/rtv/media/media_files/2025/02/11/0wpyvSb72w80vbrIiLLp.jpg)
delhi bjp
ఢిల్లీలో బంపర్ విక్టరీ కొట్టింది బీజేపీ. 48 సీట్లతో విజయఢంకా మోగించింది. దీంతో 27 ఏళ్ల తరువాత దేశ రాజధానిలో కమలం పార్టీ పాగా వేసింది. అధికారంలోకి వచ్చిన బీజేపీ ముందు పది అతిపెద్ద సవాళ్లు ఉన్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడం ఇప్పుడు బీజేపీ ముందున్న అతిపెద్ద టాస్క్ గా చెప్పుకోవచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ, అరవింద్ కేజ్రీవాల్ నెరవేర్చని వాగ్దానాలపై ఢిల్లీ బీజేపీ ఎన్నికల్లో పోరాడింది. ఢిల్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా కాషాయ పార్టీ కేజ్రీవాల్ నెరవేర్చని వాగ్దానాలన్నింటినీ నెరవేరుస్తామని ప్రజలకు హామీ ఇచ్చింది.
ఢిల్లీ బీజేపీ ముందున్న ఎన్నికల వాగ్దానాలు
1.మూడు సంవత్సరాలలో యమునా నదిని శుభ్రపరచడం
2. మూడు సంవత్సరాలలో చెత్తను తగ్గించడం.
3. ప్రతి పేద కుటుంబంలోని ప్రతి మహిళకు రూ.500 కి LPG సిలిండర్, హోలీ, దీపావళికి ఒక గ్యాస్ సిలిండర్ ఉచితం.
4. ప్రతి పేద మహిళకు నెలకు రూ. 2500 ఆర్థిక సహాయం.
5. ప్రతి గర్భిణీ స్త్రీకి రూ. 21000 ఆర్థిక సహాయం, 6 పోషకాహార కిట్లు.
6. ఆయుష్మాన్ భారత్ పథకం తొలి మంత్రివర్గంలోనే అమలు చేయడం, రూ.10 లక్షల వరకు ఉచిత చికిత్స అందుబాటులోకి తేవడం
7. నిలిచిపోయిన సీనియర్ సిటిజన్ల పెన్షన్ ను తిరిగి ప్రారంభించడం. 60 ఏళ్లు పైబడిన వారికి నెలకు రూ. 2500, 70 ఏళ్లు పైబడిన వారికి రూ. 3000 ఇవ్వడం
8. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 20 వేల లీటర్ల ఉచిత నీరు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ పథకాలు కొనసాగించడం
9. ఢిల్లీని కాలుష్య రహితంగా మార్చడానికి 13000 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకురావడం, ఢిల్లీని 100% ఈ-బస్ నగరంగా మార్చడం
10. ఆటో-టాక్సీ డ్రైవర్లు, గిగ్ కార్మికులకు రూ. 10 లక్షల వరకు జీవిత బీమా, రూ. 5 లక్షల వరకు ప్రమాద బీమా కవరేజ్ అందించడం.
Also Read : RBI : ఏంటీ నిజమా.. రూ. 200 నోటును బ్యాన్ చేస్తున్నారా.. ఆర్బీఐ కీలక ప్రకటన!