Winter Sessions: ముగిసిన పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు..

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. 129వ రాజ్యంగ సవరణ బిల్లు(జమిలి ఎన్నికల బిల్లు)ను లోక్‌సభ.. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించింది. అమిత్ షా వ్యాఖ్యలపై విపక్ష సభ్యులు ఆందోళనలు చేస్తున్న క్రమంలోనే ఉభయసభలను నిరవధికంగా వాయిదా వేశారు.

New Update
LS

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. విపక్ష సభ్యుల ఆందోళనలు చేస్తున్న క్రమంలోనే లోక్‌సభ, రాజ్యసభలను నిరవధికంగా వాయిదా వేశారు. అంబేద్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై విపక్ష ఎంపీలు నిరసన చేస్తుండగానే స్పీకర్ ఓంబిర్లా లోక్‌సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటన చేశారు. ఈ సమయంలో ప్రధాని మోదీ కూడా లోక్‌సభలోనే ఉన్నారు. అలాగే 129వ రాజ్యంగ సవరణ బిల్లు(జమిలి ఎన్నికల బిల్లు)ను లోక్‌సభ.. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించింది.   

Also Read: బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. రేవంత్ ను కలిసిన ఇద్దరు ఎమ్మెల్యేలు!

Rajya Sabha - Lok Sabha

మరోవైపు వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటకీ కమిటీలో 12 మంది రాజ్యసభ సభ్యులకు చోటు కల్పించాలని కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్‌వాల్ ప్రవేశపెట్టిన తీర్మానానికి రాజ్యసభ ఆమోదం తెలిపింది. అనంతరం అమిత్ షా వ్యాఖ్యలపై విపక్ష ఎంపీలు నిరసన చేయడంతో రాజ్యసభను కూడా నిరవధికంగా వాయిదా వేశారు. దీంతో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈరోజుతో(శుక్రవారం) ముగిసినట్లయ్యింది.

Also Read: ఖమ్మంలో షాకింగ్ ఘటన.. పెళ్లి పేరుతో రూ.40 లక్షలు కొట్టేసిన కిలాడీ!

 శుక్రవారం ఉదయం కూడా ఉభయ సభలు ప్రారంభించడానికి ముందు పార్లమెంటు ఆవరణలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఇండియా కూటమి ఎంపీలు ఆందోళన చేపట్టారు. అంబేద్కర్‌పై కేంద్రమంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలను వాళ్లు తప్పుబట్టారు. అమిత్ షా క్షమాపణలు చెప్పాలని, తన పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. 

Also Read: విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త..ఏకంగా 15 రోజుల పాటుసెలవులు

Also Read: ముంబయ్ మారణహోమం నిందితుడి పిటిషన్ కొట్టేయాలని కోరిన అమెరికా

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు