/rtv/media/media_files/2025/03/16/b4GV3bVlKDqAafn0Uhd0.jpg)
PM Modi
ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడారు. అమెరికాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకుడు లెక్స్‌ఫ్రిడ్‌మ్యాన్ పాడ్‌కాస్ట్‌లో ఆయన పలు విషయాలను పంచుకున్నారు. '' పేరులో నా శక్తి లేదు. 140 కోట్ల మంది భారతీయుల మద్దతు, దేశ సంస్కృతి, వారసత్వంలోనే ఉంది. ప్రపంచ నేతలతో నేను చేయి కలిపితే అది మోదీ చేస్తుంది కాదు. 140 కోట్ల మంది భారతీయులు చేస్తున్నట్లే.
Also Read: గ్రూప్ 1 ఫలితాలపై అనుమానాలు.. ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు
శాంతి గురించి మేము మాట్లాడినప్పుడు ప్రపంచం మా మాట వింటుంది. ఎందుకంటే గౌతమ బుద్ధుడు, మహాత్మా గాంధీ వంటి వారు పుట్టిన నేల ఇది. నా ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి పాకిస్థాన్‌ను ఆహ్వానించాను. కానీ శాంతి కోసం ప్రయత్నం చేసిన ప్రతిసారి మాత్రం శత్రుత్వం, ద్రోహమే ఎదురైంది. ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరిచేందుకు ఇస్లామాబాద్ నాయకత్వంపై ఆధారపడి ఉంది. నాపై చేసే విమర్శలను స్వాగతిస్తాను. అది ప్రజాస్వామ్యం ఆత్మ అని నేను నమ్ముతాను.
Also Read: రన్యా రావుతో ఇద్దరు మంత్రులకు లింక్..బీజేపీ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్
నా బాల్యమంతా పేదరికంలోనే గడిచింది. నాకుండే తెల్ల బుట్లను మెరిపించడం కోసం స్కూల్‌లో పడేసిన సుద్ద ముక్కలను తెచ్చుకునేవాడిని. ఒక గొప్ప పని కోసం ఉన్నత శక్తి నన్ను ఇక్కడికి పంపించింది. నేను ఒంటరివాన్ని కాదు. నన్ను ఇక్కడికి పంపిన వాళ్లే నాకు తోడుగా ఎప్పుడూ ఉంటారు. మా నాన్న టీ షాప్‌కి వచ్చేవారిని చూసి నేను చాలా నేర్చుకున్నాను. నా ప్రజాజీవితంలో వాటినే అమలు చేస్తున్నాను. ఆర్ఎస్‌ఎస్ దేశమే ప్రధానమని బోధిస్తుంది. ఆ సంస్థ నుంచి ఎన్నో విలువలను నేర్చుకున్నాను. మానవ సేవే మాధవ సేవ అని '' ప్రధాని మోదీ అన్నారు.