Rahul Gandhi: ట్రంప్ టారిఫ్‌లు వేస్తే మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారు.. రాహుల్‌గాంధీ ఫైర్

కుల గణనతో దేశంలో దళితులు, గిరిజనులు, ఓబీసీల సంఖ్య తేలుతుందని మరోసారి రాహుల్‌గాంధీ అన్నారు. గుజరాత్‌లోని ఏఐసీసీ ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ట్రంప్‌ టారిఫ్‌లు వేస్తుంటే మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారంటూ విమర్శించారు.

New Update
Rahul Gandhi

Rahul Gandhi

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్వహించిన ఏఐసీసీ ప్లీనరీ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకొని దేశానికే ఆదర్శంగా నిలిచామన్నారు. '' దేశ జనాభాలో 90 శాతం మంది జనాభాకు సరైన ప్రాతినిధ్యం లేదు. 90 శాతం అవకాశాలను ఇతరులు లాగేసుకుంటున్నారు. మా ముఖ్యమంత్రి బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పించనున్నారు. కుల గణనతో దేశంలో దళితులు, గిరిజనులు, ఓబీసీల సంఖ్య తేలుతుంది. 
ట్రంప్ టారిఫ్‌తో దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లనుంది. ట్రంప్ టారిఫ్‌లు వేస్తుంటే ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు. మోదీ తనకు మంచి మిత్రుడు అంటూనే ట్రంప్ టారిఫ్‌లు వేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ ఒక్కొక్కటిగా విక్రయిస్తున్నారు. అదానీ, అంబానీలకే దోచి పెడుతున్నారు. RSS, బీజేపీ.. ఈ రెండూ కూడా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నాయి. గాంధేయవాదులందరూ ఏకం కావాలని'' రాహుల్ గాంధీ అన్నారు.
మరోవైపు సీఎం రేవంత్ మాట్లాడుతూ.. స్వతంత్య్ర పోరాటంలో ఇండియా నుంచి బ్రిటిష్ వాళ్లను తరిమికొట్టినట్లే బీజేపీని ఓడించాలని అన్నారు. మోదీ మతాల మధ్య చిచ్చుపెట్టి దేశాన్ని చీల్చాలని చూస్తున్నారని ఆరోపించారు. గాంధీ విధానాలకు వ్యతిరేకంగా.. గాడ్సే సిద్ధాంతాన్ని ప్రోత్సహిస్తూ బీజేపీ పని చేస్తోందని విమర్శించారు. తెలంగాణలో కులగణన చేసినట్లే దేశావ్యాప్తంగా కులగణన చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలో బీజేపీని అడుగుపెట్టనివ్వమని తేల్చిచెప్పారు. 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴Pahalgam Terrorist Attack: మీ దుఃఖంలో నేను పాలుపంచుకుంటున్నాను.. పహల్గా మృతులకు స్మితా నివాళి

జమ్ము కశ్మీర్‌లో అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ భీకర ఘటనలో 27 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి లైవ్ అప్‌డేట్స్ తెలుసుకోడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

author-image
By Manoj Varma
New Update
Terrorist Attack In Kashmir

Terrorist Attack In Kashmir

Also Read: ఈ సారి సైన్యం కాదు.. పర్యాటకులే టార్గెట్.. ఉగ్రమూకల కొత్త వ్యూహం అదేనా?

Also Read: ఏ బొక్కలో దాక్కున్న తప్పించుకోలేరు.. ఉగ్రవాదుల వేటకు రంగంలోకి ధ్రువ్ హెలీకాప్టర్లు!

🔴Pahalgam Terrorist Attack: 

జమ్ము కశ్మీర్‌(Jammu-Kashmir)లో మరోసారి ఉగ్రవాద దాడి(Terrorist Attack) కలకలం రేపింది. అనంత్‌నాగ్ జిల్లా(Anantnag District) పహల్గాం(Pahalgam) ప్రాంతంలోని బైసరన్(Baisaran) వద్ద మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా  కాల్పులకు పాల్పడ్డారు. ఈ దాడిలో ఇప్పటివరకు 27 మంది ప్రాణాలు కోల్పోగా, 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఉగ్రవాదులు ప్రత్యేకంగా హిందువులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. దాదాపు 40 మంది పర్యాటకులు ఉన్నప్పుడు, అటవీ ప్రాంతం నుంచి అకస్మాత్తుగా దూసుకువచ్చిన తీవ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. దుండగుల దాడితో కొంతమంది అక్కడికక్కడే మృతిచెందగా, గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులు సహాయం కోరుతూ పంపిన వీడియోలు హృదయాన్ని కలిచివేస్తున్నాయి. ఈ ఘటనపై తాజా సమాచారాన్ని తెలుసుకోవాలంటే లైవ్ అప్‌డేట్స్‌ను ఇక్కడ ఫాలో అవ్వండి.

Also Read: సరిహద్దుల్లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఇండియాలోకి అక్రమంగా చొరబడేందుకు!

Also Read: శ్రీనగర్‌లో చిక్కుకుపోయిన 80 మంది తెలంగాణ పర్యటకులు

 

  • Apr 24, 2025 09:38 IST

    నెలల తరబడి డబ్బు కూడబెట్టి కశ్మీర్ పర్యటన.. 9ఏళ్ల కొడుకు ముందే ప్రశాంత్ కలను కాలరాసిన ఉగ్రవాదులు!

    పహల్గాం ఉగ్రదాడి ఒడిశాకు చెందిన ప్రశాంత్ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది. నెలల తరబడి డబ్బు కూడబెట్టి ఫ్యామిలీతో కశ్మీర్ పర్యటన వెళ్లిన ప్రశాంత్‌ను 9ఏళ్ల కొడుకు, భార్యముందే కాల్చి చంపేశారు. అతని మరణ వార్తతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.



  • Apr 24, 2025 09:37 IST

    Fauji ఉగ్రవాదులు దాడి.. ప్రభాస్ హీరోయిన్ బలి!

    పహల్గామ్ ఎటాక్ తో ప్రభాస్ ఫౌజీ మూవీపై వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమాలోని హీరోయిన్ పాకిస్థానీ మిలటరీ ఆఫీసర్ కూతురు కావడంతో విమర్శలు తలెత్తుతున్నాయి. శత్రుదేశాల మూలాలున్న అమ్మాయిని ప్రోత్సహిస్తున్నారు అనే కోణంలో కొందరు నిరసన స్వరం వినిపిస్తున్నారు.

    fauji heroine
    fauji heroine

     



  • Apr 24, 2025 09:35 IST

    BCCI సంచలన నిర్ణయం..ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్లు ఇక ఉండవు?

    కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి ఘటనతో భవిష్యత్తులో పాకిస్తాన్‌తో ఎలాంటి మ్యాచ్‌లు ఆడవద్దని బీసీసీఐని అభిమానులు కోరుతున్నారు.  దీనిపై బీసీసీఐ కార్యదర్శి రాజీవ్ శుక్లా స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం బీసీసీఐకి ఏది చెబితే అది జరుగుతుందన్నారు.



  • Apr 24, 2025 09:33 IST

    ఏప్రిల్ 22 ఒక చీకటి రోజు:.. ఉగ్రవాద దాడిపై బాలీవుడ్ సెలెబ్రెటీల ట్వీట్లు

    పహల్గామ్ ఉగ్రవాద దాడి పై సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ ట్వీట్ చేశారు. షారుక్ తో పాటు అనుష్కశర్మ, కరీనా కపూర్, అక్షయ్ కుమార్, అనిల్ కపూర్ తదితరులు దాడిపై స్పందించారు.v

    pahalgam attack Bollywood stars tweets
    pahalgam attack Bollywood stars tweets

     



  • Apr 24, 2025 08:26 IST

    కర్రె గుట్టలపైకి డ్రోన్లు.. ఒకే బంకర్‌లో 3వేల మంది మావోయిస్టులు: మరికొన్ని గంటల్లో భీకర యుద్ధం!

    మావోయిస్టుల ఆచూకీ కోసం కర్రెగుట్ట ఆపరేషన్ కొనసాగుతోంది. గుట్టలపై డ్రోన్లు ఎగరవేసిన పోలీసులు దాదాపు 3వేల మంది మావోయిస్టులున్నట్లు అంచనా వేస్తున్నారు. 4వేల మంది భద్రతాబలగాలు కూబింగ్ నిర్వహిస్తుండగా ఏ క్షణమైనా భీకర యుద్ధం మొదలయ్యే అవకాశం ఉంది. 



  • Apr 24, 2025 08:24 IST

    పహల్గామ్ లో బిగ్ బాస్ నటి కాజల్.. ఇప్పుడు ఆమె ఎలా ఉందంటే!

    బిగ్ బాస్ ఫేమ్ నటి RJ కాజల్ కూడా దాడి సమయంలో పహల్గామ్ లోనే ఉండడం ఆమె అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో కాజల్ తాను క్షేమంగా ఉన్నానని తెలియజేస్తూ ఇన్ స్టాలో వీడియోను రిలీజ్ చేసింది. ప్రస్తుతం తాను పహల్గామ్ నుంచి శ్రీనగర్ వెళ్తున్నాని తెలిపింది.

    rj kajal in  Pahalgam attack
    rj kajal in Pahalgam attack

     



  • Apr 24, 2025 08:21 IST

    ఏ బొక్కలో దాక్కున్న తప్పించుకోలేరు.. ఉగ్రవాదుల వేటకు రంగంలోకి ధ్రువ్ హెలీకాప్టర్లు!

    జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాద దాడి తర్వాత భారత సైన్యం అలర్ట్ అయింది.  అత్యంత శక్తివంతమైన ధ్రువ్ హెలికాప్టర్లలో ఒకదాన్ని శ్రీనగర్ పరిసర ప్రాంతాలలో ఎగరడానికి అనుమతించింది.  

     



  • Apr 24, 2025 08:20 IST

    పహల్గాంలో నా బర్త్ డే వేడుకలు, షూటింగ్ కూడా.. విజయ్ దేవరకొండ సంచలన ట్వీట్!

    జమ్మూ కాశ్మీర్‌ పహల్గామ్‌ అటాక్ భారతదేశాన్ని కుదిపేస్తోంది. ఈ ఘటనపై హీరో విజయ దేవరకొండ స్పందిస్తూ.. రెండేళ్ల క్రితం తన బర్త్ డే వేడుకలను ఆ ప్రదేశంలో జరుపుకున్నానని. ఇప్పుడు అక్కడ ఇలాంటి ఘటన జరగడం మనసును కలచివేస్తోంది అని పోస్ట్ పెట్టారు.

    vijay devarakonda on Pahalgam attack
    vijay devarakonda on Pahalgam attack

     



  • Apr 23, 2025 21:25 IST

    BIG BREAKING: మోడీ సంచలన నిర్ణయం.. పాకిస్థాన్ కు బిగ్ షాక్!

    జమ్ము కశ్మీర్‌లోని  పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తరువాత కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ తో  దౌత్య సంబంధాలను పూర్తిగా తెంచుకున్నట్లుగా వెల్లడించింది. పాక్ పౌరులును ఇండియాలోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది.

    modi-amit-shah
    modi-amit-shah

     



  • Apr 23, 2025 20:03 IST

    J&K Terror Attack : రివేంజ్ స్టార్ట్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం.. అదుపులో 1500 మంది!

    జమ్మూకశ్మీర్ లో పర్యటకులపై ఉగ్రవాదుల కాల్పులు కలకలం రేపాయి. అయితే ఈ కాల్పుల వెనుక పహల్‌గాం ఉగ్రదాడి వెనుక లష్కరే తోయిబా టాప్ కమాండర్ సైఫుల్లా సాజిద్ జట్ హస్తం ఉండొచ్చంటూ నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

    terror attack in j and k
    terror attack in j and k

     



  • Apr 23, 2025 20:00 IST

    Pahalgam Attack: కల్మా అంటే ఏంటీ.. అది చదవనందుకు ఉగ్రవాదులు ఎందుకు చంపేశారు?

    ఇస్లాంలో కల్మా అనేది అల్లాహ్ యొక్క ఏకత్వం. విశ్వాసాన్ని ధృవీకరించే విశ్వాస ప్రకటన. ముస్లింలు కల్మాను క్రమం తప్పకుండా పఠించడం అనేది అల్లాను మాత్రమే ఆరాధించడం. ప్రవక్త ముహమ్మద్ బోధనలను అనుసరించడం పట్ల తమకున్న నిబద్ధతను గుర్తుచేసుకోవడానికి ఒక మార్గం.

    kalma islam
    kalma islam

     



  • Apr 23, 2025 19:59 IST

    Pahalgam Attack: భయం గుప్పిల్లో కశ్మీర్ పర్యాటకులు.. 6గంటల్లో ఎన్నివేల మంది వెళ్లిపోయారంటే!

    పహల్గాం ఘటన పర్యాటకులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. టూరిస్టులు ప్రాణభయంతో ఆ ప్రాంతాన్ని వదిలి పరుగులు తీస్తున్నారు. గడిచిన 6గంటల్లో దాదాపు 4వేల మంది తిరుగు పయణమయ్యారు. ప్రత్యేక విమానాలతోపాటు అన్నిఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. 

    jammu
    jammu Photograph: (jammu )

     



  • Apr 23, 2025 19:58 IST

    PM Modi : ఉగ్రవాదుల్ని ఏరిపారేద్దాం.. మోదీ ఇంట్లో హై లెవెల్ మీటింగ్!

    పహల్గామ్ ఉగ్రవాద దాడికి సంబంధించి న్యూఢిల్లీలోని మోడీ నివాసంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో హోంమంత్రి అమిత్ షా, మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి జైశంకర్ లు పాల్గొన్నారు.

    modi-amit-shah
    modi-amit-shah

     



  • Apr 23, 2025 19:04 IST

    మోదీ నివాసంలో అత్యవసర భేటీ!



  • Apr 23, 2025 17:35 IST

    ఉగ్రదాడి.. శ్రీనగర్-జమ్మూ హైవేపై భారీగా బలగాల మోహరింపు



  • Apr 23, 2025 17:23 IST

    Vinay Narwal : ఈమెకు ఏం చెప్పి ఓదార్చుదాం.. కన్నీళ్లు పెట్టిస్తున్న హిమాన్షి వీడియో!

    పహల్గామ్ దాడిలో అమరవీరుడైన నేవీ అధికారి భార్య హిమాన్షి ఆయనకు తుది వీడ్కోలు పలికారు. తన భర్త మృతదేహాన్ని ఉంచిన శవపేటికను కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె ఏడుస్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

    Vinay Narwal
    Vinay Narwal

     



  • Apr 23, 2025 17:22 IST

    Pahalgam Attack: పహల్గాం హీరో.. టూరిస్టులకోసం ఉగ్రమూకలతో వీరోచిత పోరాటం.. హుస్సేన్‌ షాకు నెటిజన్ల సలాం!

    పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన హార్స్ రైడర్ హుస్సేన్‌ షాకు నెటిజన్లు సలాం కొడుతున్నారు. పర్యాటకులకోసం తన ప్రాణాలను లెక్క చేయకుండా విరోచితంగా పోరాడిన హుస్సేన్‌ను హీరోగా కీర్తిస్తున్నారు. అతనిమీదే ఆధారపడి బతుకున్న కుటుంబం మాత్రం రోధిస్తోంది.

    terrorist
    terrorist Photograph: (terrorist)

     



  • Apr 23, 2025 17:12 IST

    టెర్రరిస్ట్ దాడికి వ్యతిరేకంగా పంజాబ్ లో నిరసనలు



  • Apr 23, 2025 17:04 IST

    Rajnath Singh: ప్రపంచం ఆశ్చర్యపోయేలా ప్రతీకారం ఉంటుంది: రాజ్నాథ్ సింగ్ సంచలన కామెంట్స్

    భారత్ ను ఎవరూ భయపెట్టలేరని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. పహల్గాంలో ఉగ్రదాడిపై ఆయన స్పందించారు.  ప్రపంచం ఆశ్చర్యపోయేలా జవాబు ఇస్తామని అన్నారు.  పహల్గాం దాడికి అతి త్వరలో ప్రతీకారం  తీర్చుకుంటామని.. ఒక్క దోషిని కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదన్నారు.

    rajnath-singh
    rajnath-singh

     



  • Apr 23, 2025 16:27 IST

    Pahalgam Terror Attack: నీకు సిగ్గుందరా.. లవ్ యూ పాకిస్థాన్ అంటూ పోస్ట్ .. తిక్క కుదిర్చిన పోలీసులు!

    ఉగ్రదాడి వేళ టెర్రరిస్టు ఆర్గనైజేషన్లకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఝార్ఖండ్ మిలత్ నగర్ కు  చెందిన మహమ్మద్ నౌషద్ అనే యువకుడు తన సోషల్ మీడియాలో 'థాంక్యూ పాకిస్థాన్, థాంక్యూ లష్కర్ -ఇ-తోయిబా' అని పోస్ట్ చేశాడు.

    Pak after Pahalgam attack
    Pak after Pahalgam attack

     



  • Apr 23, 2025 16:26 IST

    Pahalgam Tourist Places: పహల్గాం భూలోక స్వర్గం.. పచ్చని లోయలు, నీలి నది- స్విట్జర్లాండ్‌ తలపించే అందాలు

    జమ్మూ అండ్ కశ్మీర్‌లోని పహల్గామ్‌ అనంతనాగ్ జిల్లాలో ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. దీనిని ‘‘మినీ స్విట్జర్లాండ్’’ అని కూడా అంటారు. ఈ ప్రాంతమంతా మంచుతో కప్పబడిన పర్వతాలు, అందమైన చెట్లు, పచ్చని లోయలు ఉంటాయి. ట్రెక్కింగ్ ఇష్టపడే టూరిస్టులకు స్వర్గధామం..

    Pahalgam Terror Attack (1)



  • Apr 23, 2025 16:25 IST

    Pahalgam Terrorist Attack: ఉగ్రదాడి నుంచి తప్పించుకున్న హిందూ ప్రొఫెసర్.. ఉగ్రవాదులకు ఏం చెప్పాడంటే?

    ఉగ్రవాద దాడిలో ఓ హిందూ ప్రొఫెసర్ తన ప్రాణాలను కాపాడుకున్నాడు. అతను ఉగ్రవాదులను చూసిన వెంటనే కల్మా అనే ఇస్లామిక్ శ్లోకాన్ని పఠించడం ప్రారంభించాడు. దీంతో కృతజ్ఞతగా ఉగ్రవాదులు తమ మనసు మార్చుకుని అతన్ని చంపకుండా వదిలేశారు.

    Hindu professor
    Hindu professor

     



  • Apr 23, 2025 15:55 IST

    పహల్గాం ఉగ్రదాడి బాధితుల కోసం ఢిల్లీ ఏపీ భవన్ లో ఎమర్జెన్సీ డెస్క్



  • Apr 23, 2025 15:42 IST

    పహల్గాంలో భద్రతా బలగాలతో మాట్లాడుతున్న అమిత్ షా!



  • Apr 23, 2025 15:39 IST

    లెఫ్ట్నెంట్ వినయ్ కు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా నివాళి



  • Apr 23, 2025 15:38 IST

    ఉగ్రదాడిలో మరణించిన నావీ లెఫ్ట్నెంట్ వినయ్ కు సతీమణి కన్నీటి నివాళి



  • Apr 23, 2025 15:31 IST

    Pahalgam Terrorist Attack: POKలో స్కెచ్..రెండు వారాల క్రితం భారత్ లోకి ఎంట్రీ.. పహల్గాం దాడికి ఆ దుర్మార్గులు ఎలా ప్లాన్ చేశారంటే?

    పర్యాటకులపై దాడి సమయంలో ఉగ్రవాదులు తమ హెల్మెట్లపై కెమెరాలు ధరించారు. తద్వారా మొత్తం సంఘటనను వీడియో చిత్రీకరించారు. ఈ సంఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను తమ సంస్థకు పంపారు.  కొంతమంది ఉగ్రవాదులు స్నిపర్ కాల్పుల మాదిరిగా దూరం నుండి కాల్పులు జరిపారు.

    pok attack
    pok attack

     



  • Apr 23, 2025 15:30 IST

    Pahalgam Terrorist Attack: ఈ సారి సైన్యం కాదు.. పర్యాటకులే టార్గెట్.. ఉగ్రమూకల కొత్త వ్యూహం అదేనా?

    జమ్మూకశ్మీర్‌ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు పాక్ ఈ దాడి చేయించిందని అధికారులు అంటున్నారు. ఇది కశ్మీర్‌లో వేలాది కుటుంబాలను ప్రభావితం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్యాటకుల రాకతోనే జీవనోపాధి పొందుతున్నవారి జీవితాలు ప్రశ్నార్థకమయ్యాయి.

    Jammu Attack
    Jammu Attack

     



  • Apr 23, 2025 15:29 IST

    ALH Dhruv Choppers: ఏ బొక్కలో దాక్కున్న తప్పించుకోలేరు.. ఉగ్రవాదుల వేటకు రంగంలోకి ధ్రువ్ హెలీకాప్టర్లు!

    జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాద దాడి తర్వాత భారత సైన్యం అలర్ట్ అయింది.  అత్యంత శక్తివంతమైన ధ్రువ్ హెలికాప్టర్లలో ఒకదాన్ని శ్రీనగర్ పరిసర ప్రాంతాలలో ఎగరడానికి అనుమతించింది.  

    ALH Dhruv choppers
    ALH Dhruv choppers

     



  • Apr 23, 2025 15:28 IST

    J&K Terror Attack: సరిహద్దుల్లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఇండియాలోకి అక్రమంగా చొరబడేందుకు!

    జమ్మూకశ్మీర్ లో పర్యటకులపై ఉగ్రవాదుల కాల్పులు కలకలం రేపాయి. అయితే ఈ కాల్పుల వెనుక పహల్‌గాం ఉగ్రదాడి వెనుక లష్కరే తోయిబా టాప్ కమాండర్ సైఫుల్లా సాజిద్ జట్ హస్తం ఉండొచ్చంటూ నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

    terror attack in j and k
    terror attack in j and k

     



  • Apr 23, 2025 15:27 IST

    Telangana: శ్రీనగర్‌లో చిక్కుకుపోయిన 80 మంది తెలంగాణ పర్యటకులు

    తెలంగాణ జిల్లాల నుంచి పలువురు శ్రీనగర్‌కు పర్యటనకు వెళ్లారు. పహల్గాంలో ఉగ్రదాడి జరడంతో వీళ్లు ఆందోళనకు గురవుతున్నారు. అక్కడ ఓ హోటల్‌లో దాదాపు 80 మంది తెలంగాణ పర్యటకులు చిక్కుకుపోయారు.

    80- telangana -tourists- stranded in- srinagar -hotel
    80- telangana -tourists- stranded in- srinagar -hotel

     



  • Apr 23, 2025 15:27 IST

    Pahalgam Terrorist Attack: విదేశీ అతిథుల సమయంలోనే ఉగ్రదాడులు.. నాడు క్లింటన్‌.. నేడు జేడీ వాన్స్‌!

    దేశంలో విదేశీ అతిథుల పర్యటన సమయంలోనే ఉగ్రదాడులు జరిగాయి. అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ న్యూఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడు జరగ్గా.. ఇప్పుడు జేడీ వ్యాన్స్ పర్యటనలో ఉండగా జరిగింది. కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయాలనే ఈ దాడులు చేశాయని భావిస్తున్నారు.

    Bill Clinton india
    Bill Clinton india

     



  • Apr 23, 2025 15:26 IST

    Pahalgam Terrorist Attack: ఉగ్రదాడి.. ఇంటెలిజెన్స్‌ హెచ్చరికలను పట్టించుకోలేదా ?

    పహల్గాం ఉగ్రదాడి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అయితే ఈ ఉగ్రదాడి కదలికలపై ముందే హెచ్చరించినా కూడా అధికారులు దీన్ని ఆపడంలో విఫలమయ్యారా ? అనే సందేహాలు వస్తున్నాయి. పూర్తి సమాచారం కోసం టైటిల్‌ పై క్లిక్ చేయండి.

    Amit shah
    Amit shah

     



  • Apr 23, 2025 15:25 IST

    Pahalgam Terrorist Attack: ఆ దుర్మార్గులను వదిలిపెట్టం.. దేశం మొత్తానికి ఇదే నా హామీ.. అమిత్ షా సంచలన ప్రకటన!

    పహల్గాం ఉగ్రదాడిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. ఉగ్రదాడిని చూసి ప్రతీ భారతీయుడు బాధను అనుభవిస్తున్నాడని.. దీన్ని వర్ణించలేమని అన్నారు. అమాయక ప్రజలను చంపిన ఉగ్రవాదులందరినీ వదిలిపట్టేది లేదని స్పష్టం చేశారు.

    Amit Shah
    Amit Shah

     



  • Apr 23, 2025 15:24 IST

    Pahalgam Terrorist Attack: ఉగ్రదాడిలో మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా

    జమ్మూ కశ్మీర్‌లో పహల్గామ్‌లో టూరిస్ట్‌లపై జరిగిన ఉగ్రదాడిలో 28 మృతి చెందారు. ఈ కుటుంబాలకు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. తీవ్ర గాయాలు అయిన వారికి రూ.2 లక్షలు, స్వల్ప గాయాలు అయిన వారికి రూ.లక్ష ఇస్తామని తెలిపారు. 

    Jammu Attack
    Jammu Attack

     



  • Apr 23, 2025 15:23 IST

    Asaduddin Owaisi: 'వాళ్లని వదలొద్దు'.. ఉగ్రదాడిపై అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

    పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terrorist Attack)పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. యూరీ, పుల్వామా కన్నా ఇది తీవ్రంగా ఖండించదగిన దాడి అంటూ వ్యాఖ్యానించారు. దీనికి బాధ్యులైన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

    Asaduddin Owaisi
    Asaduddin Owaisi

     



  • Apr 23, 2025 15:21 IST

    Pahalgam Terrorist Attack: అమెరికా నుంచి ఫ్యామిలీ ట్రిప్.. మరో మృతుడు కుటుంబం కన్నీటి గాథ

    పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన బితాన్‌ మృతి చెందాడు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉంటున్న బితాన్ ఇటీవల సొంతూరు వచ్చి వెకేషన్‌కి భార్య, కొడుకుతో వెళ్లారు. ఈ క్రమంలో ఉగ్రదాడికి బలైయ్యాడు. కుమారుడు, భార్య ప్రాణాలతో బయటపడ్డారు.

    west bengal software dead
    west bengal software dead

     



  • Apr 23, 2025 15:21 IST

    Pahalgam Terrorist Attack: ఉగ్రదాడికి పాల్పడిన దుర్మార్గులు వీరే.. ఫొటోలు విడుదల చేసిన అధికారులు

    జమ్మూ కశ్మీర్‌లో పహల్గామ్‌లో టూరిస్ట్‌లపై జరిగిన టెర్రర్ ఎటాక్‌‌లో 28 మంది మృతి చెందారు. క్రూరంగా మతం, పేర్లు అడిగి టూరిస్ట్‌లను చంపేసిన ఆ దుర్మార్గుల ఫొటోలను అధికారులు విడుదలు చేశారు. స్కెచ్‌లతో గీసిన ఆ టెర్రరిస్ట్‌ల ఫొటోలను రిలీజ్ చేశారు. 

    Pahalgam Attack



  • Apr 23, 2025 15:14 IST

    పహల్గాంలో ఉగ్రవాదుల కోసం కొనసాగుతోన్న భద్రతా దళాల వేట



  • Apr 23, 2025 14:51 IST

    పహల్గాంలో భద్రతను పర్యవేక్షిస్తున్న హోంమంత్రి అమిత్ షా



  • Apr 23, 2025 14:36 IST

    ఉగ్రదాడిలో మరణించిన వారికి కేటీఆర్ నివాళి



  • Apr 23, 2025 14:32 IST

    ఖండించిన కేఏ పాల్



  • Apr 23, 2025 14:31 IST

    ఉగ్రదాడిని ఖండించిన సీతక్క.. కఠినంగా శిక్షించాలని డిమాండ్



  • Apr 23, 2025 14:16 IST

    మృతుల డెడ్ బాడీలను శ్రీనగర్ ఎయిర్పోర్ట్ కు తరలిస్తున్న భద్రతా బలగాలు



  • Apr 23, 2025 14:04 IST

    విదేశీ అతిథుల సమయంలోనే ఉగ్రదాడులు.. నాడు క్లింటన్‌.. నేడు జేడీ వాన్స్‌!

    దేశంలో విదేశీ అతిథుల పర్యటన సమయంలోనే ఉగ్రదాడులు జరిగాయి. అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ న్యూఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడు జరగ్గా.. ఇప్పుడు జేడీ వ్యాన్స్ పర్యటనలో ఉండగా జరిగింది. కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయాలనే ఈ దాడులు చేశాయని భావిస్తున్నారు.

    Bill Clinton india
    Bill Clinton india

     



  • Apr 23, 2025 13:42 IST

    పహల్గాంలో పుట్టిన రోజు, షూటింగ్ జరుపుకున్నా.. ట్విట్టర్లో విజయ్ దేవరకొండ ఎమోషనల్ ట్వీట్



  • Apr 23, 2025 13:41 IST

    ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి మీనాక్షి నటరాజన్, కాంగ్రెస్ నేతల నివాళి



  • Apr 23, 2025 13:40 IST

    రాజ్‌నాథ్‌తో ముగిసిన త్రివిధ దళాధిపతుల సమావేశం

    • త్రివిధ దళాలను అప్రమత్తంగా ఉండాలన్న రాజ్‌నాథ్‌  
    • LOC, కశ్మీర్‌ లోయలో బలగాలను అప్రమత్తం చేసిన కేంద్రం



  • Apr 23, 2025 13:18 IST

    ఆ దుర్మార్గులను వదిలిపెట్టం.. దేశం మొత్తానికి ఇదే నా హామీ.. అమిత్ షా సంచలన ప్రకటన!



  • Apr 23, 2025 13:09 IST

    ఉగ్రదాడిలో మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా

    జమ్మూ కశ్మీర్‌లో పహల్గామ్‌లో టూరిస్ట్‌లపై జరిగిన ఉగ్రదాడిలో 28 మృతి చెందారు. ఈ కుటుంబాలకు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. తీవ్ర గాయాలు అయిన వారికి రూ.2 లక్షలు, స్వల్ప గాయాలు అయిన వారికి రూ.లక్ష ఇస్తామని తెలిపారు. 

    Jammu Attack
    Jammu Attack

     



Advertisment
Advertisment
Advertisment