DMK మేనిఫెస్టో విడుదల.. మహిళలకు నెలకు రూ.2 వేలు, పెన్షన్ పెంపు, ఉచిత విద్యుత్..

తమిళనాడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార డీఎంకే పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. సీఎం స్టాలిన్ ఆదివారం ఈ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. గతేడాది అమలు చేసిన స్కీమ్‌లకు కొనసాగింపుగా, మరిన్ని వినూత్న హామీలతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు

New Update
DMK's Tamil Nadu poll manifesto released

DMK's Tamil Nadu poll manifesto released

తమిళనాడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార డీఎంకే పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. సీఎం స్టాలిన్ ఆదివారం ఈ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. గతేడాది అమలు చేసిన స్కీమ్‌లకు కొనసాగింపుగా, మరిన్ని వినూత్న హామీలతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఈసారి మేనిఫెస్టోలో మహిళా సంక్షేమం, విద్య, మౌలిక సదుపాయాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. పార్టీ కార్యాలయంలో సీఎం స్టాలిన్ మాట్లాడుతూ డీఎంకే గతంలో ఇచ్చిన హామీలు అమలు చేసిందన్నారు. ఈసారి కూడా మళ్లీ గెలిస్తే ప్రస్తుతం ఉన్న సంక్షేమ పథకాలను మరింత పెంచుతామన్నారు. 

Also Read: దూసుకుపోతున్న మహిళలు.. పురుషుల కన్నా ఎక్కువ జీతాలు వీళ్లకే.. రిపోర్టులో సంచలన విషయాలు

మేనిఫెస్టోలోని హామీలు

1.మహిళలకు ప్రతినెల ఇచ్చే సాయాన్ని రూ.1000 నుంచి రూ.2 వేలకు పెంపు 
2.వృద్ధాప్య పెన్షన్ రూ. 2,000కు పెంపు
3.బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రస్తుతం 1 నుంచి 5వ తరగతి ఉంది. ఈ స్కీమ్‌ 8వ తరగతి వరకు పెంపు
4.ఉన్నత విద్య చదివే 35 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు 
5.మహిళల స్వయం సహాయక సంఘాలకు రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు
6.ముఖ్యమంత్రి ఆరోగ్య బీమా పథకం కింద ఇచ్చే ప్రయోజనం రూ.లక్షకు పెంపు
7.మీటర్లు లేకుండా రైతులకు ఉచిత పంప్ సెట్లు పంపిణీ
8.20 లక్షల మందికిపైగా లబ్ధిదారులకు ఉచిత విద్యుత్ కొనసాగింపు
9.ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలిసిస్ యూనిట్ల సంఖ్య రెండురేట్లు పెంపు
10.రూ.5 లక్షల వరకు వైద్య బీమా
12.ఐదేళ్లలో 10 లక్షల ఇళ్లు నిర్మాణం
13.టెక్నాలజీ రంగంలో ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు నియో టైడల్ పార్కుల ఏర్పాటు
14.రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు రూ.18 లక్షల కోట్లు పెట్టుబడులు ఆకర్షించడం టార్గెట్

15.గృహిణులు వాషింగ్ మెషీన్, టీవీ, ఫ్రిజ్, మిక్సి లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేసేందుకు రూ.8,000 విలువైన కూపన్లు

Also Read: టీవీకే అభ్యర్థుల లిస్టు విడుదల.. రెండుచోట్ల నుంచి బరిలోకి విజయ్‌


 

Advertisment
తాజా కథనాలు