Deadly on-camera stunt : తుపాకీతో ఆట.. గుండెల్లోకి దూసుకెళ్లిన తూటా..ప్రాణం తీసిన రీల్స్‌ పిచ్చి

ఢిల్లీలో రీల్స్ పిచ్చితో చేసిన ఓవరాక్షన్‌ ఓ యువకుడి ప్రాణాలు తీసింది. తుపాకీతో స్టంట్‌ చేయబోయిన ఓ యువకుడు అక్కడి కక్కడే మృతి చెందాడు. లోడ్‌ చేసిన గన్‌తో రీల్‌ చేస్తుండగా.. అది పేలిపోవడంతో ఆ యువకుడు అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు.  

New Update
FotoJet (8)

Deadly on-camera stunt

Deadly on-camera stunt: సోషల్‌ మీడియా పుణ్యమా అని రీల్స్‌ పిచ్చి జనాలకు విపరీతంగా ముదిరింది. దీంతో ఏం చేస్తున్నామన్న కనీస అవగాహన లేకుండా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. వ్యూస్‌ కోసం మరికొంతమంది ప్రాణాలను పణంగా పెడుతున్నారు. తాజాగా ఢిల్లీలో రీల్స్ పిచ్చితో చేసిన ఓవరాక్షన్‌ ఓ యువకుడి ప్రాణాలు తీసింది. తుపాకీతో స్టంట్‌ చేయబోయిన ఓ యువకుడు అక్కడి కక్కడే మృతి చెందాడు. లోడ్‌ చేసిన గన్‌తో రీల్‌ చేస్తుండగా.. అది పేలిపోవడంతో ఆ యువకుడు అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు.  

FotoJet (7)

 తూర్పు ఢిల్లీకి చెందిన పవన్‌ ఓ రీల్‌ చేస్తుండగా పక్కనున్న స్నేహితుడు దాన్ని రికార్డ్‌ చేసినట్లు తెలుస్తోంది. గన్‌ బటన్‌ ఎలా నొక్కాలో పవన్‌ కు ఆయన మిత్రుడు చెబుతుంటే  పవన్‌ తుపాకీని లోడ్ చేసి. ఆ తర్వాత గన్‌ను ఛాతీకి గురిపెట్టుకొని కెమెరా వైపు చూసి నవ్వుతున్నట్లు వీడియో ఉంది. ఆ సమయంలో వీడియో రికార్డు చేస్తున్న వ్యక్తి ‘కాల్చొద్దు అన్నా..’ అని చెప్పినప్పటికీ.. పవన్‌ కంగారులో గన్‌  ట్రిగ్గర్‌ నొక్కేశాడు. వెంటనే ఆ బుల్లెట్‌ పవన్‌ గుండెల్లోకి దూసుకెళ్లింది. ఆ వెంటనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్పందించిన స్నేహితులు అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. వీడియో రికార్డు చేసిన పవన్‌ స్నేహితుడికి చెందిన తుపాకీనే పవన్‌ వాడినట్లు పోలీసులు గుర్తించారు. దానికి లైసెన్స్‌ ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisment
తాజా కథనాలు