/rtv/media/media_files/2025/01/26/8VkIYtgCuUdbFpNDhAAZ.jpg)
Railway employee suspended after husband complaint
జ్యోతి మౌర్య కేసు దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ప్యూన్ అయిన భర్త.. తన భార్యను ఎలాగైనా పెద్ద చదువులు చదివించాలనుకున్నాడు. అనుకున్నట్లుగానే ఆమెకు ఉన్నత చదువులు చదివించాడు. గవర్నమెంట్ జాబ్ వచ్చే వరకు తన డబ్బులు పెట్టి చాలా ప్రోత్సహించాడు. మొత్తంగా అతడి కష్టం, ఆమె ప్రయత్నం ఫలించి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. కానీ అక్కడ అసలు ట్విస్ట్ మొదలైంది. జాబ్ వచ్చాక ఎంతో కష్టపడి చదివించిన తన భర్తను వదిలేసి మరో వ్యక్తితో వెళ్లిపోయింది. ఆ ఘటన దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పుడు కూడా అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది.
Also Read: పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం
భార్యకు ఉన్నత చదువులు
రాజస్థాన్‌లోని కోటాకు చెందిన మనీశ్ మీనా, సప్న మీనా గతంలో పెళ్లి చేసుకున్నారు. అయితే సప్న మీనాకు చదువుకోవాలన్న తపన ఉండటంతో మనీశ్ అది గమనించాడు. దీంతో ఎలాగైన తన భార్యను ఉన్నత చదువులు చదివించాలని నిర్ణయించుకున్నాడు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం ఉన్నా అతడు వెనక్కి తగ్గలేదు.
ఆస్తులు తాకట్టు పెట్టి మరీ
తనకున్న పొలాన్ని తాకట్టు పెట్టి మరీ తన భార్యను చదివించాడు. ఏది కావాలంటే అది కొనిచ్చాడు. ఎప్పటికైనా తన భార్య ఉద్యోగం సాధిస్తుందన్న నమ్మకంతో డబ్బును లెక్క చేయలేదు. దాదాపు రూ.15 లక్షల వరకు ఆమె చదువు కోసం ఖర్చు చేశాడు. సప్న మీనా తన ఉన్నత చదువులు పూర్తయ్యాక 2023లో రైల్వే జాబ్స్ నోటిఫికేషన్ రావడంతో దానికి అప్లై చేసి ఎగ్జామ్ రాసింది.
Also Read: భారతీయులను కాపాడిన పాకిస్థాన్ అధికారికి పౌర పురస్కారం.. ఎందుకంటే ?
జాబ్ వచ్చిన తర్వాత
రిజల్ట్‌లో జాబ్ వచ్చింది. దీంతో భర్త మనీశ్‌తో పాటు భార్య సప్న సైతం హ్యాపీగా ఫీలయ్యారు. కానీ అక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. జాబ్ వచ్చిన తర్వాత నుంచి సప్న తీరులో మార్పులు వచ్చాయి. తనకు ఉద్యోగం ఉందని సప్న విర్రవీగింది. భర్తపై అహంకారం చూపించింది. చివరకు భర్తను దూరం పెట్టింది.
భర్త ట్విస్ట్ అదుర్స్
దీంతో ఒక్కసారిగా మనీశ్ ఖంగుతిన్నాడు. ఎలాగైన తన భార్యకు బుద్ది చెప్పాలనుకున్నాడు. ఈ క్రమంలోనే ఆమెకు తన సొంత టాలెంట్‌తో ఉద్యోగం రాలేదని నిరూపించాడు. అందుకు సంబంధించి ఆధారాలు కూడా అధికారులకు చూపించాడు. తన భార్య సప్న ప్రాక్సీ అభ్యర్థి (డమ్మీ అభ్యర్థి) సహాయంతో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు పరీక్షలో ఉత్తీర్ణురాలయ్యారని ఆరోపించాడు. ఈ విషయం వెల్లడైన తర్వాత సప్నాను అధికారులు సస్పెండ్ చేశారు. దీనిపై దర్యాప్తు జరుపుతున్నామని కోటా డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ ఆఫీసర్ సౌరభ్ జైన్ తెలిపారు. దీంతో సప్న జాబ్ కోల్పోయి ఇంటి వద్దే ఉంటుంది. ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.