ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. సాధారణ ప్రజలతో పాటు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఇక జనవరి 29న జరిగిన మౌని అమావాస్య రోజున కోటాను కోట్ల భక్త జనం ప్రయాగ్‌రాజ్‌కు చేరుకున్నారు.
Also Read : ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు.. ఆ 18 మంది జడ్జిల బ్లాక్ మెయిల్?
8 కోట్ల మంది హాజరు
దాదాపు 8 కోట్ల మంది ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరైనట్లు తెలిసింది. ఇక ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ సైతం స్పెషల్ ట్రైన్‌లను ఏర్పాటు చేసింది. దాదాపు 190 ప్రత్యేక రైళ్లను నడిపింది. ఇక పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు పుణ్య స్నానాలు ఆచరించారు. దీనికోసం యూపీ ప్రభుత్వం భారీ భద్రతను ఏర్పాటు చేసింది.
Also Read : ఇమ్వానికి ఇంటి భోజనం తినిపించిన యంగ్ రెబల్ స్టార్!
100 అడుగుల అనకొండ
ఇదిలా ఉంటే కుంభమేళాలో ఓ భారీ సర్పం కనిపించినట్లు తెలుస్తోంది. కుంభమేళాలో భక్తులు స్నానం చేస్తుండగా.. వారి వెనుకనుంచి అతి పెద్ద అనకొండ నీటిలో దర్శనమిచ్చినట్లు ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దాదాపు 100 అడుగుల పొడవైన సర్పం కనిపించిందంటూ.. దాని బరువు 1000 కిలోలు ఉంటుందని ఆ వీడియోలో రాసుకొచ్చారు.
Also Read: Horoscope Today: నేడుఈ రాశివారికి ఆకస్మిక ధన లాభం ఉంది...!
అంతేకాకుండా ఆ వీడియోకు దాదాపు లక్షకు పైగా వ్యూవర్స్ లైక్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో అంతా భయపడుతున్నారు. కానీ అసలు విషయం తెలిసి ఊపిరిపీల్చుకుంటున్నారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఎలాంటి నిజం లేదని తేలింది. ఆ వీడియో ఫేక్ అని తెలుగు పోస్ట్ వెల్లడించింది. ఎందుకంటే ఆ భారీ పాము నీళ్లలో కనిపిస్తున్నా.. భయపడకుండా అక్కడే ఉన్న భక్తులు స్నానాలు చేస్తుండటం వీడియోలో చూస్తున్నాం. కాబట్టి ఇది పూర్తిగా ఫేక్ వీడియో అని అర్థం అవుతోంది.