/rtv/media/media_files/2025/04/01/1Nsnsuw3Dsp3UO6n78Xq.jpg)
Gas Cylinder Price
గుడ్ న్యూస్.. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర తగ్గింది. ఏకంగా రూ.41 రూపాయలు తగ్గిస్తూ అయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. తగ్గించిన ధరలు మంగళవారం నుంచి అమల్లోకి రానున్నట్లు చమురు సంస్థలు వెల్లడించాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1762కు చేరుకుంది. హైదరాబాద్లో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 44 తగ్గి, రూ. 1,985.50కి చేరింది.
Prices of commercial LPG gas cylinders revised with effect from today.
— Vani Mehrotra (@vani_mehrotra) April 1, 2025
The rate of a 19 kg commercial LPG gas cylinder has been reduced by Rs 41. In Delhi, the retail sale price of a 19 kg commercial LPG cylinder is Rs 1,762 from now. #LPG
2025 ఫిబ్రవరి ఒకటో తేదీన కమర్షియల్ సిలిండర్ ధరను రూ.6.50 తగ్గించారు. మార్చి ఒకటో తేదీన రూ. 5.5 రూపాయలు పెంచారు. కమర్షియల్గ్యాస్ సిలిండర్లను ఎక్కువగా హోటల్, రెస్టారెంట్లలలో ఉపయోగిస్తుంటారు. ఈ ధరలు తగ్గితే రెస్టారెంట్లపై భారం తగ్గుతుంది. తద్వారా ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. ఇది కస్టమర్లకు ఉపయోగకరం అవుతుంది.
డొమెస్టిక్ సిలిండర్ ధరలో నో ఛేంజ్
అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న ముడి చమురు ధరలకు అనుగుణంగా సిలిండర్ ధరలను నిర్ణయించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చమురు కంపెనీలకు అనుమతి ఇచ్చింది. అందుకని ప్రతి నెలా అయిల్ కంపెనీలు ధరలను సవరిస్తూ ఉంటాయి. ఇక డొమెస్టిక్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పులేదు. 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర ప్రస్తుతం రూ. 818.50గా ఉంది.
Also Read: Ap-Telangana: ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు అలర్ట్.. 32 రైళ్లు రద్దు, మరో 11 దారి మళ్లింపు..!
Also Read:Minor boy accident: 15ఏళ్ల బాలుడు కారు డ్రైవింగ్.. 2ఏళ్ల చిన్నారి మృతి