Maoist: తెలంగాణలోకి మావోయిస్టు అగ్రనేతలు.. ఆ ఏరియాల్లోనే షెల్టర్‌!

మావోయిస్టు అగ్రనేతలు తెలంగాణలోకి ప్రవేశిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీలో తెలంగాణకు చెందిన వాళ్లే ఎక్కువగా ఉన్నారని, వారంతా ఏజెన్సీ పల్లెల్లో షెల్టర్‌‌ పొందాలని చూస్తున్నారనే డౌట్ తో ఆ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు.

author-image
By srinivas
New Update
encounter

Maoist: మావోయిస్టు అగ్రనేతలు తెలంగాణలోకి ప్రవేశిస్తున్నట్లు తెలుస్తోంది. మోదీ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ 2026 నేపథ్యంలో భారీగా నష్టపోతున్న మావోయిస్టులు.. ఎలాగైనా పార్టీని దక్కించుకునేందుకు తెలంగాణ వైపు చూస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకాలం చత్తీస్‌‌గఢ్‌‌ రాష్ట్రంలో షెల్టర్‌‌ తీసుకున్న అన్నలు.. ఇటీవల 36 మందిని కోల్పోవడంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలోకి చొరబడడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్లే ఎక్కువగా ఉన్నారని, వారంతా సరిహద్దుల్లోని ఏజెన్సీ పల్లెల్లో చేరి షెల్టర్‌‌ పొందాలని భావిస్తున్నట్లు భద్రతాబలగాలు భావిస్తున్నాయి. 

ఇది కూడా చదవండి: నమస్తే లారెన్స్ భాయ్.. సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసీ పోస్ట్ వైరల్

కేంద్ర కమిటీలో తెలంగాణ లీడర్లు..

ఇందులో భాగంగానే చత్తీస్‌గఢ్‌‌ రాష్ట్ర సరిహద్దులో ఉండే భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మరింత భద్రత ఏర్పాటు చేశారు. గోదావరి దాటి తెలంగాణలోకి రాకుండా స్థానిక పోలీసులను అలర్ట్ చేస్తున్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీలో ఉన్న తెలంగాణకు చెందిన పెద్ద లీడర్లను రాష్ట్రంలోకి పంపించి సేఫ్‌‌ జోన్‌‌లో ఉంచడానికి మావోయిస్టులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మావోయిస్టులు రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నారు. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని అడవులను జల్లెడ పడుతున్న బలగాలు.. అటు మహారాష్ట్ర సరిహద్దుల్లోనూ పోలీసులు రెడ్​ అలర్ట్​ ప్రకటించారు. గొత్తి కోయగూడేల్లోనూ కార్డన్ సెర్చ్ పేరిట విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. 

ఇది కూడా చదవండి: రూ.1200 కోట్ల స్కామ్‌ దర్యాప్తులో కుట్ర.. ఐపీఎస్ అధికారిణి అరెస్టు

ఇన్ ఫార్మర్ వ్యవస్థన అలర్ట్​

ఇప్పటికే పలువురు మావోయిస్టులు తెలంగాణలోకి ప్రవేశించారనే సమాచారం పోలీసులకు నిద్రపట్టనివ్వట్లేదు. దీంతో భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని పోలీస్‌‌ స్టేషన్ల పరిధిలో ఇన్ ఫార్మర్ వ్యవస్థన అలర్ట్​ చేసినట్లు తెలుస్తోంది. అటవి ప్రాంతాల్లోని పోలీస్ ​స్టేషన్లకు మరింత భద్రత పెంచారు. మారుమూల గ్రామాల్లో నిద్రలు చేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు పోలీస్ అధికారులు. అంతేకాదు మావోయిస్టులకు షెల్టర్‌‌ ఇవ్వకూడదని యువతకు సూచిస్తున్నారు. అలాగే మావోయిస్టులు టార్గెట్ చేసిన పలు పార్టీల లీడర్లు, కాంట్రాక్టర్లను పోలీసులు అలర్ట్ చేస్తున్నారు. 

ఇది కూడా చదవండి: మళ్ళీ బాంబు బెదిరింపు..ఈసారి ముంబయ్‌‌–లండన్ ఎయిర్ ఇండియా విమానానికి

ఎన్‌కౌంటర్ పై ప్రతీకారం

ఇదిలా ఉంటే..  అబూజ్‌మడ్ ఎన్‌కౌంటర్ పై ప్రతీకారంతో రగిలిపోతున్న మావోయిస్టులు బీకర దాడులు చేయాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా పోలీసు బలగాలను అంతమొందించేందుకు పలుచోట్ల మందుపాతరలను పాతిపెడుతున్నారు. భద్రతాబలగాలు తిరిగే ప్రాంతాల్లో ఏకంగా బీరు సీసాల్లో ఐఈడీ(ఇంప్రూవైజ్డ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ డివైజ్‌)లను అమర్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్ప సమీప అడవుల్లో భద్రతా బలగాలు పలు మందుపాతరలను గుర్తించినట్లు తెలిపారు. సీఆర్పీఎఫ్‌-81 బలగాలు కూంబింగ్‌ నిర్వహిస్తుండగా వాటిని వెలికి తీసి పేల్చేశారు. 

ఇది కూడా చదవండి: IRCTC:ఐఆర్సీటీసీలో కీలక మార్పు..అడ్వాన్స్ బుకింగ్స్ 60 రోజులకు కుదింపు

 

Advertisment
Advertisment
తాజా కథనాలు