/rtv/media/media_files/2025/03/15/vDTN1D0glYKm3FiEZTn3.jpg)
Padma Awards
కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పద్మ అవార్డులు-2026 కోసం నామినేషన్లు ప్రారంభమయ్యాని తెలిపింది. జులై 31 లోపు పద్మ అవార్డులకు సంబంధించి నామినేషన్లను ఆయా రంగాల్లో పంపాలని సూచించింది. ఈ అవార్డులకు సంబంధించిన నామినేషన్లు, సిఫార్సులు జాతీయ అవార్డుల పోర్టల్ https://awards.gov.in లో స్వీకరిస్తామని చెప్పింది. పద్మ విభాగంలో పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు ఇస్తారన్న సంగతి తెలిసిందే.
Also Read: శిశువును మంటలపై తలకిందులుగా వేలాడదీసిన భూతవైద్యుడు.. చివరికీ
1954లో దేశంలో అత్యున్న గౌరవ అవార్డులైన పద్మ పురస్కారాలను ప్రారంభించారు. సాహిత్యం, సామాజిక సేవ, కళలు, క్రీడలు, సైన్స్, పౌరసేవ, వ్యాపారం ఇలా వివిధ రంగాల్లో గొప్ప విజయాలు పొందిన వారికి ఈ అవార్డులు అందిస్తారు. వైద్యులు, శాస్త్రవేత్తలు తప్ప ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఈ అవార్డులకు అర్హులు కాదు. అయితే పద్మ అవార్డులను ప్రజా అవార్డులుగా మార్చేందుకు కట్టుబడి ఉన్నామని కేంద్రం తెలిపింది.
Also Read: ఓలా, ఉబర్ డ్రైవర్ల ముసుగులో...బంగ్లాదేశ్ యువతుల అక్రమ రవాణాలో వెలుగులోకి సంచలన విషయాలు...
అంతేకాదు ఈ అవార్డులకు పౌరులు కూడా తమను తాము నామినేట్ చేసుకోవచ్చని చెప్పింది. బలహీన వర్గాలు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులతో సహా సమాజంలో నిస్వార్థ సేవలు చేస్తున్న వారు ఈ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కేంద్రం ప్రకటించింది. వారి సేవలకు ఈ అవార్డుల ద్వారా నిజమైన గుర్తింపు వస్తుందని పేర్కొంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు హోం మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌లో ఉన్నట్లు స్పష్టం చేసింది.
Also Read: నేను హిందీని వ్యతిరేకించలేదు.. పవన్ సంచలన పోస్ట్!