/rtv/media/media_files/2026/05/22/pulwama-attack-2026-05-22-06-55-22.jpg)
Pulwama attack mastermind, Hamza Burhan, killed by unknown men in POK
భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జాబితాలో ఉన్న పుల్వామా దాడి సూత్రధారి, అల్-బద్ర్ కమాండర్ హమ్జా బుర్హాన్ ఎట్టకేలకు హతమయ్యాడు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK) లోని ముజఫరాబాద్‌లో గురువారం గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో అతడు మృతి చెందాడు. జమ్మూ కశ్మీర్‌లోని రత్నీపుర్‌కు చెందిన బుర్హాన్.. దాదాపు ఏడేళ్ల క్రితమే ఫేక్ పత్రాలతో సరిహద్దు దాటి పాకిస్థాన్‌కు పారిపోయాడు. అక్కడ నిషేధిత ఉగ్రవాద సంస్థ అల్-బద్ర్‌లో చేరాడు. అతి తక్కువ కాలంలోనే ఆ సంస్థకు కమాండర్‌గా మారాడు. అయితే తాజాగా ముజఫరాబాద్‌లోని ఓ కళాశాల నుంచి అతడి బయటకు రాగానే ఈ దాడి జరిగినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు.
Also Read: పెళ్లి పీటలెక్కనున్న సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్...వరుడి తరుపున సూపర్ స్టార్ ఎంట్రీ?
భారత చరిత్రలో బ్లాక్ డేగా మిగిలిపోయిన 2019 ఫిబ్రవరి 14 పుల్వామా ఉగ్రదాడి వెనుక బుర్హాన్ కీలక పాత్ర పోషించాడు. ఈ విషాద ఘటనలో 40 మంది CRPF జవాన్లు వీరమరణం పొందారు. అయితే ఈ దాడికి బుర్హాన్ అవసరమైన భారీస్థాయి ఆయుధాలను, మందుగుండు సామగ్రిని సమకూర్చాడు. ఈ దేశద్రోహ చర్యలకు గాను భారత ప్రభుత్వం 2022లోనే ఇతడిని మోస్ట్ వాంటెట్ ఉగ్రవాది జాబితాలో చేర్చింది. సుదీర్ఘ కాలంగా భారత భద్రతా దళాల కన్నుగప్పి తిరుగుతున్న ఈ కరడుగట్టిన ఉగ్రవాది.. చివరకు POKలోనే గుర్తు తెలియని వ్యక్తులో చేతుల్లో హతమయ్యాడు.
Follow Us