Holidays: విద్యార్థులకు శుభవార్త.. స్కూళ్లకు 4 రోజులు సెలవులే సెలవులు!

కాలుష్యం కారణంగా ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ఇచ్చింది. ఉత్తర భారత రాష్ట్రాలను ప్రస్తుతం తీవ్రమైన కాలుష్యం సమస్య వేధిస్తున్న నేపథ్యంలో దాన్ని కట్టడి చేసే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

New Update
Telangana: రేపటి నుంచే తెలంగాణలో బడులు ప్రారంభం

Holidays:

ఉత్తర భారతాన్ని దీపావళి నాటి నుంచి కాలుష్యం తీవ్రంగా వేధిస్తోంది. దానికితోడు శీతాకాలం కూడా ప్రారంభం కావడంతో పాటు గాలి కాలుష్యం కూడా విపరీతంగా పెరిగిపోయింది. దీంతో పరిస్థితి మరింత తీవ్రంగా తయారయ్యింది.ఈ నేపథ్యంలోనే పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కాలుష్య కట్టడికి చర్యలు తీసుకునేందుకు ముందుకు వస్తున్నాయి. ఇందులో భాగంగానే స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తోంది. ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని సూచించారు. 

Also Read: USA: అమెరికాకు పొంచి ఉన్న ముప్పు..దూసుకొస్తున్న బాంబ్ సైక్లోన్

అంతేకాకుండా అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని అధికారులు తెలుపుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఉత్తర భారత రాష్ట్రాలైన ఢిల్లీ, హర్యానా, పంజా, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్రలో కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు తక్షణ చర్యలను అమలు చేస్తున్నాయి. ప్రభావిత రాష్ట్రాల్లో గాలి నాణ్యత సూచీలు ప్రమాదకరమైన స్థాయికి మించి నమోదవుతుండటంతో విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా అధికారులు చర్యలు చేపడుతున్నారు.

Also Read: AP Rains: ముంచుకొస్తున్న మరో అల్పపీడనం... ఆ రెండు రోజులు వానలే వానలు!

హర్యానాలో గాలి నాణ్యత సూచీ - ఏక్యూఐ 320 నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 5వ తరగతి వరకు విద్యార్థులకు హర్యానా ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈనెల 22వ తేదీ వరకు ఈ సెలవులు కొనసాగే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.

Also Read: విడిపోతున్న రెహమాన్ దంపతులు..ప్రకటించిన భార్య సైరా

స్థానిక గాలి నాణ్యత పరిస్థితులను బట్టి సెలవును పొడిగించడానికి లేదా ఆన్‌లైన్ తరగతులకు మార్చడానికి డిప్యూటీ కమిషనర్‌లను అనుమతిస్తూ డైరైక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆదేశాలు జారీ చేసింది.ఇక అధికారిక ఉత్తర్వులు జారీ చేయనప్పటికీ.. పంజాబ్ ప్రభుత్వం కూడా స్కూళ్లకు సెలవులు ప్రకటించే పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. గాలి నాణ్యత సూచీ 207 నమోదు కావడంతో ముందస్తుగానే జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది.

Also Read: మరో విషాదం.. అమెరికాలో హైదరాబాద్‌ యువకుడు మృతి

 విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్కూళ్లకు సెలవులు ప్రకటించే అవకాశాలు కనపడుతున్నాయి. తీవ్రమైన గాలి కాలుష్యం దృష్ట్యా పాఠశాలలను మూసివేసి ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని అధికారులు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే బోర్డు పరీక్షలకు సిద్ధమవుతున్న 10, 12 తరగతుల విద్యార్థులు మాత్రం స్కూలుకు రావాలని అధికారులు తెలిపారు.

 

Advertisment
Advertisment
తాజా కథనాలు