Great Indian Bustard: పక్షికి 50 మంది బాడీగార్డులు.. గుజరాత్ అటవిశాఖ హైటెక్ హంగామా!

అంతరించిపోతున్న పక్షుల జాబితాలో అత్యంత అరుదైనది 'బట్టమేక పిట్ట'. అటవీ శాఖ అధికారుల నిరంతర కృషి ఫలితంగా దాదాపు పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, ఈ ఏడాది మార్చి 26న గుజరాత్‌లో ఒక బట్టమేక పిట్ట పిల్ల జన్మించింది. దీంతో అటవీ శాఖలో ఆనందం వెల్లివిరిసింది.

New Update
_batta meka bird

Great Indian Bustard

Great Indian Bustard: "పిట్ట కొంచెం.. కూత ఘనం" అంటారు కానీ, ఇక్కడ మాత్రం "పిట్ట కొంచెం.. కాపలా ఘనం" అనాల్సిందే. గుజరాత్ అటవీ శాఖ అధికారులు చేస్తున్న హంగామా చూస్తుంటే సరిహద్దుల్లో సైనికుల పహారాను తలపిస్తోంది. ఇంతకీ అంతలా కాపలా కాస్తున్నది ఎవరికో తెలుసా? కేవలం ఒక చిన్న పక్షి పిల్ల కోసం!

పదేళ్ల తర్వాత దక్కిన అరుదైన అవకాశం
అంతరించిపోతున్న పక్షుల జాబితాలో అత్యంత అరుదైనది 'బట్టమేక పిట్ట'. దీనినే స్థానికంగా 'గోదావన్' అని కూడా పిలుస్తారు. ఈ జాతి సంతతి వృద్ధి చెందడం చాలా కష్టం. అయితే, అటవీ శాఖ అధికారుల నిరంతర కృషి ఫలితంగా దాదాపు పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, ఈ ఏడాది మార్చి 26న గుజరాత్‌లో ఒక బట్టమేక పిట్ట పిల్ల జన్మించింది. దీంతో అటవీ శాఖలో ఆనందం వెల్లివిరిసింది.

Also Read: ఇండోనేషియాలో భారీ భూకంపం.. మలేషియా, ఫిలిప్పీన్స్‌కు సునామీ హెచ్చరికలు

మూడు షిఫ్టులు.. 50 మంది గార్డులు
ఈ చిన్నారి ప్రాణాన్ని కాపాడటం ఇప్పుడు అటవీ శాఖకు అతిపెద్ద సవాలుగా మారింది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఈ అరుదైన సంతతి కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. అందుకే, ఆ పక్షి పిల్ల రక్షణ కోసం ఏకంగా 50 మంది గార్డులను నియమించారు. వీరు మూడు షిఫ్టుల్లో 24 గంటల పాటు ఆ పక్షిని కంటికి రెప్పలా కాపాడుతున్నారు.

Also Read: చరిత్ర సృష్టించిన NASA.. 50 ఏళ్ల తర్వాత చంద్రుడి చెంతకు మానవ యాత్ర

హైటెక్ నిఘా.. మనుషుల ప్రవేశం నిషిద్ధం
ఈ కాపలా మామూలుగా లేదు. గార్డులు బైనాక్యులర్స్, శక్తివంతమైన స్కోప్‌లు, అత్యాధునిక హైటెక్ సర్వేలెన్స్ వ్యవస్థలను ఉపయోగిస్తున్నారు. ఆ పక్షి ఉన్న ప్రాంతానికి కిలోమీటర్ల మేర మనుషుల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు. పక్షుల కదలికలకు ఎలాంటి ఆటంకం కలగకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సరిహద్దుల్లో సైనికులు కూడా ఇంతలా హంగామా చేయరేమో అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నప్పటికీ, ఒక అరుదైన జీవజాతిని కాపాడేందుకు అటవీ శాఖ చేస్తున్న ఈ సాహసోపేత ప్రయత్నాన్ని పర్యావరణ ప్రేమికులు అభినందిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు