టాటా గ్రూప్స్ వారసుడొచ్చేశాడు.. నోయెల్ టాటా గురించి ఆసక్తికర విషయాలు రతన్ టాటా మరణంతో టాటా వ్యాపార సామ్రాజ్యనికి వారుసుడెవరేదానిపై ఆసక్తి నెలకొంది. చివరికి రతన్ టాటా సవతి తల్లి కుమారుడైన నోయెల్ టాటా వారసుడిగా నియమితులయ్యారు. నోయెల్ టాటా గురించి మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 11 Oct 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి ప్రముఖ పారిశ్రామిక వేత్త.. టాటా గ్రూప్స్ ఛైర్మన్ రతన్ టాటా బుధవారం రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో టాటా వ్యాపార సామ్రాజ్యనికి వారుసుడెవరేదానిపై ఆసక్తి నెలకొంది. చివరికి రతన్ టాటా సవతి తల్లి కుమారుడైన నోయెల్ టాటా వారసుడిగా నియమితులయ్యారు. తాజాగా టాటా ట్రస్ట్ ఛైర్మన్‌గా నోయెల్‌ను ఎంపిక చేస్తూ బోర్టు నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి టాటా సామ్రాజ్యాన్ని నోయెల్ టాటానే నడిపించనున్నారు. ఇంతకు నోయెల్ టాటా గురించి మరికొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నోయెల్ టాటా ఎవరూ ? రతన్ టాటాకు నోయెల్ టాటా వరుసకు సోదరుడు అవుతారు. రతన్ టాటా తల్లిదండ్రులు నావల్ టాటా, సూని టాటా అన్న సంగతి తెలిసిందే. అయితే ఈ దంపతులు 1940లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నావల్ టాటా స్విట్జర్లాండ్‌కు చెందిన సిమోన్ అనే మరో మహిళను పెళ్లి చేసుకున్నారు. వీళ్లకి పుట్టిన కుమారుడే నోయెల్ టాటా. అంటే రతన్ టాటా సవతి తల్లి కుమారుడు అన్నమాట. నోయెల్ టాటా 1957లో జన్మించాడు. యూకేలోని ససెక్స్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీని అందుకున్నాడు. INSEADలో ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రొగ్రామ్ (IEP)ని పూర్తి చేశారు. ఇక నోయెల్ టాటా.. టాటా సన్స్‌లో అతిపెద్ద వాటాదారు అయిన పల్లోంజి మిస్త్రీ కుమార్తె ఆలూ మిస్త్రీని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ముగ్గురు పిల్లలు. వాళ్లు మాయ టాటా, నెవిల్లే టాటా, లీ టాటా. ఈ ముగ్గురు కూడా టాటా సంస్థలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 40 ఏళ్ల అనుబంధం నోయెల్ టాటాకు టాటా గ్రూప్‌తో గత 40 ఏళ్లుగా అనుబంధం ఉంది. ఆయన కంపెనీలో బోర్డుల్లో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహించారు. ట్రెంట్, టాటా ఫైనాన్షియల్ లిమిటెడ్, వోల్టాస్, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్‌లకు ఈయనే ఛైర్మన్‌గా ఉన్నారు. టాటా స్టీల్ అండ్ టైటాన్ కంపెనీ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్‌గా.. అలాగే సర్ రతన్ టాటా ట్రస్ట్, సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ బోర్డుల్లో ట్రస్టీగా కూడా ఉన్నారు. 2010 నుంచి 2021 వరకు టాటా ఇంటర్నేషనల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా సేవలందించారు. ఆయన పదవీకాలంలో కంపెనీ టర్నోవర్‌ను 500 మిలియన్ డాలర్ల నుంచి ఏకంగా 3 వేల బిలియన్ డాలర్ల వరకు పెంచారు. ప్రస్తుతం టాటా గ్రూప్‌ను హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్ నిర్వహిస్తోంది. ఇందులో టాటా కుటుంబంతో అనుబంధం ఉన్న ఐదు ట్రస్టులు ఉన్నాయి. ఇందులో సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్ అనేవి కీలకమైనవి. టాటాసన్స్‌లో ఈ రెండింటికే ఎక్కవగా వాటాలు ఉన్నాయి. దాదాపు 52 శాతం వాటా ఈ రెండు ట్రస్టీల సొంతం. ఇక ఈ ఐదు ట్రస్టులకు కలిపి టాటా గ్రూప్ హోల్డింగ్స్ కంపెనీలో మొత్తం 67 శాతం వాటా ఉంది. రతన్ టాటా ఉన్నంతవరకు టాటా గ్రూప్స్‌కు ఛైర్మన్‌గా ఆయనే కొనసాగారు. రతన్ టాటా మరణించాక టాటా గ్రూప్స్‌ను ఎవరూ నడిపిస్తారన్న ప్రశ్నలు వెల్లువెత్తాయి. ఈ సమయంలోనే నోయెల్ టాటాతో పాటు ముగ్గురు పేర్లు బయటికొచ్చాయి. ఇక చివరికి నోయెల్ టాటాకే వ్యాపార సామ్రాజ్య పగ్గాలు అప్పగిస్తూ బోర్డు సభ్యులు నిర్ణయించారు. దీనివల్ల సర్ దొరాబ్జీ టాటా ట్రస్టుకు 11వ ఛైర్మన్.. సర్ రతన్ టాటా ట్రస్ట్‌కు ఆరో ఛైర్మన్‌గా నోయెల్ టాటా నియమితులయ్యారు. Also Read : జాతకంలో పెళ్లి రేఖలు లేవా? ఇందుకే టాటా వివాహం చేసుకోలేదా? #telugu-news #national-news #tata-group #ratan tata #noel-tata మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి