మరో రెండు రోజుల్లో మూడవ విడత పోలింగ్.. జేకేలో PM Modi ప్రచారం

సర్జికల్ స్ట్రైక్‌తో శత్రుదేశానికి భయం పుట్టించామని.. మళ్ళీ ఏదైనా చేయాలంటే భయపడేలా చేశామని అన్నారు ప్రధాని మోదీ. జమ్మూ–కశ్మీర్‌‌లో మూడవ విడత ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో ఆయన ఈరోజు ప్రచారం నిర్వహించారు.

New Update
j&k

 PM Modi: 

2016లో సర్జికల్ స్ట్రైక్‌తో శత్రు భూభాగంలో దాడి చేయగల కొత్త భారత్‌ను ప్రపంచానికి చాటి చెప్పిందని ప్రధాని అన్నారు. దీంతో శత్రుదేశం భయపడిందని..మరోసారి మన దేశం మీదకు రావడానికి ఆలోచిస్తుందని అన్నారు. సర్జికల్ స్ట్రైక్ జరిగినట్లు రుజువు కావాలని అడిగిన కాంగ్రెస్ ను ప్రజలు ఎప్పటికీ క్షమించలేరని మోదీ చెప్పారు. జమ్మూ–కాశ్మీర్‌‌లో ఈసారి కచ్చితంగా బీజేపీ గెలుస్తుందని అన్నారు. ఇక్కడి ప్రజలు ఎన్‌సీ, పీడీపీ, కాంగ్రెస్ కుటుంబాలతో విసిగిపోయారన్నారు. ప్రజలు అవినీతి పార్టీలను కోరుకోరని మోదీ చెప్పారు. జమ్మూ–కాశ్మీర్‌‌లో మూడవ విడత ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో ఆయన ఈరోజు ప్రచారం నిర్వహించారు. దీని భాగంగా పిల్లల మంచి భవిష్యత్ కోసం బీజేపీని గెలిపించాలని కోరారు. రెండు దశల్లో జరిగిన పోలింగ్‌లో బీజేపీకే ఓటు వేశారన్నారు. భారీ మెజార్టీతో బీజేపీ గెలవబోతుందని స్పష్టం చేశారు. అక్టోబర్ 12 విజయదశమి ఘనంగా జరుపుకోవాలంటే బీజేపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. జమ్మూ ప్రాంతంలోని ప్రజలపై ఉన్న చారిత్రక వివక్షను తొలగించేందుకు బీజేపీ (BJP) కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే తమ పాలలో జమ్మూ–కాశ్మీర్ (Jammu & Kashmir) ఎంతో అభివృద్ధి చెందిందని..ఇక్కడ కూడా అధికారంలోకి తమ పార్టీ వస్తే మరింత అభివృద్ధి గ్యారంటీ అని మోదీ హామీ ఇచ్చారు. 

Also Read :  టెన్త్, ఇంటర్ పరీక్షలపై CBSE సంచలన నిర్ణయం!

అక్టోబర్ 1న మూడవ విడతలో భాగంగా జమ్మూ, సాంబా, కథువా, ఉధంపూర్ జిల్లాల్లో పోలింగ్ జరగనుంది. ఇక్కడ నుంచి 24 మంది బీజేపీ అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. జమ్మూ జిల్లాలో 11, కథువాలో 6, సాంబా 3, ఉధంపూర్‌లో 4 సీట్లు ఉన్నాయి. ఇప్పటికే  జమ్మూ–కాశ్మీర్ ఓ రెండు దశల  పోలింగ్ పూర్తయింది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక్కడ ప్రధానంగా  ఎన్‌సీ, కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ ఉంది. అక్టోబర్ 8న ఎనికల ఫలితాలు వెల్లడించున్నారు.

Also Read :  పండగ సేల్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ డిస్కౌంట్లు!

Advertisment
Advertisment
తాజా కథనాలు