మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన పలు కీలక విషయాలు వెల్లడించారు. తాను అడిగితేనే మాజీ సీఎం ఏక్‌నాథ్ షిండే డిప్యూటీ సీఎంగా ఉండేందుకు అంగీకరించారని పేర్కొన్నారు. '' మహాయుతి కూటమి ఎన్నికల్లో గెలిచిన అనంతరం మొదటి సమావేశంలోనే బీజేపీ నుంచి సీఎం అభ్యర్థి ఉండేందుకు షిండే అంగీకరించారు. షిండే ప్రభుత్వంలో భాగం కాకూడదని.. మహాయుతి కూటమి సజావుగా సాగేందుకు నేతృత్వం వహిస్తే చాలని శివసేన పార్టీలో ఓ వర్గం భావించింది. Also Read: రాజ్యసభలో కరెన్సీ నోట్ల కలకలం.. దొరికిన కాంగ్రెస్ ఎంపీ తమ పార్టీ నుంచే ముఖ్యమంత్రి కావాలని శివసేన నాయకులు కోరుకున్నారు. షిండేతో నాకు వ్యక్తిగతంగా మంచి సంబంధాలున్నాయి. ప్రమాణస్వీకారోత్స కార్యక్రమానికి రెండ్రోజుల ముందే నేను ఆయనతో భేటీ అయ్యాను. ఆరోజునే డిప్యూటీ సీఎంగా ఉండేందుకు షిండే అంగీకరించారని'' ఫడ్నవీస్ అన్నారు. ఇదిలాఉండగా.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి 230 స్థానాల్లో గెలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి ఎవరూ అనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కొన్ని రోజులుగా దీనిపై చర్చలు జరిగాయి. అయితే బీజేపీ సీనియర్ లీడర్ దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అయ్యే ఛాన్స్ ఉందని అందరూ భావించారు. ఊహించినట్లుగానే బుధవారం జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ఫడ్నవీస్‌ను సీఎంగా ఎన్నుకున్నారు. Also Read: వడ్డీ రేట్లు యథాతథమే..ఎలాంటి మార్పులు లేవు:ఆర్బీఐ గవర్నర్! ఇదిలాఉండగా ముందుగా షిండే డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకునేందుకు ఒప్పుకోలేదనే వార్తలు వచ్చాయి. కానీ షిండే.. సీఎం ఎంపికపై ప్రధాని మోదీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. చివరికీ ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకునేందుకు అంగీకరించారు. గురువారం సాయంత్రం సీఎంగా ఫడ్నవీస్, ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్‌లు డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేశారు. Also Read: మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్! Also Read: నిఖేశ్‌కుమార్ ఫ్రెండ్ లాకర్‌లో కిలోన్నర బంగారం, వజ్రాభరణాలు!