PM Modi : రైతులకు గుడ్‌న్యూస్‌.. ఈరోజే రూ.2 వేలు జమ

పీఎం కిసాన్‌ స్కీమ్‌లో భాగంగా ప్రధాని మోదీ.. రైతుల ఖాతాల్లోకి రూ.20 వేల కోట్లు విడుదల చేయనున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 9.4 కోట్ల మందికి పైగా రైతులు ఈ పథకం ద్వారా రూ.2 వేలు పొందనున్నారు.

New Update
PM Modi

మోదీ సర్కార్‌ రైతులకు గుడ్‌న్యూస్ తెలిపింది. పీఎం కిసాన్‌ స్కీమ్‌లో భాగంగా ప్రధాని మోదీ.. రైతుల ఖాతాల్లోకి రూ.20 వేల కోట్లు విడుదల చేయనున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 9.4 కోట్ల మందికి పైగా రైతులు ఈ పథకం ద్వారా రూ.2 వేలు పొందనున్నారు. మహారాష్ట్రలోని వాసిమ్‌లో జరగనున్న కార్యక్రమంలో రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమకానున్నాయి. మరోవైపు నమో షెట్కారీ మహాసన్మాన్ నిధి యోజన కింద మహారాష్ట్ర రైతులు అదనంగా మరో రూ.2 వేల కోట్లు లబ్ధి పొందనున్నారు. పీఎం కిసాన్ పథకం కింద ఇది 18వ విడత కావడంతో రైతల ఖాతాల్లోకి జమ చేసే డబ్బు రూ.3.45 లక్షల కోట్లు దాటనుంది. దేశవ్యాప్తంగా మొత్తం 11 కోట్ల మందికిపైగా రైతులకు లబ్ధి చేకూరనుంది.    

Also Read: హర్యానాలో ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్..

2019, ఫిబ్రవరి 24న పీఎం కిసాన్ పథకం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఏటా సొంత భూమి ఉన్న రైతులకు కేంద్రం  మూడు దశల్లో రూ.6 వేలు ఆర్థిక సాయం చేస్తోంది. అంటే ఒక్కో దశలో రూ.2 వేలు వస్తాయి. ఈ పథకం ద్వారా డబ్బులు పొందడానికి రెండు హెక్టార్ల వరకు మాత్రమే భూమి ఉన్న రైతులు అర్హులు. ఇదిలా ఉండగా.. ప్రధాని మోదీ దేశీయ వీర్య ఉత్పత్తి సాంకేతికతను కూడా ప్రారంభించనున్నారు. ఒక్కో డోస్‌కు రూ.200 ఖర్చు తగ్గించే లక్ష్యంతో ఈ సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు