/rtv/media/media_files/2025/03/26/p4fdsh5iKUHHV4166xfK.jpg)
Pamban Railway Bridge Photograph: (Pamban Railway Bridge)
ప్రధాని నరేంద్ర మోడీ శ్రీరామనవమిన తమిళనాడులోని రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయంలో ప్రార్థనలు చేయనున్నారు. అనంతరం పంబన్ వంతెనను ప్రారంభించనున్నారు. ఇది ఇండియాలోనే ఫస్ట్ వర్టికల్ లిఫ్ట్ రైల్వే బ్రిడ్జ్. భారత ప్రధాన భూభాగంలోని రామేశ్వరాన్ని పంబన్ ద్వీపంతో ఈ బ్రిడ్జ్ కలుపుతుంది.
#WATCH | Rameswaram, Tamil Nadu: The new Pamban Railway Bridge, connecting Rameswaram Island with the mainland, has been completed. India’s first vertical lift sea bridge is expected to be operational by April, restoring rail connectivity and improving transportation in the… pic.twitter.com/eCZs4GxXVA
— ANI (@ANI) March 23, 2025
The new Pamban bridge, Rameshwaram under construction. pic.twitter.com/7WAvrRIMYL (1/1)
— anand mahindra (@anandmahindra) October 28, 2023
రైల్వే రాకపోకలకు అనుగుణంగా ఏప్రిల్ 6న 2.10 కిలోమీటర్ల విస్తీర్ణంలో పంబన్ రైల్వే బ్రిడ్జ్ ఓపెన్ చేయనున్నారు. బ్రిటిష్ కాలం నాటి పాత పంబన్ వంతెన స్థానంలో ఈ కొత్త బ్రిడ్జ్ అందుబాటులోకి రానుంది. ఇది ఒక శతాబ్దానికి పైగా పనిచేస్తోంది. 2019 నవంబర్‌లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన తర్వాత వంతెన నిర్మాణం ఫిబ్రవరి 2020లో ప్రారంభమైంది. కోవిడ్ 19 కారణంగా వంతెన నిర్మాణం ఆలస్యమైంది.
PM Narendra Modi to inaugurate the newly built Pamban vertical lift sea bridge at Rameswaram on April 6th... #TN #Infra 🌉🚊
— Chennai Updates (@UpdatesChennai) March 26, 2025
pic.twitter.com/4OxUV14E26
కొత్త పంబన్ వంతెన లెటెస్ట్ ఆటోమేటెడ్ టెక్నాలజీతో నిర్మించబడిన వర్టికల్ బ్రిడ్జ్. వంతెన మధ్య భాగం నిలువుగా 22 మీటర్ల ఎత్తుకు ఎత్తబడుతుంది. దీంతో షిప్‌లు కింది నుంచి వెళ్తాయి. ఇది పూర్తిగా ఆటోమేటెడ్ ఎలక్ట్రోమెకానికల్ సిస్టమ్. ఈ లిఫ్టింగ్ ఆపరేషన్‌కు 5 నిమిషాల 30 సెకన్లు మాత్రమే పడుతుంది. ఈ జాయింట్ బ్రిడ్జ్ రైల్వే రాకపోకలకు అంతరాయం కలగకుండా ఉంటుంది.