/rtv/media/media_files/2025/03/27/mE4Yamg2XAgK5mVdosvQ.jpg)
Russian President Vladimir Putin to visit India soon
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్‌కు రానున్నారు. ఈ విషయాన్ని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ ప్రకటించారు. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం మొదలైన తర్వాత పుతిన్ భారత్‌కు రానుడండం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇటీవల రష్యాలో పర్యటించిన సంగతి తెలిసిందే. అప్పుడు వెళ్లినప్పుడు ప్రధాని మోదీ పుతిన్‌ను భారత్‌కు రావాలని ఆహ్వానించారు.
Also Read: పవన్ కళ్యాణ్ ఇలాకాలో 12 మంది అమ్మాయిలతో రచ్చ రచ్చ.. వీడియో చూశారా?
దీనిపై క్రెమ్లిన్ వర్గాలు ఓ కీలక ప్రకటన చేశాయి.'' మోదీ మూడోసారి ప్రధానిగా గెలిచిన తర్వాత మొదటగా మా దేశానికే వచ్చారు. ఇప్పుడు మా వంతు వచ్చింది. అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని'' సెర్గీ లావ్రోవ్ అన్నారు. అయితే ఆయన ఎప్పుడు భారత్‌కు రానున్నారనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇదిలాఉండగా భారత్-- రష్యా మధ్య సంబంధాలు బలంగా ఉన్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ యుద్ధం వల్ల కూడా ఈ సంబంధాలపై ఎలాంటి ప్రభావం పడలేదు.
Also Read: హిందీపై యోగి, స్టాలిన్ మధ్య మాటల యుద్ధం.. బ్లాక్ కామెడీ అంటూ!
మరోవైపు రష్యా ఉక్రెయిన్ మధ్య చర్చలు జరపడం, శాంతి ఒప్పందం వల్లే యుద్ధం ఆగుతుందని భారత్ ముందునుంచే చెబుతోంది. గతంలో పుతిన్ కూడా చాలాసార్లు భారత పర్యటనకు వచ్చారు. 2000లో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాగా మొదటిసారిగా ఆయన భారత్‌కు వచ్చారు. ఆ తర్వాత వివిధ సదస్సులు, ద్వైపాక్షిక ఒప్పందాల కోసం 2004, 2010, 2012, 2014, 2018, 2021లో వచ్చారు. ప్రధాని మోదీ నాలుగు సార్లు రష్యాకు వెళ్లారు. 2015లో మొదటిసారిగా బ్రిక్స్ సదస్సు కోసం వెళ్లారు. ఆ తర్వాత 2017, 2019,2024లో పర్యటించారు.
Also read: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో చనిపోతాడు
pm modi