Heroin: గంజాయి ముఠా గుట్టురట్టు.. 105 కేజీల డ్రగ్స్ స్వాధీనం పంజాబ్‌లోని ఏకంగా 105 కేజీల డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ వందల కోట్లల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. పాకిస్థాన్ నుంచి సముద్రమార్గంలో దీన్ని తరలించినట్లు పేర్కొన్నారు. నలుగురు నిందితుల్ని అదుపులకి తీసుకున్నారు. By B Aravind 27 Oct 2024 | నవీకరించబడింది పై 27 Oct 2024 15:27 IST in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి ఈ మధ్యకాలంలో భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడుతున్నాయి. అయితే తాజాగా మరోసారి పెద్ద మొత్తంలో డ్రగ్స్ దొరికాయి. పంజాబ్‌లోని ఏకంగా 105 కేజీల డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో వీటి విలువ వందల కోట్లల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. సముద్ర మార్గంలో పెద్ద మొత్తంలో ఈ మాదక ద్రవ్యాలను తరలిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలకు పక్కాగ సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు రంగంలోకి దిగారు. Also Read: మహిళలకు గుడ్‌న్యూస్.. త్వరలోనే బస్సు యజమానులుగా.. భట్టీ కీలక వ్యాఖ్యలు సముద్ర మార్గంలో డ్రగ్స్ సరఫరా పాకిస్థాన్ నుంచి సముద్ర మార్గంలో డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నట్లు పంజాబ్ డీజీపీ గౌరవ్ అన్నారు. వాళ్ల వద్ద పెద్ద రబ్బరు ట్యూబులు, తుపాకులు, 105 కేజీల హెరాయిన్, 31 కేజీల కెఫిన్ అన్‌హైడ్రస్ అలాగే 17 కేజీల డీఎంఆర్ ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. అయితే పాకిస్థాన్‌కు చెందిన డ్రగ్ స్మగ్లర్‌తో సంబంధం ఉన్న నవజ్యోత్ సింగ్, లవ్‌ప్రీత్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఇందులో ప్రమేయం ఉన్న మరికొంతమంది నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. Also Read: 39 కానిస్టేబుళ్లపై సస్పెండ్ వేటు.. ఏక్ పోలీస్ విధానం అంటే ఏంటి ? ఇదిలాఉండగా తాజాగా హైదరాబాద్‌లో కూడా డ్రగ్స్ కలకలం రేపింది. హుమాయుంగార్‌లో స్థానిక పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే గంజాయి అమ్ముతున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వాళ్ల నుంచి 50 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.25 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు డ్రగ్స్ వ్యాపారులతో పాటు ఓ విదేశీ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయాలని పోలీస్ శాఖ కూడా కృషి చేస్తోంది. Also Read: Iran సుప్రీం లీడర్ ఆరోగ్య పరిస్థితి విషమం.. తర్వాతి వారసుడు ఆయనేనా ALso Read: విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. ఇరాన్‌లో 20 భారీ ఇంధన మిశ్రమాలు ధ్వంసం #telugu-news #drugs #national-news #heroin మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి