జనవరి 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఇక 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 13 వరకు సాగుతాయి. మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు.
Also Read: ఇక ఫేక్ కాల్స్‌కు గుడ్‌బై.. ఈ కొత్త ఫీచర్‌తో ట్రూకాలర్ అవసరం లేదు
కేంద్ర బడ్జెట్ కోసం కార్మికుల నుంచి పారిశ్రామికవేత్తల వరకు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈసారి బడ్జెట్‌లో ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే అవకాశాలున్నట్లు సమాచారం. గృహ రుణ వడ్డీ మినహాయింపులు కూడా పెరుగనున్నట్లు తెలుస్తోంది. అలాగే పౌరులకు సాధికారత కల్పించడం, పన్నులు సరళీకృతం చేయడం వంటి ప్రధాన సంస్కరణలు, ప్రోత్సహకాలను మోదీ ప్రభుత్వం తీసుకురానుందనే ప్రచారం నడుస్తోంది.
Also Read: 15 రోజుల్లో 34 మంది మావోయిస్టులు మృతి.. దూకుడు పెంచుతున్న కేంద్రం
ఈ బడ్జెట్‌లో మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్ పొడిగింపును ప్రకటించే ఛాన్స్ ఉంది. ఈ పథకం 2025 మార్చిలో ముగియనుంది. ఈ స్కీమ్ కాలపరిమితి పొడిగించకపోతే కొత్త పథకాన్ని కూడా ప్రకటించవచ్చు. అలాగే మహిళలకు ఆదాయపు పన్ను రాయితీని ఇవ్వడం, పన్ను భారం తగ్గించడం లాంటివి బడ్జెట్‌లో ప్రకటించే అవకాశం ఉందని పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also Read: ఆయుష్మాన్ భారత్ ఒప్పందం.. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలకు సుప్రీం కోర్టు బ్రేక్