Stalin Resigns: స్టాలిన్ రాజీనామా!

తమిళనాడు రాజకీయాల్లో దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న ఎం.కె. స్టాలిన్ పరాజయం పాలవ్వడం, నటుడు విజయ్ నేతృత్వంలోని TVK ప్రభంజనం సృష్టించడం భారత రాజకీయాల్లోనే పెను సంచలనంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన పదవికి రాజీనామా చేశారు.

New Update
FotoJet - 2026-05-05T123329.854

Stalin resigns

Stalin Resigns: తమిళనాడు రాజకీయాల్లో ఒక శకం ముగిసి, సరికొత్త శకం ఆరంభమైంది. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న ఎం.కె. స్టాలిన్ పరాజయం పాలవ్వడం, నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) ప్రభంజనం సృష్టించడం భారత రాజకీయాల్లోనే పెను సంచలనంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల ఫలితాల్లో డీఎంకే కూటమి ఆశించిన స్థానాలను సాధించలేకపోవడంతో పాటు, స్వయంగా స్టాలిన్ తన కంచుకోట అయిన కొలత్తూర్ నియోజకవర్గంలో ఓడిపోవడం డీఎంకే శ్రేణులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రజాతీర్పును గౌరవిస్తూ ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపారు. తమిళనాడు చరిత్రలో పదవిలో ఉండగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నాలుగో ముఖ్యమంత్రిగా స్టాలిన్ నిలిచారు.

Also Read: 'గిల్లి' నుంచి 'లియో' వరకు.. విజయ్-త్రిష హిట్ ట్రాక్ రికార్డ్ ఇదే!

స్టాలిన్‌ను ఆయన సొంత నియోజకవర్గంలోనే ఓడించి టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు (75) 'జైంట్ కిల్లర్‌'గా అవతరించారు.  గతంలో స్టాలిన్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉండి, విభేదాల కారణంగా డీఎంకే వీడిన వీఎస్ బాబు.. ఇప్పుడు అదే స్టాలిన్‌పై విజయం సాధించి తన పాత పంతాన్ని తీర్చుకున్నారు.అద్భుత విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్న టీవీకే అధినేత విజయ్, ఈరోజు ఉదయం పనైయూర్‌లోని పార్టీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు.ఈ సమావేశంలో గెలిచిన అభ్యర్థులను ఆయన అభినందించారు.ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ (118) కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.ముఖ్యంగా అన్నా డీఎంకే ,కాంగ్రెస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు టచ్‌లోకి వచ్చినట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, వారి మద్దతును ఎలా కూడగట్టాలనే అంశంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Also Read: సినిమా రంగం నుంచి పెళ్లి వరకు.. త్రిష, జయలలిత మధ్య ఉన్న 6 పోలికలు ఏంటో తెలుసా?

ఓటమి అనంతరం స్టాలిన్ 'X' (ట్విట్టర్) వేదికగా స్పందించారు. "ప్రజా తీర్పును మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాం. గత ఐదేళ్లుగా మేము అందించిన సుపరిపాలన ప్రజలకు తెలుసు. మాకు ఓటు వేసిన వారికీ, వేయని వారికీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను" అని పేర్కొన్నారు. అభివృద్ధి పనులు చేసినప్పటికీ, మార్పు కోరుకున్న ఓటర్లు టీవీకే వైపు మొగ్గు చూపడం గమనార్హం.

Also Read: ‘దళపతి’ టూ ‘సీఎం’ విజయ్.. విక్టరీతో మారిన ‘జన నాయకన్’ టైటిల్..!

రాజకీయ విశ్లేషకుల ప్రకారం, స్టాలిన్ ఓటమికి మూడు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి:
విజయ్ మేనియా: మొదటిసారి ఎన్నికల్లోకి వచ్చిన విజయ్, యువతను, కొత్త ఓటర్లను విపరీతంగా ఆకర్షించారు.
ప్రభుత్వ వ్యతిరేకత: ఐదేళ్ల పాలన తర్వాత సహజంగా వచ్చే వ్యతిరేకత డీఎంకేను దెబ్బతీసింది.
వీఎస్ బాబు అనుభవం: నియోజకవర్గంలో పట్టున్న వీఎస్ బాబును బరిలోకి దింపడం విజయ్ చేసిన మాస్టర్ ప్లాన్ అని చెప్పవచ్చు.

Also Read: ‘ఫౌజీ’ షూటింగ్ కు వెళ్తుండగా ప్రమాదం.. ఒకరు మృతి!

తమిళనాడు ఇప్పుడు ఒక హంగ్ అసెంబ్లీని చూస్తోంది. అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేకు గవర్నర్ ఆహ్వానం ఎప్పుడు అందుతుందో, విజయ్ ఎప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారో అని అభిమానులు, ప్రజలు ఆసక్తిగా వేచి చూస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు