OYO New Rule: లవర్లకు ఓయో బిగ్ షాక్.. పెళ్లి కాని వారికి ఇక నో రూమ్!

ప్రేమికులకు 'ఓయో' బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. రూమ్స్ బుకింగ్‌లో కొత్త చెక్‌-ఇన్‌ పాలసీ తీసుకురాబోతున్నట్లు తెలిపింది. ఇకపై పెళ్లికాని జంటలకు రూమ్‌ ఇవ్వడం కుదరదని ప్రకటించింది. ఈ రూల్స్ మొదట మేరఠ్‌ నుంచి స్టార్ట్ చేయబోతున్నట్లు పవాస్‌ శర్మ చెప్పారు.

New Update
oyo

Oyo Check-in policy

OYO: ప్రేమికులకు 'ఓయో' బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. రూమ్స్ బుకింగ్‌లో కొత్త చెక్‌-ఇన్‌ పాలసీ తీసుకురాబోతున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఇకపై పెళ్లికాని జంటలకు రూమ్‌ ఇవ్వడం కుదరదని, ఈ రూల్స్ మొదట మేరఠ్‌ నుంచి స్టార్ట్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 

చెక్‌-ఇన్‌ పాలసీ..

ఈ కొత్త చెక్‌-ఇన్‌ పాలసీలో ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో రూమ్ బుక్ చేసేకునేవారు పెళ్లికి సంబంధించిన ప్రూఫ్స్ చూపించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. మేరఠ్‌లోని హోటళ్లలో ఈ పద్ధతిని తక్షణమే అమల్లోకి తీసుకురాబోతున్నట్ల తెలిపింది. ఇక్కడ రూల్స్ ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా మరిన్ని నగరాల్లోనూ ప్రవేశపెడతామని ఓయో మెనేజ్ మెంట్ వెల్లడించింది. 

ఇది కూడా చదవండి: TG News: సివిల్స్‌ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. సీఎం రేవంత్ కీలక ప్రకటన!

సెఫ్టీ అందించే విధంగా..

'గెస్టులకు ఓయో బాధ్యతాయుత, సురక్షితమైన వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటుంది' అని ఓయో నార్త్ ఇండియా రీజియన్‌ హెడ్‌ పవాస్‌ శర్మ చెప్పారు. ఫ్యామిలీస్, స్టూడెంట్స్, ఒంటరిగా వచ్చే ప్రయాణికులకు సెఫ్టీ అందించే విధంగా వసతులు కల్పించేందుకు కొత్త చెక్ -ఇన్‌ పాలసీ తీసుకొచ్చాం. మరింతమంది కస్టమర్స్, బుకింగ్స్ పెంచేందుకు తాము తీసుకొస్తున్న రూల్ ఉపయోగపడుతుందని తెలిపారు.

ఇది కూడా చదవండి: Girls Hostel: గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్ ఇష్యూ.. వెలుగులోకి సంచలనాలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Moon: 2040 నాటికి చంద్రుడిపైకి భారత వ్యోమగామి

చంద్రునిపై సొంత వ్యోమగామనిని దింపేందుకు భారత్ సిద్ధమవుతోంది 2040 నాటికి జాబిల్లిపై భారత వ్యోమగామి అడుగుపెడతాడని ఆశిస్తున్నామని కేంద్ర మంత్రి డా.జితేంద్ర సింగ్‌ వెల్లడించారు. భారత్‌కు సొంతగా అంతరిక్ష కేంద్రం 2035 నాటికి ఉంటుందన్నారు.

New Update
 Indian Astronaut to land On Moon By 2040

Indian Astronaut to land On Moon By 2040

చంద్రయాన్ 3 విజయం సాధించిన తర్వాత అంతరిక్ష రంగంలో భారత్‌ దూసుకుపోతోంది. ఇప్పుడు ఏకంగా చంద్రునిపై సొంత వ్యోమగామనిని దింపేందుకు సిద్ధమవుతోంది. అయితే 2040 నాటికి జాబిల్లిపై భారత వ్యోమగామి అడుగు పెడతాడని ఆశిస్తున్నామని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డా.జితేంద్ర సింగ్‌ వెల్లడించారు. ఓ జాతీయ మీడియా ఏర్పాటు చేసిన రైజింగ్‌ భారత్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే భారత్‌కు సొంతగా అంతరిక్ష కేంద్రం 'భారత్‌ స్పేస్ స్టేషన్' 2035 నాటికి ఉంటుందని చెప్పారు.  

Also Read: గురుకులాల్లో కోడింగ్‌ శిక్షణ.. ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు !

ఇదిలాఉండగా చంద్రయాన్ 3 మిషన్‌లో ప్రజ్ఞాన్ రోవర్‌ను చంద్రుడి దక్షిణ ధ్రవంపై ల్యాండింగ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇలా చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశగా భారత్ నిలిచింది. అంతేకాదు చంద్రుని దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న మొదటి దేశంగా సరికొత్త రికార్డు సృష్టించింది. మళ్లీ ఇప్పుడు చంద్రయాన్‌ 4 పై ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈసారి చంద్రుడి ఉపరితల నమూనాలను భూమిపైకి తీసుకొచ్చేందుకు ఇస్రో రంగం సిద్ధం చేస్తోంది. 2027లో చంద్రయాన్ 4 ప్రయోగాన్ని చేపట్టనుంది.  

Also Read: అమెరికా ఆహారం బంద్‌..11 దేశాలకు కష్టం!

ఇందులో ఎల్‌వీఎం 3 రాకెట్‌ను రెండుసార్లు ప్రయోగిస్తారు. చంద్రయాన్‌ 4 మిషన్‌కు సంబంధించిన ఐదు భిన్న భాగాలను నింగిలోకి పంపించి వాటిని కక్ష్యలోనే బిగిస్తారు. అయితే చంద్రుడి పైకి భారత వ్యోమగామిని పంపించేవరకు చంద్రయాన్ ప్రయోగాలు జరుగుతూనే ఉంటాయని ఇస్రో ఇప్పటికే స్పష్టం చేసింది. మరోవైపు భారత తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌ను వచ్చే ఏడాది చేపట్టనున్నారు. 

Also Read: పసిబిడ్డల ఉసురు తీస్తున్న అక్రమ సంబంధాలు.. ఈ ఏడాది ఎంతమందిని చంపేశారంటే!

chandrayan-3 | isro | space-station | indian-space-station

Advertisment
Advertisment
Advertisment