Nithin Gadkari: రోడ్డు ప్రమాద బాధితులకు కొత్త పథకం–నితిన్ గడ్కరీ

రోడ్డు ప్రమాద బాధితుల కోసం కొత్త పథకాన్ని ప్రకటించారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ. ప్రమాదం జరిగిన వెంటనే 24 గంటల్లో పోలీసులకు సమాచారం అందించిన తర్వాత బాధితులకు 1.5 లక్షలను తక్షణమే అందిస్తామని తెలిపారు.

New Update
Nithin Gadkari: కారులో ఆరు ఎయిర్‌ బ్యాగులు.. కేంద్ర మంత్రి ఏమన్నారంటే!

దేశంలో రోడ్డు ప్రమాదాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. చాలాసార్లు బాధితులకు సరైన సహాయం అందక చనిపోతున్నారు. అలా కాకుండా ఉండడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాలను ప్రవేశపెడుతోంది. దీనికి గురించి ఈరోజు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడారు. రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్సను మొదలుపెడతామని చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో దీన్ని పైలట్ ప్రాజెక్టు కింద మొదలుపెట్టామని...అందులో కొన్ని బలహీనతలను గమనించామని  చెప్పారు. వాటిని మెరుగుపర్చి దేశం మొత్తం అమలు చేస్తామని తెలిపారు.

ఇది కూడా చదవండి: Pandem kollu: కాలు దువ్వుతున్న పందెం కోళ్లు.. రూ.100కోట్ల బెట్టింగ్

రహదారి భ్రదతే ప్రధానం..

ఇక రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే 24 గంటల్లో పోలీసులకు సమాచారం అందించిన తర్వాత బాధితులకు 1.5 లక్షలను తక్షణమే అందిస్తామని తెలిపారు. అలాగే హిట్ అండ్ కేసులో మృతి చెందితే 2 లక్షల వరకు అందజేస్తామని ప్రకటించారు. అన్నిటికన్నా ముఖ్యంగా తమ మొదటి ప్రాధాన్యత అసలు ప్రమాదాలు జరగకుండా చూడడం, రహదారి భద్రత అని చెప్పారు నితిన్ గడ్కరీ. 2024లో రోడ్డు ప్రమాదాల్లో 1.8 లక్షల మంది చనిపోగా.. వారిలో 30 వేల మంది హెల్మెట్ ధరించకపోవడం వల్లే చనిపోయారు. ప్రాణాంతక ప్రమాదాలకు గురైన వారిలో 66% మంది 18-34 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్నవారు. ఇక స్కూళ్లు, కాలేజీల్లో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల తప్పుల వల్ల 10,000 మంది పిల్లలు చనిపోయారని లెక్కలు చూపించారు  కేంద్ర మంత్రి. డ్రైవింగ్ లైసెన్స్‌లు లేకపోవడం వలన దాదాపు 30 వేలమంది దాకా మృతి చెందారని తెలిపారు నితిన్ గడ్కరీ. 

ఇది కూడా చదవండి: Ponguleti: బాంబులు పేలడం స్టార్ట్.. KTR అరెస్ట్‌పై పొంగులేటి సంచలనం!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BREAKING : సుప్రీం కోర్టు నూతన CJIగా BR గవాయ్ పేరు

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ పేరును కొలిజియం సిఫార్సు చేసింది. ప్రస్తుతం చీఫ్ జస్టిస్ గా ఉన్న సంజీవ్ ఖన్నా మే 13న పదవి విరమణ పొందనున్నారు. ఆయన తర్వాత భూషణ్ రామకృష్ణ అత్యున్నత న్యాయ స్థానం చీఫ్ జస్టిస్ గా కొనసాగనున్నారు.

New Update
new CJI

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ పేరును కొలిజియం సిఫార్సు చేసింది. ప్రస్తుతం చీఫ్ జస్టిస్ గా ఉన్న సంజీవ్ ఖన్నా మే 13న పదవి విరమణ పొందనున్నారు. ఆయన తర్వాత భూషణ్ రామకృష్ణ అత్యున్నత న్యాయ స్థానం చీఫ్ జస్టిస్ గా కొనసాగనున్నారు. మే 14న తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  2019లో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమించబడ్డారు. సుప్రీంకోర్టకు రాకముందు ముంబై హైకోర్టు జడ్జిగా చాలాకాలం పని చేశారు. మహారాష్ట్రలోని అమరావతిలో గవాయ్ జన్మించారు. 64 ఏళ్ల జస్టిస్ బిఆర్ గవాయ్ నవంబర్ 2025 లో పదవీ విరమణ చేయనున్నారు. ఆయన సిజెఐ పదవీకాలం 2025 మే 14 నుంచి నవంబర్ 24 వరకు కొనసాగుతుంది.

ఈయన తండ్రి ఏఆర్ గవాయ్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాని స్థాపించారు. లోక్ సభ, రాజ్యసభలో ఎంపీగా కూడా ఉన్నారు. ఎమ్మెల్యే, బీహార్, కేరళా,సిక్కిం రాష్ట్రాల గవర్నర్ గా కూడా పని చేశారు. 

 

Advertisment
Advertisment
Advertisment