/rtv/media/media_files/2026/04/11/electric-vehicle-policy-2026-04-11-15-53-51.jpg)
Electric Vehicle Policy
Electric Vehicle Policy: దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని కాలుష్యం(Air Pollution in Delhi) నుంచి విముక్తి చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం(Delhi government) కసరత్తు ప్రారంభించింది. రాజధాని నగరంలో కాలుష్యానికి చెక్ పెట్టాలంటే ఇంధన వాహనాల వినియోగాన్ని తగ్గించాలని భావిస్తోంది. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఎలక్ట్రిక్ వెహికిల్ ముసాయిదా పాలసీ(Electric Vehicle Policy) (2026-30)ని ఢిల్లీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. - central-pollution-board
ఈ ముసాయిదా ప్రకారం వచ్చే ఏడాది అంటే 2027, జనవరి ఒకటి నుంచి త్రీ వీలర్ వాహనాల్లో ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ అనుమతి ఉంటుంది. ఆ తర్వాత ఏడాది నుంచి టూవీలర్స్‌ను ఆ జాబితాలోకి తీసుకురానున్నారు. ఏప్రిల్ 1, 2028 నుంచి ఎలక్ట్రిక్ మోడల్స్ రిజిస్ట్రేషన్‌ను మాత్రమే అనుమతిస్తారు. క్రమేణా ఢిల్లీ నగరంలో పెట్రోల్, డీజిల్ వాహనాలను తగ్గించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
Also Read : నేటి నుంచి టోల్ ప్లాజాల్లో కొత్త రూల్స్.. తేడా చేస్తే ఇక అంతే...
Electric Vehicle Policy 2028
ఇక ప్రజలను ఈవీ కొనుగోళ్ల వైపు మళ్లించేందుకు ప్రోత్సాహకాలను కూడా ఢిల్లీ రవాణా శాఖ ప్రతిపాదించడం గమనార్హం. ఈవీల్లోకి మారితే విద్యుత్ వినియోగం పెరుగుతుంది. గనక రూ.2.25 లక్షల విలువైన టూవీలర్‌ను కొన్నవారికి ఒక కిలోవాట్అవర్‌కు రూ.10వేల నుంచి రూ.30 వేల వరకు ప్రోత్సాహకం లభించనుంది. త్రీవీలర్ ఈవీలను కొన్నవారికి తొలి ఏడాది రూ.50వేలు లభించనున్నాయి. క్రమంగా ఆ మొత్తం తగ్గుతూ వస్తుంది. పాతవాహనాలు తుక్కుగా మార్చి, ఈవీల్లోకి మారిన వారికి కూడా ఈ ప్రోత్సాహకాలు అందించనుంది. ఈవీల కోసం ప్రభుత్వం ఛార్జింగ్ సౌకర్యాలను భారీగా పెంచడానికి సిద్ధమవుతోంది.
కాగా, ఈ కొత్త ప్రతిపాదనలపై ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ కోసం 30 రోజుల పాటు ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు. ఆ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని తర్వాత తుదిరూపు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కాగా..ప్రతి ఏడాది శీతాకాలం వచ్చిందంటే ఢిల్లీ నగరం కాలుష్య కోరల్లో చిక్కుకుంటుంది. దాంతో అక్కడి ప్రజలు శ్వాస సంబంధ సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈవీ వాహనాలవైపు మొగ్గు చూపుతోంది.
Also Read : రజినీకాంత్, ధనుష్ ఇళ్లలో బాంబులు..
Follow Us