/rtv/media/media_files/2025/03/11/QtYXPuCBa6SCKeUBLjkZ.jpg)
Ranya Rao Gold Smuggling Case
డీజీపీ రామచంద్ర రావు కూతురు రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మరో ట్విస్టు చోటుచేసుకుంది. తాజాగా కర్ణాటక ప్రభుత్వం రామచంద్ర రావు పాత్రపై విచారణకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి గౌరవ్ గుప్తాను విచారణాధికారిగా నియమించింది. ఈ మేరకు సోమవారం సీఎం కార్యలయం ఉత్తర్వులు జారీ చేసింది. వారం రోజుల్లోగా విచారణ పూర్తి చేసిన అనంతరం నివేదిక సమర్పించాలని కర్ణాటక సర్కార్ గౌరవ్ గుప్తాను ఆదేశించింది.
Also Read: గ్రూప్ 1 పరీక్షల ఫలితాలు... హైయెస్ట్ మార్కులు వీరికే .. కటాఫ్ ఎంతంటే!
ఇదిలాఉండగా.. రన్యారావు దుబాయ్ నుంచి భారత్‌కు అక్రమంగా బంగారం రవాణా చేస్తూ దొరికిపోయిన సంగతి తెలిసిందే. మార్చి 3న బెంగళూరులోని కెంపెగౌడ ఎయిర్‌పోర్టులో డీఆర్‌ఐ అధికారులు ఆమెను అరెస్టు చేశారు. కోర్టు పర్మిషన్‌తో రన్యారావును డీఆర్ఐ అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారించారు. ఇందులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రన్యారావు ఎయిర్‌పోర్టులో తన తండ్రి ప్రోటోకాల్ ఉపయోగించుకున్నట్లు విచారణలో తేలింది. ఈ క్రమంలోనే కర్ణాటక ప్రభుత్వం రామచంద్రరావుపై విచారణకు ఆదేశించింది.
Also Read: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాపై సస్పెన్షన్ ఎత్తివేత
మరోవైపు రన్యారావు అరెస్టుపై తన తండ్రి రామచంద్ర రావు కూడా స్పందించారు. మీడియా ద్వారా తనకు ఈ విషయం తెలిసిందని.. ఇది తెలిసి షాకయిపోయినట్లు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి వివరాలు తనకు ఏమీ కూడా తెలియదని అన్నారు. దీనికి సంబంధించి తనవద్ద ఎలాంటి ముందస్తు సమాచారం లేదన్నారు. అంతేకాదు తన కూతురు ఇప్పడు తమతో ఉండటం లేదని.. తన భర్తతో కలిసి వేరే చోట ఉంటుందని చెప్పారు.
Also Read: ఆరు నెలలుగా నీళ్లు మాత్రమే తాగిన యువతి మృతి.. ఎందుకంటే..?