Maharashtra ఎన్నికల్లోకి లారెన్స్ బిష్ణోయ్. ఆ పార్టీకి వెన్నులో వణుకు!

మహారాష్ట్ర ఎన్నికల్లో లారెన్స్ బిష్ణోయ్ పోటీ చేయనున్నారనే వార్త సంచలనం రేపుతోంది.ఉత్తర భారతీయ వికాస్ సేన తమ పార్టీ నుంచి బిష్ణోయ్‌ను పోటీ చేయించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.తమ పార్టీ తరుఫు నుంచి పోటీ చేయాలని లారెన్స్‌కు పార్టీ అధినేత శుక్లా లేఖ రాశారు.

New Update
Lawrence

Maharashtra Election: 

లారెన్స్ బిష్ణోయ్...భారతదేశంలో ఇప్పుడు ఈ పేరు చాలా పాపులర్. జైల్లో ఉంటూనే ఎన్సీపీ నేత సిద్దిఖీని హత్య చేయించాడు. సల్మాన్ ఖాన్ మీద కాల్పులు జరిపించాడు. అతనిని చంపేస్తానని బెదిరించాడు కూడా. నటుడు సల్మాన్ ఖాన్‌తో ఎన్‌సిపి నాయకుడికి ఉన్న సన్నిహిత సంబంధాల వల్లనే బాబా సిద్దిఖీని చంపానని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. అయితే ఇతను చాలారోజులుగా అహ్మదాబాద్‌లోని సబర్మతి జైల్లో ఉంటున్నాడు. ఇతనో గ్యాంగ్ స్టర్. ఎప్పటికైనా సల్మాన్ ఖాన్‌ను చంపే తీరుతామని ప్రతినబూనాడు లారెన్స్ బిష్ణోయ్. ఇదంతా బిష్ణోయ్‌లకు దైవ సమానమైన కృష్ణ జింకలను సల్మాన్ ఖాన్ వేటాడడమే కారణం. అయితే బాబా సిద్ధిఖీని చంఇన దగ్గర నుంచి ప్రతీరోజూ లారెనస్ బిష్ణోయ్ గురించి ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా మరో న్యూస్ బయటకు వచ్చింది .

Also Read :  అన్న కోసం చాలా చేశా.. జగన్ నాకోసం ఏమీ చేయలేదు.. షర్మిల కంటతడి

లారెన్స్ బిష్ణోయ్‌ ఎన్నికల్లో పోటీ..

మహారాష్ట్ర ఎన్నికల్లోకి లారెన్స్ బిష్ణోయ్ ఎంటర్ అనున్నాడు. ఉత్తర భారతీయ వికాస్ సేన ఇతనికి టికెట్ ఇచ్చింది.  పశ్చిమ బాంద్రా నియోజకవర్గం లారెన్స్ పోటీ చేస్తాడని పార్టీ అనౌన్స్ కూడా చేసింది. బిష్ణోయ్ తరపున నామినేషన్ పత్రాలను చేయానికి పార్టీ అధినేత సునీల్ శుక్లా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలంటూ బిష్ణోయ్‌కు శుక్లా లేఖ రాశారు. ఒకవేళ కనుక లారెన్స్ బిష్ణో బీ ఫారాన్ని పొందేందుకు రిటర్నింగ్ అధికారి దగ్గరకు కూడా వెళ్ళరని తెలుస్తోంది. ఒకవేళ అతనికి కనుక బీ ఫారాన్ని ఇవ్వడానికి ఒప్పుకుంటే ఉత్తర భారతీయ వికాస్ నుంచి 50 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని శుక్లా చెబుతున్నారు. ఇప్పటికే నలుగురి పర్లను అనౌన్స్ చేశామని తెలిపారు. లారెస్ బిష్ణోయ్ మరోపేరు బాల్కరన్ బరాద్‌తో బీ ఫారాన్ని పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. 

Also Read :  అలా చేస్తే వచ్చే పాపులారిటీ అక్కర్లేదు.. వైరలవుతున్న సాయి పల్లవి కామెంట్స్

లారెన్స్ బిష్ణోయ్ ఉత్తర భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి అంటున్నారు శుక్లా.   లేఖలో, శుక్లా బిష్ణోయ్ విప్లవకారుడు భగత్ సింగ్ మధ్య పోలికను చూపించాడు. మహారాష్ట్రలో పుట్టి పెరిగిన ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన చాలా మంది ఉత్తర భారతీయులు తమ పూర్వీకులు ఉత్తర భారతీయులు అనే కారణంగా రిజర్వేషన్ హక్కులను కోల్పోతున్నారని ఆయన ఉద్ఘాటించారు. భారతదేశం ఒక ఏకీకృత సంస్థ అయితే, ఈ హక్కులను ఎందుకు నిరాకరిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం లారెన్స్ బిష్ణోయ్ ప్రతిస్పందనతో పాటూ రిటర్నింగ్ అధికారి ఆమోదం కోసం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని శుక్లా చెబుతున్నారు. 

Also Read :  మా ఎమ్మెల్యేలకు ఎన్సీపీలో చేరాలని రూ. కోట్లు ఆఫర్ చేశారు: కాంగ్రెస్

ఎన్సీపీ కి వెన్నులో వణుకు...

లారెన్స్ కనుక ఎన్నికల్లో కి దిగితే ఎన్సీపీకి చుక్కలు కనబడతాయి ఇప్పటికే బాబా సిద్ధిఖీని చంపి ఆ పార్టీలో భయాన్ని నింపాడు. ఇప్పుడు కనుక ఇతను రాజకీయాల్లోకి వస్తే మరింత కష్టమవుతుంది. మహారాష్ట్రలో నవంబర్ 20న ఒకే దశలో ఎన్నికలు జరగనుండగా.. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది. మహారాష్ట్రలో, ఏక్‌నాథ్ షిండే తాలూకా  శివసేన, బీజేపీ,  అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సిపితో కూడిన అధికార మహాయుతి కూటమి కాంగ్రెస్, శివసేన (యుబిటి), శరద్ పవార్‌లతో కూడిన ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (ఎంవిఎ)లు పోటీ పడుతున్నాయి. ఎన్సీపీకి శరద్ పవార్ నాయకత్వం వహిస్తున్నారు.

Also Read: Canada వెళ్లి చదువుకోవాలనుకునేవారు జాగ్రత్త.. భారత దౌత్యవేత్త సంచలన వ్యాఖ్యలు

Advertisment
Advertisment
తాజా కథనాలు