డిజిటల్ అరెస్టులపై కేంద్రం చర్యలు.. మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ కీలక విషయాలు పంచుకున్నారు. యానిమేషన్ రంగంలో భారత్ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోందన్నారు. డిజిటల్ అరెస్టులను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 27 Oct 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి ప్రతి నెల చివరి ఆదివారం ప్రధాని మోదీ మన్ కీ బాత్‌లో మాట్లాడుతుంటారు. ఆ నెలలో దేశంలో జరిగిన పురోగతి గురించి, ఇంకా ఇతర అంశాల గురించి, స్పూర్తిదాయక వ్యక్తుల గురించి ప్రజలతో పంచుకుంటారు. 2014లో మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈ కార్యక్రమం ఇప్పటివరకు కొనసాగుతూనే ఉంది. ఈ కార్యక్రమానికి కూడా కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. ప్రధాని ఏయే అంశాలపై మాట్లాడుతారో అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే ఈరోజు జరిగిన 115వ మన్ కీ బాత్ కార్యక్రమంలో కూడా ప్రధాని పలు కీలక విషయాలు పంచుకున్నారు. భారత్‌లో యానిమేషన్ రంగం అభివృద్ధి చెందడం, అలాగే డిజిటల్ అరెస్టులపై కూడా ప్రధాని ప్రస్తావించారు. అభివృద్ధి పథంలో యానిమేషన్ రంగం '' ఇద్దరు గొప్ప హిరోల జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నాం. అక్టోబర్ 31న సర్దార్ పటేల్ జయంతి, నవంబర్ 15న బిర్సా ముండా జయంతిని ఘనంగా జరుపుతాం. ఈ ఇద్దరు గొప్ప వ్యక్తులకు దేశాన్ని ఐక్యం చేయాలనే దార్శనికత ఉండేది. చోట భీమ్ లాగే.. క్రిష్ణా, మోటు పట్లు, బాల్ హనుమాన్ లాంటి యానిమేటెడ్ సిరిస్‌లకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. భారత్‌కు చెందిన యానిమేటెడ్ పాత్రలను ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడుతున్నారు. యానిమేషన్ రంగంలో భారత్ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. భారత గేమింగ్ స్పేస్ కూడా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ గేమ్స్ ఫేమస్ అవుతున్నాయి. Also Read: రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట.. 9 మందికి తీవ్రంగా గాయాలు ఈ ప్రపంచ యనిమేషన్‌లో 'మేడ్ ఇన్ ఇండియా, మేడ్ బై ఇండియా' ప్రకాశవంతంగా వెలిగిపోతోంది. ఈరోజు మనదేశ యువత మన కల్చర్‌ను ప్రతిబింబించే ఒరిజినల్ కంటెంట్‌ను క్రియేట్ చేస్తోంది. ప్రపంచదేశాలు వారిని చూస్తున్నాయి. యానిమేషన్ రంగం ఇతర ఇండస్ట్రీలకు కూడా బలాన్నిస్తోంది. వర్చువల్ రియాలిటీ (VR) టూరిజంకు ప్రాధాన్యత దక్కుతోంది. అక్టోబర్ 28న ప్రపంచ యానిమేషన్ దినోత్సవాన్ని జరుకోబోతున్నాం. అన్ని రంగాల్లో భారత్ అద్భుతాలు ఈ పండుగల సీజన్‌లో ఆత్మనిర్భార్ భారత్ ప్రచారాన్ని మరింత బలోపేతం చేయాలి. వొకల్ ఫర్ లోకల్ అనే మంత్రంతో మనం షాపింగ్‌లు చేస్తున్నాం. భారత్‌ను స్వయం ఆధారిత దేశంగానే కాదు.. ఆవిష్కరణలకు గ్లోబల్ పవర్‌హౌస్‌గా ఏర్పాటు చేయాలి. 'స్వయం ఆధారిత' అనేది కేవలం మన విధానంగా మారడమే కాదు.. మన అభిరుచిగా మారిపోయింది. పదేళ్ల క్రితం భారత్‌లో కాంప్లెక్స్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారని ఎవరైనా చెబితే ఎవరూ నమ్మేవారు కాదు. కానీ ఇప్పుడు వాళ్లే దేశ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. స్వయం ఆధారిత దేశంగా మారుతున్న భారత్.. ప్రస్తుతం అన్ని రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తోంది. Also Read: ఝార్ఖండ్ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ధోని.. డిజిటల్ అరెస్టుల నియంత్రణ చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనే విధానమే లేదు. ఇది ఒక మోసం, అబద్ధం. ఇలా చేస్తున్నటివంటి నేరస్తులు సమాజానికి శత్రువులు. డిజిటల్ అరెస్టులో జరుగుతున్న ఇలాంటి మోసాలను అరికట్టేందుకు వివిధ దర్యాప్తు సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నాయి. ఈ దర్యాప్తు సంస్థల్లో సమన్వయాన్ని రూపొందించేందుకు నేషనల్ సైబర్ కో-ఆర్డినేషన్ సెంటర్ ఏర్పాటయ్యింది'' అని ప్రధాని మోదీ వివరించారు. #telugu-news #pm-modi #national-news #maan-ki-baat మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి