/rtv/media/media_files/2025/02/26/I2NqKYlQ0D2AEFyVFzTB.jpg)
Jhumoir Binandini programme Photograph: (Jhumoir Binandini programme)
చక్కటి ఛాయ్ సువాసనా, రుచి ఛాయ్ వాలా కంటే ఎక్కువ ఎక్కువ ఎవరికి తెలుసని ప్రధాని మోదీ అన్నారు. పవిత్ర భూమి ఈశాన్య భారత్‌లో నూతన శకం ప్రారంభమైందని ఆయన తెలిపారు. అస్సాం గౌహతిలో జూమోయిర్ బినందిని (మెగా ఝుమోయిర్) 2025 కార్యక్రమానికి మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో వేలమంది మహిళలు, పురుషులు అస్సాం గిరిజన సాంప్రదాయ నృత్యం చేశారు. చూడటానికి అది ఓ కన్నుల పండగలా ఉంది. ఈ ప్రొగ్రామ్ సంబంధించిన వీడియో ప్రధాని తన అఫీషియల్ ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. జూమోయిర్ బినందిని కార్యక్రమం అపూర్వంగా జరిగింది. ఇది అస్సాం సంస్కృతికి, గొప్ప టీ తెగల శక్తివంతమైన ప్రదర్శన అని ప్రధాని పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: shivaratri: కోటప్పకొండపై కుప్పకూలిన డ్రోన్.. ట్రాన్స్‌ఫార్మర్‌పై చెలరేగిన మంటలు
Yesterday’s Jhumoir Binandini programme was phenomenal. It was a vibrant display of Assam’s culture, especially of the great tea tribes.
— Narendra Modi (@narendramodi) February 25, 2025
Looking forward to taking part in the Advantage Assam Summit later today… pic.twitter.com/2ClgTOo04O
ఇది కూడా చదవండి: మజాకా రివ్యూ.. సందీప్ కిషన్ ఖాతాలో హిట్ పడిందా?
ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వాస్, విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అడ్వాంటేజ్ అస్సాం 2.0 ఇన్వె్స్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్‌ను ప్రారంభించారు. వికసిత్ భారత్ సాధనలో అస్సాం కీలక పాత్ర పోషించనుందని పేర్కొన్నారు. అస్సాం సీఎం హిమంత ప్రధాని మోదీకి అరుదైన బహుమతి అందించారు. సెమిండక్టర్ చిప్‌లతో తయారు చేసిన ఖడ్గమృగం బొమ్మను, కామాఖ్య ఆలయ ప్రతిమను బహకరించారు. రాష్ట్రంలో సెమీకండక్టర్ తయారీ కేంద్రాన్ని నిర్మించేందుకు టాటా గ్రూప్‌తో అస్సాం ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.