహారాలపై ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.దేశంలోని ఏ ఆసుపత్రిలో అయినా చిన్నారుల అక్రమ రవాణా జరగినట్లు నిరూపితమైతే,వెంటనే ఆ ఆసుపత్రి లైసెన్స్‌ను రద్దు చేయాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ తరహా నేరాలను అడ్డుకునేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన మార్గదర్శకాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది.ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని ఓ ఆసుపత్రిలో ఒక నవజాత శిశువు చోరీకి గురైన ఘటన వెలుగులోకి వచ్చింది.ఈ విషయాన్ని గుర్తించిన శిశువు తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.అప్పటికే ఆ చిన్నారిని ఓవ్యక్తి అక్రమంగా విక్రయించినట్లు తెలిసింది. అతనిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
Also Read: Mamya Shajaffar: ట్రెడిషనల్ లుక్‌లో మమ్యా షజాఫర్.. ఎల్లో డ్రెస్‌లో లక్ష్మీదేవిలా కనిపిస్తుందిగా!
అనంతరం అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించిన దంపతులకు నిరాశే మిగిలింది. కేసును విచారించిన న్యాయస్థానం నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో తమకు న్యాయం జరగలేదని ఆరోపిస్తూ.. బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ కేసును అత్యున్నత న్యాయస్థానం విచారించింది. చిన్నారుల అక్రమరవాణా కేసులపై యూపీ ప్రభుత్వ తీరు, నిందితుడికి బెయిల్ మంజూరుచేసిన అలహాబాద్ హైకోర్టుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. అక్రమ రవాణా పెండింగ్ కేసులకు సంబంధించి విచారణ ఎలా కొనసాగుతోందో తెలియజేయాలని దేశవ్యాప్తంగా హైకోర్టులను జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. నిందితుడి బెయిల్ రద్దు చేసింది. ‘‘ఇలాంటి కేసులకు సంబంధించిన విచారణను 6 నెలల లోపు పూర్తిచేయాలి. రోజూవారీ విచారణను కూడా నిర్వహించాలి’’ అని ఆదేశాలు జారీ చేసింది.
Also Read: Anna Lezhneva: పవన్ సతీమణి తలనీలాలు ఇవ్వడంపై వివాదం.. వైరల్ అవుతున్న వీడియోలు!
ఏ ఆస్పత్రిలోనైనా అక్రమ రవాణా జరిగినట్లు తేలితే లైసెన్స్ రద్దు చేయాలని సంబంధిత అధికారులకు సుప్రీంకోర్టు ఆదేశించింది. ‘‘కుమారుడిని పొందేందుకు ఆశపడిన నిందితుడు.. రూ.4 లక్షలకు చిన్నారిని పొందాడు. ఒకవేళ బిడ్డ కావాలని అనుకుంటే అక్రమ రవాణా చేసేవారిని సంప్రదించాల్సింది కాదు. ఆ చిన్నారిని దొంగతనం చేసి తనకు అందించారనే విషయం నిందితుడికి బాగా తెలుసు. ఇలాంటివారు సమాజానికి ముప్పు. నిందితులు ప్రతి వారం పోలీస్ స్టేషన్‌లో తప్పకుండా హాజరుకావాలి. కానీ, దీనిపై దృష్టిసారించకుండా హైకోర్టు బెయిల్ ఇచ్చింది. నిందితులను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
Also Read: అయ్యప్ప భక్తులకు అదిరిపోయే శుభవార్త.. ఆన్‌లైన్‌లో బంగారు నాణేలు.. ఇలా బుక్ చేసుకోండి!
''తనకు కుమారుడు కావాలని ఆశపడ్డ నిందితుడు, రూ.4 లక్షలిచ్చి ఓ చిన్నారిని కొనుగోలు చేశాడు. బిడ్డ కావాలనుకుంటే, చట్టబద్ధ మార్గంలో దత్తత తీసుకోవాలి కానీ అక్రమ రవాణాదారులను సంప్రదించడం ఎంత మాత్రం సమంజసం కాదు. ఆ చిన్నారి దొంగతనమై తనకు ఇచ్చారని నిందితుడికి స్పష్టంగా తెలిసే పరిస్థితిలో ఉన్నాడు. ఇలాంటి వ్యక్తులు సమాజానికి ప్రమాదకరం. వీరు ప్రతి వారం పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాల్సిందే. అయితే ఇలాంటి అంశాలపై దృష్టి పెట్టకుండా హైకోర్టు నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. పోలీసులు నిందితులను పట్టుకునే విషయంలో పూర్తిగా విఫలమయ్యారు'' అని ధర్మాసనం తీవ్రంగా వ్యాఖ్యానించింది.
Also Read: Jio Cheapest Recharge Plan: ఇదేంది మావా ప్లాన్ అదిరింది.. జియో చీపెస్ట్ రీఛార్జ్ ధర- 90 రోజులు ఫ్రీ హాట్‌స్టార్