Wayanad: వయనాడ్‌లో లక్ష ఓట్ల మెజార్టీతో దూసుకుపోతున్న ప్రియాంక గాంధీ
వయనాడ్‌లో ప్రియాంక గాంధీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతానికి లక్ష ఓట్ల మెజార్టీతో ఆమె దూసుకుపోతున్నారు. సీపీఐ నుంచి సత్యన్ మొకేరి, బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ వెనుకంజలో ఉన్నారు.
ప్రియాంక గాంధీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతానికి లక్ష ఓట్లకు భారీ ఆధిక్యంలో ప్రియాంక దూసుకుపోతున్నారు. సీపీఐ నుంచి సత్యన్ మొకేరి, బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ వెనుకంజలో ఉన్నారు. మధ్యాహ్నం కల్లా పూర్తి స్థాయి ఫలితం వెలువడే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో రాహుల్‌గాంధీ 3.64 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిశారు.
Earthquake: గంట వ్యవధిలో నాలుగు భూకంపాలు.. భయాందోళనలో జనం
ఆదివారం ఒకే గంటల వ్యవధిలో భారత్, మయన్మార్, తజికిస్తాన్‌లో నాలుగు భూకంపాలు వచ్చాయి. భారత్‌లో రెండు, మయన్మార్, తజికిస్తాన్‌లో ఒక్కోటి వచ్చాయి. అయితే ఈ భూకంపాల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదు.
ఈమధ్య వరుస భూకంపాలు భయపెడుతున్నాయి. ఆదివారం ఒకే గంటల వ్యవధిలో భారత్, మయన్మార్, తజికిస్తాన్‌లో నాలుగు భూకంపాలు వచ్చాయి. దీంతో జనం భయాందోళనలో ఇళ్ల నుంచి బయటకు పరిగెత్తారు. మొదటి భూకంపం తజికిస్తాన్‌లోని ఫైజాబాద్‌కు సమీపంలో రాగా.. ఆ తర్వాత మయన్మార్‌లో మీక్టిలాలో వచ్చింది. అనంతరం భారత్‌లోని జమ్ముకశ్మీర్‌లోని కిష్ట్వార్‌లో, ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకశీలో భూకంపాలు వచ్చాయి.
అయితే ఈ భూకంపాల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదు. తజికిస్తాన్‌లో భూకంప తీవ్రత 6.0 గా నమోదయ్యింది. భారత్‌లో ఫైజాబాద్‌లో ఉదయం 9 గంటలకు భూ ప్రకంపనలు సంభవించాయి. కేవలం ఒక గంట వ్యవధిలోనే నాలుగు భూకంపాలు వచ్చాయి. మయన్మార్‌లో 5.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. మార్చి 28న అక్కడ 7.7 తీవ్రతతో వచ్చిన భూకంపం విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మళ్లీ బలమైన భూకంపం సంభవించడం కలకలం రేపింది. జనం ఇళ్ల నుంచి భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు.
జమ్ముకశ్మీర్‌లో హిమాలయన్ ప్రాంతంలో 4.2 తీవ్రతో భూకంపం రావడంతో అక్కడి స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరిగెత్తారు. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో 4.0 తీవ్రతతో భూకంపం వచ్చింది. అయితే ఈ భూకంపాల వల్ల ఎలాంటి నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ భూకంపాలు భారత్ ప్లేట్ యూరేషియన్ ప్లేట్‌తో ఢీకోనడం వల్ల సంభవించే టెక్టోనిక్ కదలికల వల్ల సంభవిస్తున్నాయి. ఇదిలాఉడంగా మార్చి 28న మయన్మార్ వచ్చిన భూకంప ధాటికి 3600 మందికి పైగా జనం మృత్యువాత పడ్డారు.