PM Modi : ఇజ్రాయిల్ పర్యటనకు ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఇదే!

భారత ప్రధాని నరేంద్ర మోదీ రేపటి నుంచి రెండు రోజుల పాటు ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు. 2017లో తొలిసారి ఇజ్రాయెల్‌లో అడుగుపెట్టి చరిత్ర సృష్టించిన మోదీ, తొమ్మిదేళ్ల తర్వాత మళ్ళీ ఆ దేశానికి వెళ్తున్నారు.

New Update
PM Modi's foreign travel

భారత ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) రేపటి నుంచి రెండు రోజుల పాటు ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు. 2017లో తొలిసారి ఇజ్రాయెల్‌లో అడుగుపెట్టి చరిత్ర సృష్టించిన మోదీ, తొమ్మిదేళ్ల తర్వాత మళ్ళీ ఆ దేశానికి వెళ్తున్నారు. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక బంధాన్ని మరో స్థాయికి తీసుకెళ్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

బుధవారం రోజున టెల్ అవీవ్ చేరుకోగానే ప్రధాని మోదీకి ఘనస్వాగతం లభించనుంది. వెంటనే ఇజ్రాయెల్ ప్రధాని బెన్యామిన్ నెతన్యాహుతో ఆయన ప్రత్యేకంగా మీట్ అవుతారు. ఈ పర్యటనలో అత్యంత కీలకమైన ఘట్టం ఇజ్రాయెల్ పార్లమెంట్ ను ఉద్దేశించి మోదీ ప్రసంగించడం. ఈ గౌరవం దక్కించుకోనున్న తొలి భారతీయ నేతగా ప్రధాని మోదీ సరికొత్త రికార్డు సృష్టించనున్నారు. అనంతరం అక్కడ స్థిరపడిన భారత సంతతి ప్రజలతో ఆయన ముఖాముఖి నిర్వహిస్తారు. టెల్ అవీవ్‌లో సుమారు 18,000 నుండి 20,000 మంది భారతీయులు ఉన్నారు. 

Also Read :  ఇన్‌స్టాగ్రామ్ పరిచయమైన యువతిని పార్టీకి పిలిచి..

Also Read :  తమిళనాడు ఓటర్ల లెక్క తేలింది... 74లక్షల మంది ఓటర్లు ఔట్‌

ఇజ్రాయెల్ అధ్యక్షుడితో భేటీ

రెండో రోజు అంటే గురువారం ప్రధాని మోదీ జెరూసలేంలోని యద్ వాషెమ్ హోలోకాస్ట్ మెమోరియల్‌ను సందర్శిస్తారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో నాజీల చేతిలో ప్రాణాలు కోల్పోయిన లక్షలాది మంది యూదులకు ఆయన నివాళులర్పిస్తారు. అనంతరం ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్‌తో భేటీ అవుతారు. చివరగా నెతన్యాహుతో కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, క్వాంటం టెక్నాలజీ వంటి అత్యాధునిక రంగాల్లో పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. ఈ పర్యటనలో దాదాపు 8.6 బిలియన్ డాలర్ల విలువైన రక్షణ ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది.

ఉగ్రవాదంపై పోరాటంలో ఇండియా, ఇజ్రాయెల్ ఒకే మాటపై ఉన్నాయని ఇజ్రాయెల్‌లో భారత రాయబారి జె.పి. సింగ్ పేర్కొన్నారు. ఈ పర్యటన కేవలం రక్షణ రంగమే కాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్నోవేషన్ వంటి రంగాల్లో ఇరు దేశాలను మరింత దగ్గర చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Advertisment
తాజా కథనాలు