ఫైనాన్షియల్ ఈయర్ 2025 బడ్జెట్‌పై శనివారం పార్లమెంట్‌లో ప్రధాని మోదీ మాట్లాడారు. అంతకు ముందు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్‌లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని నరేంద్ర మోదీ అన్నారు. ఇది ప్రజల బడ్జెట్ అని.. నూటికి నూరు శాతం ఇది దేశాభివృద్ధికి దోహదపడుతుందని ఆయన స్పష్టం చేశారు.
#WATCH | On Union Budget 2025, Prime Minister Narendra Modi says "This budget is a force multiplier. This budget will increase savings, investment, consumption and growth rapidly. I congratulate Finance Minister Nirmala Sitharaman and her entire team for this Janta Janardan's,… pic.twitter.com/gH2imZethW
— ANI (@ANI) February 1, 2025
ఇది కూడా చూడండి: Maha Kumbh Mela: రైల్వేశాఖకు పెద్ద షాకిచ్చిన భక్తుడు.. కుంభమేళాకు వెళ్లలేకపోయినందుకు 50 లక్షల నష్ట పరిహారం కట్టాల్సిందే!
ఇది దేశంలో పెట్టుబడులకు బూస్టింగ్ ఇస్తోందని తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్‌ను మరింత బలోపేతం చేస్తోందని ఆయన వివరించారు. తయారీ రంగానికి 2025 బడ్జెట్‌లో ఎంతో ప్రాధాన్యత ఇచ్చామని ఆయన అన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డుల లిమిట్ రూ.5 లక్షల వరకు పెంచామని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ప్రస్తుతం ట్యాక్స్ పేయర్లకు రిలీఫ్ ఇస్తూ 12 లక్షల వరకు సంవత్సర ఆదాయం ఉండే వారికి ఇన్‌కమ్ ట్యాక్స్ ఉండదని చెప్పారు.