Siddaramaiah : కర్ణాటక పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. సిద్ధరామయ్య మాస్టర్ ప్లాన్!

కర్ణాటక కాంగ్రెస్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. గత కొన్ని నెలలుగా సాగుతున్న అధికార పోరాటానికి తెరదించుతూ.. ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య గురువారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

New Update
siddramaiah

కర్ణాటక కాంగ్రెస్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. గత కొన్ని నెలలుగా సాగుతున్న అధికార పోరాటానికి తెరదించుతూ.. ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య గురువారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అధిష్టానంతో కుదిరిన రెండున్నరేళ్ల అధికార మార్పిడి ఒప్పందంలో భాగంగా డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కేందుకు దారి సుగమమైంది. అయితే, సీఎం కుర్చీ దిగిపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలపై తన పట్టు కోల్పోకుండా ఉండేందుకు, డీకే శివకుమార్‌కు చెక్ పెట్టేందుకు సిద్ధరామయ్య ఒక సరికొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చారు.

కోఆర్డినేషన్ కమిటీ

ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి మధ్య వారధిగా ఉండేందుకు ఒక కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేయాలని, దానికి తనను ఛైర్మన్‌గా నియమించాలని సిద్ధరామయ్య కాంగ్రెస్ అధిష్టానానికి ప్రతిపాదించారు. గతంలో 2018 లో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సిద్ధరామయ్య ఇలాంటి సమన్వయ కమిటీకి అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఇప్పుడు మళ్లీ అదే మోడల్‌ను తెరపైకి తెచ్చి, రాష్ట్రంలో మరో ప్రత్యామ్నాయ పవర్ సెంటర్ గా కొనసాగాలని ఆయన భావిస్తున్నారు.

ఢిల్లీ వెళ్లిన సిద్ధరామయ్య తన కుమారుడు యతీంద్రతో కలిసి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలను కలిశారు. ఈ భేటీలో కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటుతో పాటు, తన కుమారుడు యతీంద్రకు కొత్త ప్రభుత్వంలో మంత్రి పదవి ఇవ్వాలని, తన ప్రధాన అనుచరుడికి డిప్యూటీ సీఎం పదవి కేటాయించాలని సిద్ధరామయ్య డిమాండ్ చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

అయితే సిద్ధరామయ్య పెట్టిన కోఆర్డినేషన్ కమిటీ ప్రతిపాదనకు కాంగ్రెస్ హైకమాండ్ అంతగా సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. గతంలో కూటమి ప్రభుత్వం కాబట్టి సమన్వయ కమిటీ అవసరమైందని, కానీ ఇప్పుడు కాంగ్రెస్‌కు పూర్తి మెజారిటీ ఉన్నందున ఇలాంటి కమిటీల అవసరం లేదని అధిష్టానం భావిస్తోంది. సిద్ధరామయ్యకు రాజ్యసభ సీటు ఇచ్చి, జాతీయ రాజకీయాల్లో పెద్ద పీట వేస్తామని కాంగ్రెస్ ఆఫర్ చేసినప్పటికీ, ఆయన మాత్రం కర్ణాటక రాజకీయాల్లోనే ఉంటానని భీష్మించుకు కూర్చున్నారు. 

Advertisment
తాజా కథనాలు