Pawankalyan: హిందీపై పవన్ మళ్లీ సంచలన కామెంట్స్.. తనకు లబ్ది చేకూరిందంటూ!

ఏ భాషనైనా బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తానని పవన్ కల్యాణ్ అన్నారు. త్రిభాషా విధానంలో హిందీని మాత్రమే నేర్చుకోవాలని ఎవరూ చెప్పలేదంటూ సంచలన కామెంట్స్ చేశారు. ప్రతి భాషకూ గౌరవం ఇవ్వాలని, భాషా సంస్కృతులను గౌరవించడం తన ఏడు మార్గదర్శకాల్లో ఒకటన్నారు.

New Update
pawankalyan

pawankalyan

Pawankalyan: ఏ భాషనైనా బలవంతంగా రుద్దడాన్ని తాను వ్యతిరేకిస్తానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. త్రిభాషా విధానంలో హిందీని మాత్రమే నేర్చుకోవాలని ఎవరూ చెప్పలేదంటూ సంచలన కామెంట్స్ చేశారు. ప్రతి భాషకూ గౌరవం ఇవ్వాలన్నారు. భాషా సంస్కృతులను గౌరవించడం తన ఏడు మార్గదర్శకాల్లో ఒకటని తెలిపారు.

ఏడు మార్గదర్శకాల్లో ఒకటి..

ఈ మేరకు హిందీ భాష వివాదంపై ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన అవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో ప్రముఖ తమిళ కవి భారతీయార్‌ కవితతో ప్రారంభించడం, ప్రసంగంలో తమిళం మాట్లాడటంపై ఓపెన్ అయ్యారు. హిందీ వల్ల తమిళానికి ముప్పు ఉందనే అంశంపై మాట్లాడుతూ.. ఏ భాషనూ బలవంతంగా రుద్ద కూడదన్నారు. అలా జరిగితే తానే వ్యతిరేకిస్తానని తెలిపారు. తమిళం నేర్చుకోవాలని ఎవరూ తనను ఒత్తిడి చేయలేదని, తానే నేర్చుకున్నానని వివరించారు. టీనేజ్‌లో ఉన్నప్పుడు జీవితం గురించి భయం కలిగేదని, దాని కోసం అన్వేషించగా ‘అచ్చమిల్లై అచ్చమిల్లై’ (భయంలేదు) అనే భారతీయార్‌ కవిత కనిపించిందని చెప్పారు. ఆ పదాలు తనకు ధైర్యం ఇచ్చాయన్నారు. 2014లో పార్టీని ప్రారంభించినప్పుడు కనుచూపు మేర చీకటే కనిపించిందని చెప్పారు. ఎలా ముందుకు వెళ్లాలో తెలియలేదని, మనసులో ఉన్న ధైర్యం తప్ప మరేమీ లేదన్నారు వపన్. 

Also read :  తల్లి డైరెక్షన్‌..కొడుకులు యాక్షన్‌.. షేక్​ పేట చోరీ కేసులో బిగ్‌ట్విస్ట్‌

ఏపీలో 30 తమిళ, 107 ఒరియా, 57 కన్నడ, 5 సంస్కృతం, 400 ఉర్దూ, 37 వేలకుపైగా తెలుగు భాష నేర్పించే పాఠశాలలు ఉన్నాయని చెప్పారు. వీటి ఉద్దేశం మాతృభాషలో బేసిక్‌ ఫౌండేషన్‌ను సులభంగా అర్థం చేసుకోవడమే అన్నారు. త్రిభాషా విధానంలో హిందీ మాత్రమే నేర్చుకోవాలని ఎవరూ చెప్పలేదు. నేను త్రిభాషా విధానంలో రూపొందినవాడినే. ఇంగ్లీష్, తెలుగు, హిందీ మాట్లాడటం వచ్చు. ఇది తనకు ఎంతో లబ్ధి చేకూర్చిందన్నారు. అయితే హిందీ నేర్చుకుని తెలుగుకు దూరంకాలేదన్నారు. బ్రిటిషువారి ఆంగ్లాన్ని నేర్చుకోవడానికి లేని భయం హిందీని నేర్చుకునేందుకు ఎందుకని ప్రశ్నించారు. హిందీతో ఉత్తరాది రాష్ట్రాల్లోని పలు భాషలు కనుమరుగయ్యాయనే వాదనను పవన్ కొట్టిపారేశారు.  త్రిభాషా విధానాన్ని రుద్దడంగా చూడడంలేదని, పలు భాషలు నేర్చుకునేందుకు అవకాశంగా భావిస్తున్నామని తెలిపారు. త్రిభాషా విధానం ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో సహజమని చెప్పారు. 

Also Read :  జైలు భోజనం వద్దు.. డ్రగ్స్ కావాలని సాహిల్ డిమాండ్

pawan-kalyan | hindi | tamil-nadu 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam attack : హ్యాట్సాఫ్..ఉగ్రదాడితో ముస్లిం ఆవేదన.. ఇస్లాంను వదిలేస్తూ కోర్టుకు!

ఉగ్రవాదులకు వ్యతిరేకంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న నిరసనల మధ్య, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక పాఠశాల ఉపాధ్యాయుడు సబీర్ హుస్సేన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇస్లాంను వదిలేసి ఓ సాధారణ మనిషిగా గుర్తింపు పొందేందుకు కోర్టును ఆశ్రయించారు.

New Update
west-bengal-teacher

west-bengal-teacher

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22వ తేదీ మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడిని భారత్ ఎప్పటికీ మరచిపోదు. బైసరన్ లోఅమాయక టూరిస్టులపై ఉగ్రవాదులు నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో 26 మంది స్పాట్ లోనే మరణించారు. ఈ ఘటనలో ఎక్కువ మంది పర్యాటకులు గాయపడ్డారు కూడా. టూరిస్టులను చంపేముందు ఉగ్రవాదులు వారు ఏ మతానికి చెందినవారో కూడా నిర్ధారించుకున్నారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న నిరసనల మధ్య, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక పాఠశాల ఉపాధ్యాయుడు పెద్ద అడుగు వేశాడు. స్కూల్ టీచర్ అయిన సబీర్ హుస్సేన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఇది నా వ్యక్తిగత నిర్ణయం

ఇస్లాంను వదిలేసి ఓ సాధారణ మనిషిగా గుర్తింపు పొందేందుకు కోర్టును ఆశ్రయించనున్నట్లు వెల్లడించారు. కశ్మీర్ లో హింసకు మతాన్ని సాధనంగా ఉపయోగించడాన్ని అంగీకరించలేనని తెలిపారు.  మతం పేరుతో ప్రాణాలు తీయడం బాధను కలిగిస్తోందని ..  అందుకే ఇస్లాంను త్యజిస్తున్నానని వెల్లడించారు. అయితే తన నమ్మకాలను తన కుటుంబంపై రుద్దబోనని అతను స్పష్టం చేశాడు. నా భార్య, పిల్లలకు ఈ విషయంలో ఏ మార్గాన్ని ఎంచుకున్నా వారికి స్వేచ్ఛ ఉంటుందని తెలిపారు. నేను ఏ మతాన్ని అగౌరవపరచడం లేదని ఇది తన వ్యక్తిగత నిర్ణయం అని తెలిపాడు. ప్రతిదీ మతం చుట్టూ తిరుగుతున్న ప్రపంచంలో తాను జీవించాలనుకోవడం లేదని హుస్సేన్ అన్నారు. 

Also Read :  Veeraiah Chowdary Murder Case : టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్యకేసులో కీలక పరిణామం..నిందితులు ఎవరంటే...

Advertisment
Advertisment
Advertisment