కొత్త పార్టీకి నేను నాయకుడ్ని కాదు.. ప్రశాంత్ కిషోర్ కీలక ప్రకటన

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ అక్టోబర్ 2న కొత్త పార్టీని ప్రారంభించనున్నారు. ఈ పార్టీకి తానెప్పుడు నాయకుడిని కాదని.. అలా ఉండాలని ఎప్పుడూ కోరుకోలేదని అన్నారు. ప్రజలే నాయకత్వ బాధ్యతలు స్వీకరించాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు.

New Update
PK

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ కొత్త పార్టీని స్థాపించే సమయం ఆసన్నమైంది. అక్టోబర్ 2న పార్టీ పేరు, నాయకత్వం సహా ఇతర వివరాలను ప్రకటిస్తామని చెప్పారు. రెండేళ్ల క్రితం చేపట్టిన జన్‌ సూరాజ్ యాత్రనే రాజకీయ పార్టీగా మార్చనున్నట్లు ప్రశాంత్ కిషోర్‌ గతంలోనే చెప్పారు. వచ్చే ఏడాది జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనే పార్టీ తరఫున పోటీ చేస్తామని తెలిపారు. జన్‌ సురాజ్‌ పేరుతో యాత్ర ప్రారంభించి రెండేళ్లు పూర్తి చేసుకోనున్న సందర్భంగా ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రారంభిచబోయే పార్టీకి తానెప్పుడు నాయకుడిని కాదని.. అలా ఉండాలని ఎప్పుడూ కోరుకోలేదని అన్నారు. ప్రజలే నాయకత్వ బాధ్యతలు స్వీకరించాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు.    

Also Read: అయిన వారే ఆగం చేస్తున్నారు.. చిన్నారులపై అఘాయిత్యాల కేసుల్లో షాకింగ్ విషయాలు!

మూడు ప్రధాన ఉద్దేశాలతోనే జన్‌ సురాజ్‌ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలు, వారి చిన్నారుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, తప్పుదోవ పట్టించే నాయకుల ఒత్తిడికి తలొగ్గి ఓట్లు వేయకుండా అవగాహన కల్పించడం, రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించే ఉద్దేశంతోనే ప్రతి గ్రామంలో పర్యటించాలని ఈ యాత్ర చేపట్టామని తెలిపారు. రాష్ట్రంలో ఈ యాత్ర ఇప్పటివరకు 60 శాతం పూర్తయిందని.. మిగిలిన యాత్ర కూడా కొనసాగుతుందన్నారు. రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ఈ యాత్ర కొనసాగిందని.. పార్టీకి నాయకత్వ బాధ్యతలు తాను వహించడం లేదని పేర్కొన్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు