రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు.. పుతిన్ సంచలన ప్రకటన

గత నాలుగేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య సుదీర్ఘ యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ యుద్ధానికి ముగింపు పలికేలా రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాస్కోలో నిర్వహించిన రష్యా 'విక్టరీ డే' వేడుకల సందర్భంగా ప్రసంగించారు.

New Update
Putin

Putin

గత నాలుగేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య సుదీర్ఘ యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ యుద్ధానికి ముగింపు పలికేలా రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాస్కోలో నిర్వహించిన రష్యా 'విక్టరీ డే' వేడుకల సందర్భంగా ప్రసంగించారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ముగింపు దశకు చేరుకున్నట్లు పేర్కొన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇరుదేశాల మధ్య శాంతి చర్చలకు రష్యా రెడీగా ఉందనే సంకేతాలను ఇస్తున్నాయి. అయితే యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది ? దీనికి సంబంధించిన కాలపరిమితి ఏంటి ? అలాగే శాంతి ఒప్పంద ప్లాన్‌ గురించి వెల్లడించలేదు.  

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో నేరుగా సమావేశం కావడానికి ముందే శాంతి ఒప్పందం కుదుర్చుకోవడం అత్యంత అవసరమని పుతిన్ అన్నారు. ట్రంప్ చొరవతో రష్యా, ఉక్రెయిన్ మూడు రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన మరుసటి రోజే పుతిన్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ఇరుదేశాల మధ్య యుద్ధాన్ని ముగించేందుకు చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ కూడా నిన్న వ్యాఖ్యానించారు.

Also Read: అమెరికాలో దారుణం.. రన్‌వేపై పాదాచారిని ఢీకొట్టిన విమానం

ఇదిలాఉండగా ఉక్రెయిన్ నుంచి వైమానిక దాడుల ముప్పు పొంచి ఉందనే భయంతో రష్యా విక్టరీ డే వేడుకలను కట్టుదిట్టమైన భద్రత మధ్య నిర్వహించారు. రెడ్‌ స్క్వేర్‌ గ్రౌండ్‌లో జరిగిన ఈ పరేడ్‌లో రష్యా ఎలాంటి భారీ ఆయుధాలను ప్రదర్శించలేదు. కేవలం డిజిటల్ స్క్రీన్లపై మాత్రమే అధునాతన మిస్సైల్స్, డ్రోన్లు, యుద్ధ విమానాలను చూపించింది.  

మరోవైపు ఉక్రెయిన్‌తో యుద్ధం చేసేందుకు రష్యాకు ఉత్తర కొరియా బలగాలు మద్దతిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రష్యా విక్టరీ డే వేడుకల కవాతులో ఉత్తర కొరియా బలగాలు కూడా పాల్గొన్నాయి. 2022 ఫిబ్రవరిలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైంది. ఇప్పటికే వేలాది మంది పౌరులు, సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే ఇరుదేశాల మధ్య పలుమార్లు శాంతి చర్చలు జరిగినప్పటికీ అవి ఫలించలేదు. దీంతో సుదీర్ఘ కాలంగా ఈ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇలాంటి తురణంలో యుద్ధం ముగించే దిశగా పుతిన్ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

Also Read: లండన్‌లో కౌన్సిలర్‌గా తెలంగాణ యువతి..11 మందిని ఓడించి విజయం

Advertisment
తాజా కథనాలు