BIG BREAKING: కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం.. ప్రాణ భయంతో భక్తుల పరుగులు!

ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రభుత్వం నిర్మించిన గూడారాల్లో మంటలు చెలరేగడంతో భక్తులంతా ప్రాణ భయంతో పరుగులు తీశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రాణ, ఆస్తి నష్టం గురించి తెలియాల్సివుంది.

New Update
kumbamela

rayag Raj Kumbh Mela Fire accident

Kumbamel: ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రభుత్వం నిర్మించిన గూడారాల్లో మంటలు చెలరేగడంతో భక్తులంతా ప్రాణ భయంతో పరుగులు తీశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రాణ, ఆస్తి నష్టం గురించి తెలియాల్సివుంది. 

భోజనం వండుతుండగా మంటలు..

ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వివేకానంద సేవా సమితి టెంట్‌లో భోజనం వండుతుండగా మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఒక్కసారిగా గుడారాల్లో మంటలంటుకున్నాయి. క్షణాల్లో అగ్గి భారీ ఎత్తున ఎగిసిపడటంతో భక్తులంతా పరుగులు తీశారు. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించడంతో జనం కాసేపు ఉక్కిరిబిక్కిరయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. 

ఇక సెక్టార్ 5లో మంటలు చెలరేగాయి. మంటలు మరిన్ని టెంట్లను చుట్టుముట్టాయి. వాటిలో ఉంచిన గ్యాస్ సిలిండర్లలో పేలుళ్లు సంభవించాయి. 20 నుండి 25 టెంట్లు బూడిదయ్యాయి. మంటలను అదుపు చేసేందుకు ఆరు అగ్నిమాపక యంత్రాలు రంగంలోకి దిగినప్పటికీ మంటలు వ్యాపిస్తున్నాయి. మంటలను అదుపు చేసేందుకు పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు పరిసర ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నారు. శాస్త్రి బ్రిడ్జి, రైల్వే బ్రిడ్జి మధ్య ప్రాంతంలోనూ ఈ మంటలు చెలరేగాయి. ఈ ప్రాంతం మొత్తం మహాకుంభమేళా పరిధిలోకి వస్తుందని చెప్పారు.

టెంట్‌లో ఉంచిన సిలిండర్లు ఒక్కొక్కటిగా పేలుతుండడంతో మంటలు చెలరేగుతున్నాయి. సిలిండర్‌ పేలడంతో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. అగ్నిప్రమాదం తర్వాత జాతర ప్రాంతమంతా గందరగోళ పరిస్థితి నెలకొంది. అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అగ్నిప్రమాదం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. సెక్టార్ 5లో చెలరేగిన మంటలు క్రమంగా సెక్టార్ 19, 20కి కూడా వ్యాపించాయి. బలమైన గాలి కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి. ఆందోళన చెందాల్సిన పనిలేదని అధికార యంత్రాంగం తెలిపింది. పుకార్లను పట్టించుకోవద్దని విజ్ఞప్తి చేసింది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు