/rtv/media/media_files/2025/03/01/0EBIIeeebqkSW6ADO1US.jpg)
Kerala Mass murder
వెంజమూరుకు చెందిన 23 ఏళ్ళ అఫాన్ కుటుంబానికి రూ.65 లక్షలు అప్పు ఉంది. దీనిని తీర్చాలంటూ 14 మంది ప్రైవేట్ వ్యక్తులు వెంటపడుతూ ఉండేవారు. అఫాన్ తండ్రి సౌదీలో ఉండేవాడు. స్థానికంగా అప్పుల వాళ్ల ఒత్తిడిన అఫాన్ తట్టుకోలేకపోయాడు. ఈ విషయంలో అఫాన్ బాబాయె, పిన్ని, నానమ్మ ఏ సహాయం చేయలేదు. దాంతో వారి మీద కోసం పెంచుకున్నాడు. అప్పుల వారి ఒత్తిడి నుంచి తప్పించుకోవాలంటే ఆత్మహత్యే శరణ్యం అని నిర్ణయించుకున్నాడు. తల్లి, సోదరుడితో కలిసి ఆత్మహత్య చేసుకుందామని ప్రతిపాదిస్తే అందుకు తల్లి నిరాకరించడంతో హత్యలకు ప్రణాళిక రచించాడు.
వరుసగా హత్యలు..
ఇందులో భాగంగా మొదట తల్లిపై దాడి చేసి చంపేశాడు. ఆ తర్వాత నాన్నమ్మ దగ్గరకు వెళ్ళి ఆమె బంగారు గొలుసు దొంగతనం చేశాడు. తర్వాత ఆమెను కూడా చంపేశాడు. అక్కడ నుంచి బాబాయ్, పిన్ని ఇంటికి వెళ్ళి వారిద్దరినీ కూడా హతమార్చాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఉన్న 13 ఏళ్ళ తమ్ముడిని, ప్రేమసి ఫర్సానాను కూడా మట్టుబెట్టాడు. తాను చనిపోతే ప్రియురాలు ఒంటరిది అయిపోతుందని భావనతోనే ఆమెను చంపానని చెబుతున్నాడు అఫాన్.
అయితే అఫాన్ తల్లి చనిపోలేదు. ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఇంత జరిగినా ఆమె మాత్రం తన కొడుకుపై ఫిర్యాదు చేయలేదు. అఫాన్ తనపై దాడి చేయలేదని...తానే మంచం పై నుంచి పడిపోయానని చెప్పింది. నిజంగానే కొడుకు ఏం చేశాడన్నది ఆమెకు తెలీదని పోలీసులు చెబుతున్నారు. సౌదీలో ఉన్న అఫాన్ తండ్రి రహీమ్ కూడా సౌదీ నుంచి తిరిగొచ్చాడు. తన కుటుంబ అప్పులు ఈ స్థాయిలో ఉన్నట్లు తనకు తెలీదని అతను పోలీసులకు తెలిపారు. మరోవైపు అఫాన్ పోలీస్ కస్టడీలో ఉన్నాడు. అతని మానసిక స్థితిని తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.