/rtv/media/media_files/2026/05/08/putin-2026-05-08-20-53-46.jpg)
Putin
రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు సంబంధించి కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. ఆయనపై హత్యాయత్నం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. కొన్ని నెలల క్రితం నోవ్‌గోరోడ్ ప్రాంతంలో ప్రైవేటు నివాసం వద్ద పుతిన్‌పై ఉక్రెయిన్‌కు చెందిన సిబ్బంది హత్యాయత్నానికి పాల్పడ్డట్లు మాస్కో అధికారిక వర్గాలు తెలిపాయి. కానీ భద్రతా కారణాల వల్ల ఈ విషయాన్ని బయటకు చెప్పలేదని పేర్కొన్నాయి. ఈ ఘటన తర్వాత రష్యా ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీస్ (FSO) పుతిన్ సెక్యురిటీని మరింత కట్టుదిట్టం చేసినట్లు సమాచారం. ఇందుకోమే ఆయన బహిరంగ పర్యటనలను చాలావరకు తగ్గించుకున్నారు.
Also Read: శారదా గ్రూప్ స్కామ్‌లో సువేందు అధికారి !.. అసలు ఈ స్కామ్ ఏంటో తెలుసా ?
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి పుతిన్ ఎక్కువ కాలం భూగర్భ బంకర్లలోనే ఉంటున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ఆయన ఉంటున్న చోట మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న పరికరాలను కూడా బ్యాన్ చేసినట్లు పేర్కొన్నాయి. ఉక్రెయిన్ డ్రోన్ల ముప్పును ఎదుర్కునేందుకు FSO ఏజెంట్లు భద్రతా తనిఖీలను విస్తరించినట్లు.. అలాగే మాస్కో నది వెంబ పెద్ద ఎత్తున బలగాలను మోహరించినట్లు వెల్లడించాయి.
Also Read: పశ్చిమ బెంగాల్ సీఎంగా సువేందు అధికారి..
కేవలం పుతిన్‌కు మాత్రమే కాకుండా పలువురు కొంతమంది ఉన్నతాధికారుల రక్షణను సైతం పెంచినట్లు తెలుస్తోంది. రష్యా అధ్యక్షుడిని నేరుగా టార్గెట్ చేసుకొన్నట్లు వస్తున్న వార్తలను అమెరికా, ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఖండించాయి . ఇప్పుడే కాదు గతంలో కూడా పుతిన్‌పై కొన్నిసార్లు హత్యాయత్నాలు జరిగాయి.
Follow Us