తాజ్ హోటల్‌లో జరిగిన ఉగ్రదాడిపై రతన్ టాటా ఏమన్నారంటే ? టాటా గ్రూప్‌కు చెందిన ముంబయిలోని తాజ్ మహల్ హోటల్‌లో 26/11 ఉగ్రదాడి ఘటనను రతన్ టాటా ఓ సందర్భంలో గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో తానెంతో భావోద్వేగానికి లోనయ్యానని చెప్పారు. హోటల్‌కి జరిగిన నష్టం నుంచి కోలుకునేందుకు చాలా సమయం పట్టిందన్నారు. By B Aravind 10 Oct 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి స్ట్రగులింగ్ డేస్ అనేవి సామాన్యులకే కాదు.. బిలీనియర్లకు సైతం ఉంటాయని రతన్ టాటా ఓ సందర్భంలో చెప్పారు . అందుకే తామేం అతీతులం కాదని అన్నారు. తాను అత్యంత స్ట్రగులింగ్ అయిన రోజులను ఆయన ఓ సందర్భంలో గుర్తుచేసుకున్నారు. సరిగ్గా 16 ఏళ్ల క్రితం ఆయన అత్యంత స్ట్రగులింగ్‌ను ఫేస్ చేశానని చెప్పుకొచ్చారు. టాటా గ్రూప్‌కు చెందిన ముంబయిలోని తాజ్ మహల్ హోటల్‌లో 26/11 ఉగ్రదాడి ఘటన దేశవ్యాప్తంగా పెను దుమారం రేపిన సంగతి తెలసిందే. ఆ ఉగ్రదాడుల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రదాడులకు అత్యంత ఖరీదైన తాజ్ హోటల్‌కు భారీ నష్టం వాటిల్లింది. ఆ నష్టం నుంచి రతన్ టాటా కోలుకోవడానికి చాలా సమయం పట్టిందని ఆయన ఓ సందర్భంలో చెప్పారు. Also Read: రతన్ టాటా వారసుడు ఎవరు?.. రేసులో నలుగురు ! అడుగడుగునా రాజసం ఉట్టి పడేలా ఈ తాజ్ హోటల్‌ను నిర్మించారు. పెద్దపెద్ద వ్యాపార వేత్తలు మొదలు సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు, సంపన్నులు ముంబయిలోని తాజ్ హోటల్‌లో సేద తీరుంటారు. అలాంటి హోటళ్లో ఉగ్రదాదులు దాడులు జరిపి తీవ్ర నష్టం మిగిల్చారు. ఆ ఘటన తర్వాత సరిగ్గా నెల రోజులకు హోటల్ తెరుచుకుంది. అప్పుడు తాను స్ట్రగులింగ్‌ను ఫేజ్ చేశానని, తన జీవితంలో అత్యంత కఠిన సమయాల్లో అదీ ఒకటని రతన్ టాటా అన్నారు. 60 గంటల పాటు తాజ్ మహల్ హోటల్‌ను ఉగ్రవాదులు ముట్టడించారు. ఎంతో మంది అతిథులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో తానెంతో భావోద్వేగానికి లోనయ్యానని, నాటి సంఘటనను తలుచుకుంటే ఇప్పటికీ మనసు ఎంతో కష్టంగా ఉంటుందని చెప్పారు. ఆ దాడి మా వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపిందని తెలిపారు. హోటల్‌ను రీస్టార్ట్ చేసేసరికి చాలా సమయం పట్టిందని చెప్పారు. దాదాపు 21 నెలల పాటు పునరుద్ధరన పనులు కొనసాగాయని ఆయన వెల్లడించారు. అప్పటి నుంచి తన బాధ్యత రెట్టింపు అయిందని, ఒకవైపు టాటా గ్రూప్ బాధ్యతలను చూడడంతోపాటు మరోవైపు టాటా సన్స్ భద్రతకు ఎలాంటి హానీ కలగకుండా చూడడం, అది నాకు ఎంతో కష్టకాలమని చెప్పారు. #telugu-news #mumbai #ratan tata మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి